ఈ ఐదు డెస్క్‌టాప్ పీసీలు మీ జేబులో పట్టేస్తాయ్!

Posted By:

రోజులు గడుస్తున్న కొద్ది టెక్నాలజీ మరింత ఆధునీకతను సంతరించుకుంటోంది. కంప్యూటర్ల విషయానికొస్తే డెస్క్‌టాప్ కంప్యూటర్లు కాస్తా పోర్టబుల్ కంప్యూటర్‌లుగా మారిన వైనాన్ని మనం చూసాం. తాజాగా పోర్టబుల్ కంప్యూటర్ల కాస్త స్టిక్ కంప్యూటర్లుగా మారటం నిజంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. జేబులో ఎంచక్కా ఇమిడిపోయే 5 డెస్క్‌టాప్ పీసీలను ఇప్పుడు చూద్దాం....

ఇంకా చదవండి: ఉద్యోగాల కోసం 10 బెస్ట్ ఆండ్రాయిడ్ యాప్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కంప్యూటీ స్టిక్

ఇంటెల్ సంస్థ ఈ కంప్యూటీ స్టిక్‌ను తయారు చేసింది. హెచ్‌డిఎమ్ఐ పోర్ట్ ద్వారా ఏలాంటి డిస్‌ప్లేకైనా ఈ స్టిక్‌ను కనెక్ట్ చేసుకుని కంప్యూటర్‌లా వాడుకోవచ్చు. విండోస్ 8.1 ఇంకా లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంల పై డివైస్ రన్ అవుతుంది. ధర 149 డాలర్లు.

విండోస్ వర్షన్ కంప్యూటీ స్టిక్ స్పెసిపికేషన్‌లు పరిశీలించినట్లయితే..

2జీబి ర్యామ్, 32జీబి స్టోరేజ్, మైక్రోయూఎస్బీపోర్ట్స్, బ్లూటూత్ 4.0, 802.11b/g/n వై-ఫై,

లైనక్స్ వర్షన్ కంప్యూటీ స్టిక్ స్పెసిపికేషన్‌లు పరిశీలించినట్లయితే..

1జీబి ర్యామ్, 8జీబి స్టోరేజ్ మైక్రోయూఎస్బీపోర్ట్స్, బ్లూటూత్ 4.0, 802.11b/g/n వై-ఫై,

 

గూగుల్ క్రోమ్ బిట్

ఆసుస్ క్రోమ్ బిట్ పేరుతో వస్తోన్న ఈ క్యాండీ‌బార్ తరహా స్టిక్‌కు సంబంధించిన వివరాలను గూగుల్ ఓ బ్లాగ్ పోస్ట్‌లో వెల్లడించింది. క్యాండీబార్ కన్నా చిన్నగా ఉండే ఈ క్రోమ్ బిట్ కంప్యూటర్ ధర 100 డాలర్లలోపే ఉండొచ్చని గూగుల్ వెల్లడించింది. డెస్క్‌టాప్ కంప్యూటర్లకు అప్‌గ్రేడెడ్ వర్షన్‌గా రాబోతున్న ఈ కంప్యూటర్-ఆన్-ఏ-స్టిక్‌ను ఎలాంటి డిస్‌ప్లే‌కైనా కనెక్ట్ చేసుకుని కంప్యూటర్‌లా వాడుకోవచ్చు. ఈ ప్రయోగాత్మక డివైస్‌కు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడికావల్సి ఉంది. ఈ ఏడాది మధ్యనాటికి మార్కెట్లో లభ్యమయ్యే అవాకశం ఉంది.

 

ఎంకే802 వీ5 లైనక్స్ ఎడిషన్ (MK802 V5 Linux Edition)

క్రోమ్‌బిట్ తరహాలోను డిజైన్ కాబడిన ఈ హెచ్‌డిఎమ్ఐ స్టిక్ లైనక్స్ పీసీ సాఫ్ట్‌వేర్‌ను కలిగి ఉంది.

 

ఎంకే802III లైనక్స్ ఎడిషన్ (MK802III Linux Edition)

మీగోప్యాడ్ టీ01 (MeeGoPad T01)

ఇంటెల్ కంపెనీ తయారు చేసిన ఈ కంప్యూటీ స్టిక్ విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. ధర 108 డాలర్లు. క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 32జీబి ఇఎమ్ఎమ్ సీ స్టోరేజ్, మైక్రో యూఎస్బీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఫీచర్లు ఈ స్టిక్ లో ఉన్నాయి.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Five desktop PCs that fit in your pocket. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot