గప్‌చిప్‌గా మెగా ఫ్యామిలీ.....

Posted By: Super

 గప్‌చిప్‌గా మెగా ఫ్యామిలీ.....

 

గెలాక్సీ సిరీస్‌తో మెగా ఫ్యామిలీగా గుర్తింపు తెచ్చుకున్న సామ్‌సంగ్   జీటీ-ఎన్5100 మోడల్‌లలో అత్యంత గోప్యంగా డిజైన్ చేస్తున్న గెలాక్సీ నోట్ 7 ట్యాబ్లెట్ వివరాలను జీఎల్ బెంచ్‌మార్క్ సైట్ బహిర్గతం చేసింది. ఈ 7 అంగుళాల ట్యాబ్లెట్‌ను కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ షో  (సీఈఎస్) 2013 లేదా మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (ఎమ్‌డబ్ల్యూసీ) 2013లో ఆవిష్కరించి అవకాశముందని సదరు సైట్ వెల్లడించింది.

అంగారకుడి పై అద్భుతాలు!

స్పెసిఫికేషన్‌లు:

ఆండ్రాయిడ్ 4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

1.6గిగాహెడ్జ్ ఎక్సినోస్ 4412 ప్రాసెసర్,

7 అంగుళాల స్ర్కీన్,

డిస్‌ప్లే రిసల్యూషన్ 1280 x 800పిక్సల్స్.

వాళ్లకు పోటీ...?

సామ్‌సంగ్ నుంచి గోప్యంగా రూపుదిద్దుకుంటున్న  గెలాక్సీ నోట్ 7.. ఆమోజన్ కైండిల్ ఫైర్, గూగుల్ నెక్సస్ 7 ఇంకా ఐప్యాడ్ మీనీలకు గట్టిపోటి నివ్వనుందని మార్కెట్లో వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ధర ఎంత..?

రాబోయే కాలంలో తాము 7 అంగుళాల ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌లను ప్రవేశపెట్టనున్నట్లు ఏసర్ ఇంకా అసూస్‌లు ఇటీవల ప్రకటించాయి. మరో వైపు గూగుల్ నెక్సస్ 7  బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలో మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. ఈ నేపధ్యంలో సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 7 మధ్య తరగతి ప్రజానీకానికి అందుబాటులో ఉంటుందో లేదో చూడాలి.

ఈ హాట్ హాట్ అప్లికేషన్‌లు మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఉన్నాయా..?

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot