యాపిల్ ఐప్యాడ్ మినీ vs సామ్‌సంగ్ గెలాక్సీ టాబ్ 2

By Super
|
 Apple iPad Mini vs Samsung Galaxy Tab 2 P3100: Mini Tablets Fight for Supremacy


యాపిల్, సామ్‌సంగ్‌ల మధ్య పేటెంట్ హక్కుల వివాదం కొనసాగుతున్న నేపధ్యంలో మరో వాడివేడి పోరుకు తెరలేచింది. దేశీయ మార్కెట్లో తాజాగా విడుదలైన ఆపిల్ ఐప్యాడ్ మినీ, సామ్‌సంగ్ గెలాక్సీ టాబ్ 2తో తలపడుతోంది. ఈ క్రమంలో రెండు టాబ్లెట్‌ల స్పెసిఫికేషన్‌ల పై తులనాత్మక అంచనా......

మీ కంప్యూటర్ వేగంగా పనిచేసేందుకు…(చిట్కాలు)

బరువు ఇంకా చుట్టుకొలత.....

యాపిల్ ఐప్యాడ్ మినీ: బరువు 308 గ్రాములు, చుట్టుకొలత 200 x 134.7 x 7.2మిల్లీ మీటర్లు,

సామ్‌సంగ్ గెలాక్సీ టాబ్ 2: బరువు 341 గ్రాములు, చుట్టుకొలత 193.7 x 122.4 x 10.5 మిల్లీ మీటర్లు,

డిస్‌ప్లే......

యాపిల్ ఐప్యాడ్ మినీ: 7.9 అంగుళాల ఎల్ఈడి బాక్లిట్ ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1024 x768పిక్సల్స్)

సామ్‌సంగ్ గెలాక్సీ టాబ్ 2: 7 అంగుళాల పీఎల్ఎస్ డిస్‌ప్లే, రిసల్యూషన్ 1024 x 600పిక్సల్స్,

ప్రాసెసర్......

యాపిల్ ఐప్యాడ్ మినీ: 1గిగాహెడ్జ్ డ్యూయల్‌కోర్ ఆపిల్ ఏ5 ప్రాసెసర్,

సామ్‌సంగ్ గెలాక్సీ టాబ్ 2: 1గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ టీఐ‌వోఎమ్ఏపీ 4430 ప్రాసెసర్,

ఆపరేటింగ్ సిస్టం....

యాపిల్ ఐప్యాడ్ మినీ: ఐవోఎస్ 6 (ప్రత్యేకతలు: ఆపిల్ మ్యాప్స్, మెరుగుపరచబడిన సిరీ అప్లికేషన్, సరికొత్త సఫారీ అప్లికేషన్, ఐక్లౌడ్ స్టోరేజ్, ఫోటో స్ట్ర్రీమ్ అప్లికేషన్, పాస్‌బుక్ అప్లికేషన్, ట్విట్టర్, ఫేస్‌బుక్),

సామ్‌సంగ్ గెలాక్సీ టాబ్ 2: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం (ప్రత్యేకతలు: ప్రాజెక్ట్ బట్టర్, ఆన్-స్ర్కీన్ నేవిగేషన్ బటన్స్, కాంట్రిక్టబుల్ ఆండ్రాయిడ్ నోటిఫికేషన్స్, రీసైజబుల్ అప్లికేషన్ విడ్జెట్స్, హై రిసల్యూషన్ కాంటాక్ట్ ఫోటోస్, ఆండ్రాయిడ్ బీమ్ అప్లికేషన్).

కెమెరా....

యాపిల్ ఐప్యాడ్ మినీ: 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఐసైట్ టెక్నాలజీ), 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),

సామ్‌సంగ్ గెలాక్సీ టాబ్ 2: 3 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

స్టోరేజ్......

యాపిల్ ఐప్యాడ్ మినీ: ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్ 16జీబి/32జీబి/64జీబి, 512 ఎంబి ర్యామ్,

సామ్‌సంగ్ గెలాక్సీ టాబ్ 2: ఇంటర్నల్ మెమెరీ 8జీబి/16జీబి, 1జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

కనెక్టువిటీ......

యాపిల్ ఐప్యాడ్ మినీ: లైట్నింగ్ పోర్ట్, వై-ఫై, బ్లూటూత్,

సామ్‌సంగ్ గెలాక్సీ టాబ్ 2: వై-పై 802.11 బి/జి/ఎన్, వై-ఫై డైరెక్ట్, బ్లూటూత్ 3.0, మైక్రోయూఎస్బీ 2,0.

బ్యాటరీ........

యాపిల్ ఐప్యాడ్ మినీ: 16.3 డబ్ల్యూహెచ్ఆర్ లిపో బ్యాటరీ (10 గంటల బ్యాకప్),

సామ్‌సంగ్ గెలాక్సీ టాబ్ 2: 4000ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ (20 గంటల టాక్‌టైమ్, 800 గంటల స్టాండ్‌బై),

ధర........

యాపిల్ ఐప్యాడ్ మినీ: ఐప్యాడ్ మినీ 16జీబి వై-ఫై వర్షన్ ధర రూ.21,900, ఇప్యాడ్ మినీ 16జీబి వై-ఫై+3జీ వర్షన్ ధర రూ.29,900. ఐప్యాడ్ మినీ 32జీబి వై-ఫై వర్షన్ ధర రూ.27,900. ఐప్యాడ్ మినీ 32జీబి వై-ఫై+3జీ వర్షన్ ధర రూ.35,900.

ఐప్యాడ్ మినీ 64జీబి వై-ఫై వర్షన్ ధర రూ.33,900. ఐప్యాడ్ మినీ 64జీబి వై-ఫై+3జీ వర్షన్ ధర రూ.41,900.

సామ్‌సంగ్ గెలాక్సీ టాబ్ 2: ప్రారంభ మోడల్ ధర రూ.19,700.

తీర్పు.......

పెద్దదైన డిస్‌ప్లే, ఐసైట్ టెక్నాలజీతో కూడిన ఉత్తమ కెమెరా, లైట్నింగ్ కనెక్టర్ వంటి ఆధునిక ఫీచర్లను కోరుకునే వారికి యాపిల్ ఐప్యాడ్ మినీ ఉత్తమ ఎంపిక. వాయిస్ కాలింగ్ సపోర్ట్, తక్కువ ధర, ఎక్ప్‌ప్యాండబుల్ స్టోరేజ్ ఆప్షన్‌లను కోరుకునే వారికి గెలాక్సీ టాబ్ 2 సరియైన ఎంపిక.

కీబోర్డ్ షార్ట్‌కట్‌లు!

Read in English

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X