WhatsAppలో తొలగించిన మెసేజ్ లను ఆండ్రాయిడ్‌లో చూడడం ఎలా?

|

ప్రపంచంలో ప్రస్తుతం అత్యంత ప్రాచుర్యం పొందిన మెసేజింగ్ యాప్ లలో వాట్సాప్ ఒకటి. ఫేస్‌బుక్ యాజమాన్యంలోని వాట్సాప్ 2017 లో వాట్సాప్ నుండి ప్రజలు తమ సొంత మెసేజ్ లను తొలగించడానికి అనుమతించే ఒక ఫీచర్ ను విడుదల చేసింది.

వాట్సాప్

ఈ ఫీచర్ ఉపయోగించడం ద్వారా ప్రజలు వారు పంపిన ఫోటోలు, వీడియోలు లేదా మెసేజ్లను వాట్సాప్ నుండి పూర్తిగా తొలగించడానికి అనుమతిని ఇస్తుంది. అంటే తొలగించిన తర్వాత మీతో సహా ఎవరూ ఈ మెసేజులను చూడలేరు. అయితే వాట్సాప్‌లో తొలగించిన మెసేజ్లను చూడటానికి ఒక మార్గం ఉంది. దీని గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వాట్సాప్ ఫీచర్

వాట్సాప్ ఫీచర్

ఒకవేళ మీరు తొలగించిన సందేశాలను బహిర్గతం చేయడానికి గల గైడ్‌ను ఉపయోగించాలని యోచిస్తున్నట్లయితే మరియు అధికారికంగా మద్దతు లేని వాట్సాప్ ఫీచర్లను యాక్సెస్ చేయడానికి కొంత మొత్తంలో చెల్లించాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి. ఈ సందర్భంలో మేము సూచించే పద్ధతి OTP మరియు బ్యాంక్ బ్యాలెన్స్ వివరాలతో అన్ని నోటిఫికేషన్‌లను మూడవ పార్టీ యాప్ బహిర్గతం చేస్తుంది. ఈ డేటా ప్రైవేట్‌గా ఉంటుందని మేము హామీ ఇవ్వలేము. దయచేసి ఈ పద్ధతిని మీ స్వంత పూచీతో ఉపయోగించుకోండి మరియు ఇతరులు తొలగించిన వాట్సాప్ మెసేజ్లను చూడటం మాత్రం మీకు మంచిది కాదు.

తొలగించిన వాట్సాప్ మెసేజ్ లను చూడడం ఎలా?

తొలగించిన వాట్సాప్ మెసేజ్ లను చూడడం ఎలా?

ఎవరైనా వాట్సాప్ మెసేజ్ ను తొలగించినప్పుడు చాట్‌లో ‘ఈ మెసేజ్ తొలగించబడింది' అని రాసే ఆప్షన్ చూపిస్తుంది. మీకు Android స్మార్ట్‌ఫోన్ ఉంటే కనుక తొలగించిన మెసేజ్ లను చూడటానికి కింద ఉన్న ఈ దశలను అనుసరించండి.

1. గూగుల్ ప్లే స్టోర్ నుండి WhatsRemoved + ని డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయండి.

2. డౌన్‌లోడ్ అయిన తర్వాత ఈ యాప్ అడిగే అన్ని అనుమతులకు యాక్సిస్ ఇవ్వడం ద్వారా యాప్ ను ఓపెన్ చేసి దాన్ని సెటప్ చేయడం పూర్తి చేయండి.

3. అన్ని రకాల అనుమతులను మంజూరు చేసిన తర్వాత యాప్ కు తిరిగి వెళ్లండి. ఇప్పుడు మీరు నోటిఫికేషన్‌లను సేవ్ చేయాలనుకుంటున్న మరియు యాప్ లను ఎంచుకొండి. ఈ జాబితాలో వాట్సాప్ ను ఎంచుకోని నెక్స్ట్ బటన్ మీద నొక్కండి.

4.తదుపరి స్క్రీన్‌లో Yes, సేవ్ ఫైల్స్, Allow ఆప్షన్ల మీద నొక్కండి. ఇది యాప్ ను సెటప్ చేయడాన్ని పూర్తి చేస్తుంది. ఇది తదుపరి దశ ఉపయోగం కోసం సిద్ధంగా ఉంటుంది.

5. ఈ దశలు అన్ని పాటించడం ద్వారా మీరు వాట్సాప్‌లో స్వీకరించే ప్రతి నోటిఫికేషన్‌లు మరియు తొలగించిన మెసేజ్ లు అన్ని వాట్స్‌రెమోవ్డ్ + యాప్ లో స్టోర్ అవుతాయి. మీరు చేయాల్సిందల్లా యాప్ ను ఓపెన్ చేయడం మరియు ఎగువ పట్టీ నుండి వాట్సాప్ ను ఎంచుకోవడం.


IOS కోసం ప్రస్తుతం అటువంటి యాప్ ఏదీ అందుబాటులో లేదు. ఇది మీ గోప్యతకు మంచిది కాదు.

 

Best Mobiles in India

English summary
How To View WhatsApp Deleted Messages On Android Phones

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X