రూ.15 700కే 4జిబి ల్యాపీ, 12 గంటలు బ్యాటరీ బ్యాకప్
4జిబి ర్యామ్ తో పాటు 16 జిబి ఇంటర్నల్ మెమొరీ, 11.6 ఇంచ్ ఐపీఎస్ డిస్ప్లే, 1366 x 768 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
విద్యార్ధుల కోసం ఏసర్ సరికొత్త ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. వీరితో పాటు ఐటీని మెయింటెనెన్స్ చేసే వారు కూడా ఈ ల్యాపీని ఉపయోగించుకోవచ్చని కంపెనీ చెబుతోంది. ఇందులో రబ్బర్ బంప్ కీ బోర్డ్ ఉండటం వల్ల దీనిని మీరు రఫ్ గా వాడుకోవచ్చు.
ఫ్రీ ఇంటర్నెట్, ఇండియాకి గూగుల్ వరాల జల్లులు

వాటర్ ప్రూప్ తో వచ్చిన ఈ ల్యాపీ ధర రూ. 15,700. ఫిబ్రవరి నుంచి దీని అమ్మకాలు ప్రారంభమవుతాయని కంపెనీ చెబుతోంది. 4జిబి ర్యామ్ తో పాటు 16 జిబి ఇంటర్నల్ మెమొరీని పొందుపరిచారు. మెమొరీని పెంచుకునే అవకాశం ఉంది. 11.6 ఇంచ్ ఐపీఎస్ డిస్ప్లే, 1366 x 768 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ను ఈ ల్యాపీ కలిగి ఉంది.

ఇంటెల్ సెలెరాన్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 3.5 కాంబో ఆడియో పోర్ట్ ఉంటుంది. క్రోమ్ ఓఎస్, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.0, హెచ్డీఎంఐ అదనపు ఆకర్షణలు, ఈ ల్యాపీ 12 గంటల బ్యాటరీ బ్యాకప్ నిస్తుందని కంపెనీ చెబుతోంది.


Click it and Unblock the Notifications








