WhatsApp లో ప్రైవసీ కొత్త నోటిఫికేషన్ వచ్చిందా!! అంగీకరించండి లేకపోతే...
ఫేస్‌బుక్ యాజమాన్యంలోని వాట్సాప్ ప్రపంచం మొత్తం మీద విపరీతమైన ఆదరణను కలిగి ఉంది. ఇది ఇప్పుడు తన యొక్క సర్వీస్ యొక్క నిబంధనలు మరియు గోప్యతా విధానంలోని మార్పుల గురించి వినియోగదారులకు తెలియజేయడానికి యాప్ యొక్క నోటిఫికేషన్లను పంపడం ప్రారంభించింది. ఈ నోటిఫికేషన్‌లో వాట్సాప్ తన నిబంధనలు మరియు గోప్యతా విధానాన్ని అప్ డేట్ చేస్తోందని కంపెనీ పేర్కొంది.

వాట్సాప్ కొత్త నోటిఫికేషన్
వాట్సాప్ యాజమాన్య సంస్థ పంపిన నోటిఫికేషన్‌లో మీ యొక్క డేటాను వాట్సాప్ ఎలా ప్రాసెస్ చేస్తుంది, వ్యాపారాలు తమ వాట్సాప్ చాట్‌లను స్టోర్ చేయడానికి మరియు నిర్వహించడానికి ఫేస్‌బుక్ హోస్టీ సేవలను ఎలా ఉపయోగించగలవు మరియు ఇప్పుడు ఫేస్‌బుక్ కంపెనీ ఉత్పత్తిలో ఫేస్‌బుక్ కంపెనీ భాగస్వాములను ఫేస్‌బుక్ కంపెనీ ప్రొడక్ట్‌లో ఏకీకృతం చేస్తుంది.

వాట్సాప్ కొత్త నిబంధనలు
వాట్సాప్ యొక్క కొత్త నిబంధనలు మరియు ప్రైవసీ విధానం ఫిబ్రవరి 8, 2021 నుండి అమల్లోకి వస్తుందని కంపెనీ పేర్కొంది. వాట్సాప్ అకౌంటును ఉపయోగించడం కొనసాగించడానికి వినియోగదారులు సంస్థ పంపే నిబంధనలను అంగీకరించాల్సి ఉంటుందని సంస్థ తమ యొక్క నోటిఫికేషన్‌లో పేర్కొంది. దీని అర్థం సంస్థ యొక్క నిబంధనలను అంగీకరించకపోతే కనుక కంపెనీ వారి అకౌంటును తొలగించే అవకాశం ఉంది. వినియోగదారులు తమ అకౌంటును తొలగించాలనుకుంటే లేదా దీనిపై మరింత సమాచారం కావాలనుకుంటే సహాయ కేంద్రాన్ని సందర్శించవచ్చని నోటిఫికేషన్‌లో వాట్సాప్ పేర్కొంది.

వాట్సాప్ కొత్త మార్పులు
వాట్సాప్ తన యొక్క వినియోగదారులకు కొత్త నోటిఫికేషన్‌ను పంపడమే కాకుండా ఫిబ్రవరి 8, 2021 తరువాత వాట్సాప్ లో జరిగే కొత్త మార్పుల గురించి వివరణాత్మక సమాచారంతో వాట్సాప్ తన వెబ్‌సైట్‌ను కూడా అప్ డేట్ చేసింది. "వాట్సాప్ యొక్క ప్రైవసీ విధానం అనేది మేము ఏ సమాచారాన్ని సేకరిస్తాము మరియు ఇది మిమ్మల్ని ఎలా ప్రభావితం చేస్తుంది అనే దాని గురించి మాట్లాడుతుంది. అలాగే ఇది మీ గోప్యతను కాపాడటానికి మేము తీసుకునే చర్యలను కూడా వివరిస్తుంది. అందువల్ల పంపిన మెసేజ్లు మా ద్వారా స్టోర్ చేయబడవు మరియు మీరు ఎవరితో కమ్యూనికేట్ చేస్తారనే దానిపై మీకు నియంత్రణను ఇస్తుంది "అని వాట్సాప్ తెలిపింది.


Click it and Unblock the Notifications








