వాట్సప్‌లో అదిరే ఫీచర్ వచ్చింది

Written By:

వాట్సప్ యూజ‌ర్ల‌కు గుడ్‌న్యూస్‌ చెప్పింది. మీ ఫేవ‌రెట్ చాట్స్ కోసం ఇక ప్ర‌తిసారి కింది వ‌ర‌కు స్క్రోల్ చేయాల్సిన అవ‌స‌రం లేకుండా, మీరు ఎక్కువగా చాట్ చేసే గ్రూపులు, వ్య‌క్తుల‌ను పిన్ చేసుకొని ఎప్పుడూ పైనే ఉండేలా చేసే స‌రికొత్త ఫీచ‌ర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆండ్రాయిడ్ యూజ‌ర్లు కూడా ఇప్పుడీ కొత్త ఆప్ష‌న్‌ను వాడుకోవ‌చ్చు.

వాట్సప్ లో నీకు తెలియని ఫీచర్స్

వాట్సప్‌లో అదిరే ఫీచర్ వచ్చింది

గ‌రిష్ఠంగా మూడు ఫేవ‌రెట్ చాట్స్‌ను యూజ‌ర్లు ఎంపిక చేసుకోవ‌చ్చు. మీ ఫేవ‌రెట్ చాట్ అనుకున్న దానిని ట్యాప్ చేసి హోల్డ్ చేస్తే పైన పిన్ ఐకాన్ ఒక‌టి క‌నిపిస్తుంది. దానిని సెల‌క్ట్ చేసుకుంటే.. ఆ చాట్ ఇక ఎప్పుడూ పైనే ఉంటుంది. ఒక‌వేళ దీనిని అన్‌పిన్ చేయాల‌నున్నా మ‌ళ్లీ ఇలాగే చేయాలి. వాట్సప్ లో దాగిన ఇంకొన్ని ఫీచర్ల గురించి తెలుసుకుందామా..

వాట్సప్ సైలెంట్‌గా ఫీచర్‌ని దింపేసింది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఏదైనా మెసేజ్ ను బుక్క్ మార్క్

మీ వాట్సప్ అకౌంట్ లో ఏదైనా మెసేజ్ ను బుక్క్ మార్క్ చేయదలచినట్లయితే బుక్ మార్క్ చేయాలనుకుంటున్న మెసేజ్ పై టాప్ చేసి కొద్ది సేపు ఉంచండి. అప్పుడు, టాప్ బార్ పై delete, copy, forward అలానే star iconలు కనిపిస్తాయి. వాటిలో స్టార్ ఐకాన్ పై టాప్ చేసినట్లయితే మెసేజ్ బుక్ మార్క్ కాబడుతుంది.

వాట్సప్ నోటిఫికేషన్లు పాపప్ కావాలంటే..?

స్క్రీన్ ఆఫ్ అయిన సమయంలోనూ వాట్సప్ నోటిఫికేషన్లు పాపప్ కావాలంటే..? వాట్సాప్ మెసేజ్ అందిన ప్రతిసారి ఫోన్ ను అన్ లాక్ చేయవల్సి వస్తుందా..? ఈ సమస్యకు వాట్సప్ చక్కటి పరిష్కారం చూపుతోంది. ఫోన్ లాక్ చేసిన ఉన్నప్పటికి వాట్సాప్ మెసేజ్లను చూసేందుకు ఇలా చేయండి. సెట్టింగ్స్ లోకి వెళ్లి Notifications > Popup Notifications > Only When Screen Off.

ఈమెయిల్ కు పంపుకోవటం ఏలా..

మీ వాట్సప్ మెసేజ్ లను ఈమెయిల్ కు పంపుకోవటం ఏలా..? మీ వాట్సప్ సంభాషణలను అనేక రకాలుగా బ్యాకప్ చేసుకునే వీలుంది. ముందుగా మీరు బ్యాకప్ చేయాలనుకుంటున్న పర్సనల్ లేదా గ్రూప్ చాట్ పై టాప్ చేయండి. ఇప్పుడు మీకు అనేక ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిలో email chat పై టాప్ చేయండి. ఇప్పుడు కోరుకుంటున్న conversation మొత్తం మీ ఈ మెయిల్ అడ్రస్ లోకి సెండ్ కాబడుతుంది.

నచ్చిన బ్యాక్‌గ్రౌండ్‌తో

మీ వాట్సప్ అకౌంట్‌ను నచ్చిన బ్యాక్‌గ్రౌండ్‌తో తీర్చిదిద్దండి. ఇలా చేయాలంటే స్ర్కీన్ కుడివైపు పై భాగంలో కనిపించే మూడు నిలువు చుక్కల పై టాప్ చేయండి. ఇప్పుడు మీకు సెట్టింగ్స్ ఆప్షన్ కనిపిస్తుంది. సెట్టింగ్స్‌లోకి వెళ్లినట్లయితే మీకు వాల్ పేపర్ ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఆప్షన్ లోకి వెళ్లినట్లయితే గ్యాలరీ ఓపెన్ అవుతుంది. వాటిలో మీకు నచ్చిన ఫోటోను బ్యాక్ గ్రౌండ్ గా సెట్ చేసుకోవచ్చు.

షార్ట్ కట్

మీ వాట్సప్ అకౌంట్ లోని కాంటాక్ట్స్ కు షార్ట్ కట్ లను ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారా..? అయితే, ఇలా చేయండి. షార్ట్ కట్ ను ఏర్పాటు చేయాలనుకుంటున్న కాంటాక్ట్ పై టాప్ చేయండి. ఇప్పుడు అనేక ఆప్షన్ప్ స్ర్కీన్ పై పాపప్ కాబడతాయి. వాటిలో మొదటి ఆప్షన్ అయిన ‘add chat shortcut'ను సెలక్ట్ చేసుకున్నట్లయితే మీ కాంటాక్ట్ కు షార్ట్ కట్ క్రియేట్ కాబడుతుంది.

డేటా ఖర్చును

డేటా ఖర్చును కంట్రోల్ చేసుకునే అవకాశాన్ని వాట్సప్ కల్పిస్తోంది. అకౌంట్ సెట్టింగ్స్ లో వెళ్లి Media auto-download ఆప్షన్ ను సెలక్ట్ చేసుకోవటం వల్ల మీకు నచ్చిన డేటాను మాత్రమే డౌన్ లోడ్ చేసుకునే వెసలబాటు ఉంటుంది.

వాట్సప్ వెబ్‌

మీ వాట్సప్ అకౌంట్, వాట్సప్ వెబ్‌కు అనుసంధానించుకోవాలంటే ముందుగా మీ డెస్క్‌టాప్ వెబ్‌బ్రౌజర్‌లోని web.whatsapp.comలోకి వెళ్లండి. ఓ క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది. ఇపుడు మీ ఫోన్ కుడి వైపు కార్నర్‌లో కనిపించే మూడు చుక్కలు పై క్లిక్ చేసి WhatsApp Web ఆప్షన్ ను సెలక్ట్ చేసుకుని క్యూ ఆర్ కోడ్ ను స్కాన్ చేయండి. ఇలా చేయాలంటే తప్పనిసరిగా రెండు డివైజ్ లు ఇంటర్నెట్ కు కనెక్ట్ అయి ఉండాలి.

చేంజ్ నెంబర్

ఆండ్రాయిడ్ యూజర్లు మెనూ‌లోని సెట్టింగ్స్‌లోకి వెళ్లి అకౌంట్స్ విభాగంలో కనిపించే చేంజ్ నెంబర్ ఆప్షన్ ద్వారా తమ వాట్సప్ నెంబర్‌ను మార్చుకోవచ్చు.

డెస్క్‌టాప్ నోటిఫికేషన్స్

వాట్సప్ డెస్క్‌టాప్ నోటిఫికేషన్స్ క్రోమ్ ప్లగిన్‌ను ఇన్స్‌స్టాల్ చేసకోవటం ద్వారా మీ వాట్సప్ అకౌంట్నో కు సంబంధించిన నోటిఫికేషన్‌‍లను డెస్క్‌టాప్ పై పొందవచ్చు. బ్రౌజర్ క్లోజ్ చేసి ఉన్నప్పటికి నోటిఫికేషన్ అలర్ట్స్ మీకు కనిపిస్తాయి.

లాస్ట్ సీన్ ఆప్షన్‌

మీ వాట్సప్ అకౌంట్‌లో లాస్ట్ సీన్ ఆప్షన్‌ను డిసేబుల్ చేయాలనుకుంటే Settings > Account > Privacy > Last Seen, and select ‘Nobody'.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
WhatsApp Pinned Chats Feature Comes to Android read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot