ల్యాప్‌టాప్ తీసుకువెళ్లండి, 50 రోజుల తరువాత డబ్బులు చెల్లించండి!

పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో హెచ్‌పీ ఇండియా శుక్రవారం సరికొత్త ఆఫర్ తో ముందుకొచ్చింది. తమ ల్యాప్‌టాప్‌లను కొనుగోలు చేసే యూజర్లకు స్పెషల్ జీరో వడ్డీ ఈఎమ్ఐ స్కీమ్ క్రింద 50 రోజల పేమెంట్ హాలీడేను ప్రకటించింది. 2016లో లాంచ్ అయిన హెచ్‌పీ నోట్‌బుక్‌ల పై మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.

ల్యాప్‌టాప్ తీసుకువెళ్లండి, 50 రోజుల తరువాత డబ్బులు చెల్లించండి!

Read More : రూ.10,000లో బెస్ట్ 3జీబి ర్యామ్ ఫోన్‌లు

ఈ స్పెషల్ స్కీమ్‌లో భాగంగా ఏ విధమైన డౌన్‌పేమెంట్ చెల్లించకుండా హెచ్‌పీ ల్యాప్‌టాప్‌లను సొంతం చేసుకునే వీలుంటుంది. రూ.23,000 ధరట్యాగ్ నుంచి ప్రారంభమయ్యే హెచ్‌పీ ల్యాప్‌టాప్‌ల పై కూడా ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుందని హెచ్‌పీ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. నవంబర్ 30 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న 1100 హెచ్‌పీ స్టోర్‌లలో ఈ స్కీమ్‌ను పొందవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీరు ల్యాప్‌టాప్‌ను ఎక్కువుగా ఉపయోగిస్తుంటారా..?

అయితే, మీ ల్యాపీ ఓవర్‌హీట్ అయ్యే ప్రమాదముంది. ల్యాప్‌టాప్ ఓవర్ హీట్ అవటానికి చాలానే కారణాలు ఉన్నాయి. ఒక ల్యాప్‌టాప్‌లో ఉత్పన్నమయ్యే ఓవర్ హీట్‌ను మరో ల్యాప్‌టాప్‌లో జనరేట్ అయ్యే వేడితో కంపేర్ చేసి చూడలేం. ఓవర్ హీటింగ్ అనేది కొన్ని సందర్భాల్లో వేడి ఉష్ణోగ్రతల కారణంగా తెలత్తవచ్చు. మీ ల్యాప్‌టాప్ డివైస్‌ను నిరంతరం కూల్‌గా ఉంచేందుకు 5 ముఖ్యమైన చిట్కాలు..

టిప్ 1

మీరు ల్యాప్‌టాప్‌ను ఉంచే ప్రదేశం చదునుగా ఇంకా ధృడంగా ఉండాలి. టేబుల్ ఇందుకు కరెక్టుగా సూట్ అవుతుంది.

లేటెస్ట్ ల్యాప్‌టాప్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

టిప్ 2

ల్యాప్‌టాప్స్ కోసం డిజైన్ చేయబడిన ప్రత్యేకమైన స్టాండ్స్ మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇవి మీ ల్యాపీని చల్ల బరచటంలో కీలక పాత్ర పోషిస్తాయి.

టిప్ 3

మీ ల్యాప్‌టాప్ నిరంతరం కూల్‌గా ఉండాలంటే లోపల పేరుకుపోయే దుమ్మును ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటుండాలి. ల్యాపీ క్లీనింగ్‌లో భాగంగా మొత్తటి దుస్తును వాడండి.

టిప్ 4

మీ ల్యాప్‌టాప్‌లో పరిమితికి మించిన సాఫ్ట్‌వేర్ యాప్స్ ఉన్నాయా..? మీ డివైస్ హీట్ అవటానికి ఇవి కూడా ఓ కారణం కావొచ్చు. కాబట్టి వెంటనే వీటిని తొలగించండి.

టిప్ 5

మీ ల్యాప్‌టాప్‌ను నిరంతరం కూల్‌గా ఉంచేందుకు టేబుల్ ఫ్యాన్ సదుపాయంతో కూడిన అనేక కూలింగ్ ప్యాడ్స్ మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి. మార్కెట్లోకి తొలి 4జీ ల్యాండ్‌లైన్ ఫోన్

లేటెస్ట్ ల్యాప్‌టాప్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
HP notebook to be available without down payment in EMI scheme for next 50 days. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot