24 గంటల్లో ఇంటిని నిర్మించే సరికొత్త 3డీ ప్రింటర్!

Posted By:

 24 గంటల్లో ఇంటిని నిర్మించే 3డీ ప్రింటర్!

2500 చదరపు అడుగలు విస్తీర్ణం గల ఇంటిని కేవలం 24 గంటల వ్యవధిలో నిర్మించగలిగే సిరికొత్త 3డీ కాంక్రీట్ ప్రింటర్‌ను సౌత్ కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ బిహ్‌రాక్ కోష్‌నివిస్ తయారుచేసి సరికొత్త విప్లవానికి నాంది పలికారు. ఈ అతిపెద్ద 3డీ ప్రింటర్ ఒక పొర పై మరొక పొరను నిర్మించుకుంటూ మొత్తం ఇంటి నిర్మాణాన్ని ఒక రోజులో పూర్తి చేయగలదని ప్రొఫెసర్ బిహ్‌రాక్ తెలిపారు. ఈ భారీ 3డీ కాంక్రీట్ ప్రింటర్ రోబోట్, నిర్మాణ కార్మికులతో పనిలేకుండా ఇంటిని ఎంచుకున్న డిజైనింగ్‌లో తక్కువ సమయంల రూపొందించగలదు.

భవిష్యత్‌లో తక్కువ ఖర్చు ఇంకా తక్కువ సమయంలో ఇంటిని నిర్మించేందుకు ఈ విప్లవాత్మక ఆవిష్కరణ దోహదంకానుంది. కంప్యూటర్ ఆధారంగా ఈ 3డీ ప్రింటర్ రోబోట్ పనిచేయటం ప్రారంభిస్తుంది. కంప్యూటర్ ప్రింటర్‌ను మీరు చూసే ఉంటారు... జిరాక్స్ ప్రింటర్‌ను చూసే ఉంటారు... రోడ్లేసే ప్రింటర్‌ను ఎక్కడైనా చూశారా..?, ఈ శీర్షికలో మేము పరిచయం చేయబోయే ‘టైగర్ స్టోన్' పరికరం అతి సునాయాశంగా రోడ్లేసేస్తుంది. ఈ యంత్రం తక్కువ మనుషులు సాయంతో ఒక వరసలో ఏర్పరిచిన ఇటెకలను చూడచక్కని డిజైన్‌లో బ్రిక్ రోడ్‌లా మార్చేస్తుంది. ఈ అధునాతన సాంకేతిక పరికరం రోజుకు 400 గజాల రోడ్డును అలవోకగా వేయగలదు. ఈ పరిజ్ఞానం విదేశాల్లో అందుబాటులో ఉంది. ఈ యంత్రం పనితీరును చూసేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.


మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting