ఈ ఫోన్లకు వాట్సప్ షాకిచ్చింది, డిసెంబర్ 31 వరకే లాస్ట్

Written By:

వాట్సప్..ఇప్పుడు ఎక్కడ చూసినా, ఏ స్మార్ట్ ఫోన్ వినియోగదారుడిని అడిగినా ముందుగా వారి నుంచి వచ్చే పదం. అయితే ఇప్పుడు కొన్ని ఎంపిక చేసిన ఫోన్లకు వాట్సప్ ఆగిపోతోంది. ఈ ఏడాది చివరి వరకే ఈ ఫోన్లలో వాట్సప్ పనిచేస్తుంది. ఆ తరువాత పనిచేయదని వాట్సప్ తెలిపింది. అవేంటో ఓ సారి చూద్దాం.

ఇకపై ఈ ఫోన్లలో వాట్సప్ బంద్: మీ ఫోన్ ఏదో చెక్ చేసుకోండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

పాత సాఫ్ట్‌వేర్ వెర్షన్లు కలిగిన స్మార్ట్‌ఫోన్లకు

పాత సాఫ్ట్‌వేర్ వెర్షన్లు కలిగిన స్మార్ట్‌ఫోన్లకు ఈ ఏడాది తర్వాత వాట్సాప్ మెసేంజర్ అప్ డేట్స్ రావని వాట్సప్ తెలిపింది.

ఫిబ్రవరిలో వాట్సప్ ఓ ప్రకటన

ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్లను విడుదల చేసే వాట్సప్ .. పాత స్మార్ట్ ఫోన్ వెర్షన్లకు అప్‌డేట్స్ ను నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఫిబ్రవరిలో వాట్సప్ ఓ ప్రకటన విడుదల చేసింది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

డిసెంబర్ 31 తర్వాత

కొన్ని సింబియన్, బీబీఓఎస్ (బ్లాక్ బెర్రీ ఆపరేటింగ్ సిస్టం), విండోస్, ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ల పాత వెర్షన్లలో డిసెంబర్ 31 తర్వాత వాట్సప్ అప్ డేట్స్ ను నిలిపివేయనున్నట్లు చెప్పింది.

2017 నుంచి మార్కెట్లో

2017 నుంచి మార్కెట్లో స్మార్ట్‌ఫోన్ల హవా పెరుగుతుందనే ఊహాగానాల నడుమ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొంది.

సైబర్ దాడులు జరిగే ఆస్కారం

అంతేకాకుండా పాత సాఫ్ట్‌వేర్ వెర్షన్లు కలిగిన ఫోన్లలో వాట్సప్‌ను వినియోగించడం వల్ల సైబర్ దాడులు జరిగే ఆస్కారం ఎక్కువగా ఉంటుందని, థర్డ్ పార్టీ డెవలపర్స్ అందించే అప్లికేషన్లను వినియోగించడం ద్వారా కూడా ఫోన్లలో వైరస్ చొరబడే అవకాశం ఉంటుందని చెప్పింది.

ఆగిపోయో ఫ్లాట్ పాంల వివరాలు

బ్లాక్ బెర్రీ (బ్లాక్ బెర్రీ 10 వరకూ), నోకియా ఎస్ 40, నోకియా సింబియన్ ఎస్ 60, ఆండ్రాయిడ్ 2.1, ఆండ్రాయిడ్ 2.2, విండోస్ ఫోన్ 7.1, ఐఫోన్ 3 జీఎస్ / ఐఓఎస్ 6 ఈ ఫోన్లకు వాట్సప్ ఆగిపోనుంది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
You may not be able to use WhatsApp after December 31 read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot