హెచ్‌పీ కొత్త టాబ్లెట్ ‘స్ట్రీమ్ 8’
కాలీఫోర్నియాకు చెందిన ప్రముఖ కంపెనీ హెచ్‌పీ ‘స్ట్రీమ్ 8' పేరుతో సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ విండోస్ టాబ్లెట్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.16,990. హెచ్‌పీ అధికారిక స్టోర్‌లో ఈ డివైస్ లభ్యమవుతోంది.
మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి.

హెచ్‌పీ స్ట్రీమ్ 8 స్పెసిఫికేషన్‌లు....
సీఈఎస్ 2015: విడుదల కాబోతున్న 10 హైక్లాస్ స్మార్ట్‌ఫోన్‌లు
8 అంగుళాల కెపాసిటవ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280x800పిక్సల్స్), 1.8గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ఇంటెల్ ఆటమ్ జెడ్3735జీ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, టాబ్లెట్ పరిమాణం 123.00 x 209.00 x 8.89మిల్లీ మీటర్లు, బరువు 388 గ్రాములు, 32జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టం, 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. 3జీ, వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ, జీఎస్ఎమ్ (సింగిల్ సిమ్ వాయిస్ కాలింగ్).
టాబ్లెట్ కొనుగోలు పై ఒక ఏడాది లైసెన్స్‌తో కూడిన మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఇంకా 1టీబీ వన్‌డ్రైవ్ క్లౌడ్ స్టోరేజ్‌ను ఉచితంగా పొందే అవకాశం.


Click it and Unblock the Notifications








