వాట్సాప్‌లో కొత్త అప్‌డేట్!!! ఫార్వార్డ్ నకిలీ వార్తలకు చెక్....

|

కోవిడ్ -19 కు సంబంధించి వాట్సాప్‌లో నకిలీ వార్తలు వైరస్ కంటే అతివేగంగా స్ప్రెడ్ అవుతున్నాయి. వీటి కారణంగా ప్రజలలో అనవసరమైన ఉద్రిక్తతకు లోనయి భయాందోళనలకు గురిఅవుతున్నారు. నకిలీ వార్తలను ఒకరి నుంచి మరొకరికి ఫార్వర్డ్ చేయడాన్ని అరికట్టడానికి మరియు ఆపడానికి వాట్సాప్ ఇప్పుడు క్రొత్త అప్ డేట్ ను తీసుకురావడానికి పరీక్షిస్తోంది.

WhatsApp సెర్చ్ ఫీచర్
 

WhatsApp సెర్చ్ ఫీచర్

ఇది వెబ్‌లో ఫార్వార్డ్ చేసిన మెసేజ్ల యొక్క అంతేంటిసిటీ, వాస్తవికత మరియు మూలాన్ని శోధించడానికి మరియు తనిఖీ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. సెర్చ్ ఫీచర్ చాలా కాలంగా ట్రయల్‌లో ఉంది. ఇది తప్పుడు వార్తలను నియంత్రించి ఫిల్టర్ చేసి నిజమైన మరియు విశ్వసనీయ సమాచారానికి ప్రాముఖ్యత ఇస్తుంది కాబట్టి కంపెనీ త్వరలో అప్ డేట్ ను ప్రారంభించవచ్చు. అయితే ఈ రోజు వరకు అధికారిక లాంచ్ ఏదీ వాట్సాప్ ప్రకటించలేదు.

వాట్సాప్ అప్‌డేట్ : సెర్చ్ ఫీచర్

వాట్సాప్ అప్‌డేట్ : సెర్చ్ ఫీచర్

WABetaInfo నివేదికల ప్రకారం ఫేస్బుక్ యాజమాన్యంలోని వాట్సాప్ యాప్ దాని తాజా బీటా వెర్షన్ 2.20.94 లో వెబ్‌లోని సెర్చ్ మెసేజ్లను పరీక్షించింది. ట్రయల్స్ మరియు రిపోర్టుల ప్రకారం ఫార్వార్డ్ చేసిన మెసేజ్ల పక్కన ఒక సెర్చ్ గుర్తు కనిపిస్తుంది. ఇది గూగుల్ సెర్చ్‌లో మెసేజ్ యొక్క విశ్వసనీయతను శోధించమని వినియోగదారులను అడుగుతుంది. వినియోగదారులు ఈ సెర్చ్ ట్యాబ్‌ను నొక్కితే మొత్తం మెసేజ్ గూగుల్ సెర్చ్ పట్టీలో కాపీ చేయబడుతుంది మరియు సంబంధిత సమాచారం వినియోగదారులకు చూపబడుతుంది. కోవిడ్ -19 కు సంబంధించి నకిలీ వార్తల వ్యాప్తి వేగంగా పెరిగిన కాలంలో ఈ కొత్త ఫీచర్ దేశానికి సహాయపడుతుంది.

WHO బాట్‌

WHO బాట్‌

నకిలీ వార్తలను అరికట్టడానికి వాట్సాప్ WHO బాట్‌ను విడుదల చేసింది. ఇది వైరస్ వ్యాప్తికి సంబంధించి సరైన మరియు అంతేంటిక్ సమాచారంతో వినియోగదారులను అప్‌డేట్ చేస్తుంది. వాట్సాప్ కొత్త సెర్చ్ ఫీచర్ యూజర్లు తమకు అందుతున్న మెసేజ్లకు సంబంధించి పూర్తి సమాచారం పొందడానికి అనుమతిస్తుంది.

వాట్సాప్ యూజర్లు తొలగించిన మెసేజ్లను చదవగలరు
 

వాట్సాప్ యూజర్లు తొలగించిన మెసేజ్లను చదవగలరు

వాట్సాప్ రెగ్యులర్ అప్‌డేట్స్ మరియు ప్రైవసీ నిబంధనలకు ప్రసిద్ది చెందింది. వినియోగదారుల ఆసక్తిని ఆశ్చర్యపరిచే లక్షణాలలో ఒకటి మెసెజ్లను తొలగించే ఎంపిక. అయినప్పటికీ వినియోగదారులు థర్డ్ పార్టీ ప్లాట్‌ఫామ్ వాట్స్‌రిమూవెడ్ + ఉపయోగించి తొలగించిన మెసేజ్లను చదవగలరు. మూడవ పార్టీ యాప్ వినియోగదారులు తమ వాట్సాప్‌లో అందుకునే అన్ని నోటిఫికేషన్‌లు మరియు మెసేజ్లను చదవడానికి అనుమతిస్తుంది. అయినప్పటికీ ఈ యాప్ కొన్ని అనుమతులు ఇవ్వడం ద్వారా వినియోగదారుల భద్రతకు ఆటంకం కలిగిస్తుంది. అలాగే ఈ యాప్ ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది

Most Read Articles
Best Mobiles in India

English summary
WhatsApp Users Now Search Forwarded Messages on Web

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X