వాట్సప్‌లోకి మరో రెండు కొత్త ఫీచర్లు

Written By:

సరికొత్త ఫీచర్లతో ఎప్పటికప్పుడు కష్టమర్లను ఆకట్టుకునే వాట్సప్ ఇప్పుడు సరికొత్త ఫీచర్లతో వినియోగదారులను అలరించేందుకు సిద్ధమైంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఫీచర్ల ద్వారా మీరు జిప్ ఫార్మాట్ లో ఫోటోలు పంపుకోవచ్చు. అలాగే వీడియోలను డౌన్ లోడ్ చేసుకోకుండానే వీక్షించవచ్చు. ఇంతవరకు బీటా వర్షన్లో అందుబాటులో ఉన్న ఈ ఫీచర్లు ప్రస్తుతం అన్ని స్మార్ట్ ఫోన్లలోనూ అందుబాటులోకి వచ్చాయి.

కొత్త ఏడాదికి ముందే వాట్సప్ కొన్ని ఫోన్లకు షాకిచ్చింది !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వీడియోలను ముందుగా డౌన్లోడ్ చేసుకుని

వాట్సప్ లో ఎవరైనా పంపిన వీడియోలను ముందుగా డౌన్లోడ్ చేసుకుని, ఈ తరువాత వాటిని చూసే అవకాశం ఉండేది. ప్రస్తుతం తీసుకొచ్చిన ఫీచర్తో ఇకపై వీడియోలను డౌన్లోడ్ చేసుకునే అవసరం లేకుండానే నేరుగా చూసుకోవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అవసరమయితేనే స్మార్ట్‌ఫోన్లలో డౌన్లోడ్

ఈ వీడియోలు మనకు అవసరమయితేనే స్మార్ట్‌ఫోన్లలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేకుంటే అవి అలానే వాట్సప్ లో ఉండిపోతాయి.

జిఫ్ ఫార్మాట్

ఇక జిఫ్ ఫార్మాట్ లో 6 సెకండ్ల నిడివి గల వీడియోను పంపుకోవచ్చు. దీనికి సంబంధించిన మీకు అనేక జిప్ ఇమేజ్ లు వాట్సప్ లో కనిపిస్తాయి.

క్రాప్

దీంతో పాటు ఫొటోలను యాప్లోనే మనకు కావాల్సిన సైజ్లో క్రాప్ చేసుకోవచ్చు. కొత్తగా ఈ ఫీచర్ ని ప్రవేశపెట్టారు.

పొటోలు నేరుగా

వాట్సప్లో అవతలి వ్యక్తి పంపిన ఇటువంటి పొటోలు నేరుగా ఫోన్లో వాట్సప్ డైరెక్టరీలోని యానిమేటెడ్ జిఫ్ ఇమేజెస్ ఫోల్డర్లోకి చేరిపోతాయి. వాట్సప్ అప్‌డేట్ కొట్టి వెంటనే ఫీచర్లను అప్‌డేట్ చేసుకోండి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
WhatsApp rolls out GIF image support, shared video streaming for Android users read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot