ఇంట్లో వైఫై రాకెట్ లెక్కన దూసుకుపోవాల్సిందే

Written By:

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది. అలాగే దానికి వైఫై ని కూడా సెట్ చేసి ఇంట్లో స్మార్ట్ ఫోన్ ఉన్న వాళ్లంతా వాడుతుంటారు. అయితే కొన్ని సార్లు ఈ వైఫై కనక్షన్ అంతగా పని చేయదు..స్లోగా పని చేస్తూ ఉంటుంది. అయితే ఇక మీకు ఆ బెంగ అక్కరలేదు. ఈ చిట్కాలు పాటించారంటే మీ ఇంట్లో వైఫై రాకెట్ లెక్కన దూసుకుపోతుంది.

Read more:సెల్ఫీ కొత్తగా ట్రై చేద్దాం గురూ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1. వైఫై ఇంటి మధ్యలో పెట్టండి

మీ ఇంట్లో వైఫై ని ఎక్కడ పెడుతున్నారో ఓ సారి చెక్ చేసుకోండి. ఇంటి మధ్య భాగంలో వైఫైని సెట్ చేస్తే అన్ని చోట్లా అందుతుంది.

2.టీవీల మధ్య వైఫై రూటర్ ని ఉంచకండి

టీవీల దగ్గర వైఫై రూటర్ ని ఉంచండం వల్ల సిగ్నల్స్ సరిగా రావు..సో ఇది ఒకసారి చెక్ చేసుకోండి

3. లేటెస్ట్ టెక్నాలజీ వాడండి

లేటెస్ట్ వైఫై టెక్నాలజీని వాడటం మీ కంప్యూటర్ హర్డ్ వేర్ కు కూడా మంచిది.

4.కరెక్ట్ వైర్ లెస్ చానల్ సెట్ చేయండి

మీరు కరక్ట్ గా వాడుతున్న వైఫై ఛానల్ ని సెట్ చేయడం వల్ల మీ పని మరింత సులువు అవుతుంది. ఇందుకోసం వైఫై ఎనలైజర్ ను వాడండి.

5.కింద ఉంచకండి

వైఫై ని ఎప్పుడూ పైనే ఉంచండి. కింద ఉంచడం వల్ల సిగ్నల్స్ అంత తొందరగా అన్ని చోట్లకు రావు.

6.రూటర్ కు దగ్గర్లో ఎలక్ర్టానిక్ పరికరాలు వద్దు

రూటర్ కు దగ్గర్లో మీరు ఎటువంటి పరికరాలు ఉంచకండి అలా ఉంచడం వల్ల సిగ్నల్స్ త్వరగా అందుకోవు.

7.పాస్ వర్డ్ తో జాగ్రత్త

మీరు మీ పాస్ వర్డ్ ని వీలయినంత సీక్రెట్ గా ఉంచుకోవడం మంచింది.

8.మంచి ప్లగ్ వాడండి

వైఫై త్వరగా మీ దగ్గరకు చేరుకోవాలంటే ప్లగ్ కనక్షన్ బాగుండాలి..మంచి ప్లగ్ లు వాడటం తప్పనిసరి

9.పాత వైఫై కనెక్ట్

మీ పాత వైఫైలను కూడా ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది

10.మెసేజ్ సిగ్నల్

మీ వైఫై సిగ్నల్ ఎక్కడ వీక్ గాఉందో తెలుసుకోవడం కోసం మెసేజ్ సెట్ చేసుకోండి.

11.రూటర్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్

మీ వైఫై ఫాస్ట్ గా రావాలంటే రూటర్ సాఫ్ట్ వేర్ ని అప్ డేట్ చేసుకోండి.

12.ప్రాబ్లం ఎక్కడ ఉంది

అసలు ప్రాబ్లం ఎక్కడ ఉందో తెలుసుకుంటే పని మరింత సులువవుతుంది. అందుకోసం ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్ ని ఇలా సెట్ చేసుకుంటే మంచింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
here write 12 tips to make sure that at least your home Wi-Fi doesn't trouble you with slow connection
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot