ఈ ఆవిష్కరణలు ఎప్పటికి గుర్తుంటాయ్!

|

టెక్నాలజీ విభాగంలో నిత్యం ఏదో ఒక ఆవిష్కరణ చోటుచేసుకుంటోంది. వాక్ మెన్.. మొబైల్ ఫోన్... కంప్యూటర్ ఇలా అనేక ఆవిష్కరణలు ప్రపంచ స్థతిగతులను మార్చేసాయి. నేటి ప్రత్యేక శీర్సికలో భాగంగాకేతిక ప్రపంచంలో చిరస్మరణీయమైన హోదాను దక్కించుకుని విజయవంతంగా కొనసాగుతున్న పలు అత్యుత్తమ ఆవిష్కరణల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం.

ప్రపంచాన్నే మార్చేసిన 14 అత్యుత్తమ సెల్‌ఫోన్‌లు (1983- 2013)1876వ సంవత్సరం.. ప్రపంచంలో మొట్టమొదటిగా టెలిఫోన్‌ కనుగొనబడింది. అలెగ్జాండర్‌ గ్రాహంబెల్‌ పరిశోధనల పర్యవసానంగా ఒకచోటు నుంచి మరో చోటికి మనిషి మాట వినిపించసాగింది. అలా ప్రారంభమైన టెలిఫోన్‌ పరిణామ క్రమం నేడు మనం ఉపయోగిస్తున్న ఆధునిక ల్యాండ్‌లైన్‌ ఫోన్‌లు, అత్యాధునిక స్మార్ట్‌ఫోన్‌ల వరకు విస్తరించింది. 1947లో ట్రాన్సిస్టర్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. దింతో టెలిఫోన్ కొత్త పోకడలను సంతరించుకుంది. ఈ క్రమంలోనే ఆటో మ్యాటిక్ రీడైలింగ్, నెంబర్ ఐడెంటిఫికేషన్, కాల్ వెయిటింగ్, కాన్ఫిరెన్సింగ్ వంటి ఫీచర్లు అదనంగా జతయ్యాయి. మొబైల్‌ఫోన్‌ చరిత్రను గమనిస్తే 1960లో ప్రపంచంలోని మొట్టమొదటి కార్‌ఫోన్‌ ఆవిష్కృతమైంది. అదికూడా పాక్షికంగా ఉండే ఆటోమేటిక్‌ సర్వీసు.

మనం నేడు వాడుతున్న మొబైల్‌ ఫోనును సెల్‌ఫోన్‌, లేక సెల్యులార్‌ ఫోన్‌ అని కూడా పిలుస్తారు. మొబైల్‌ ఫోన్లకు, కార్డ్‌ లెస్‌ ఫోన్లకు వ్యత్యాసం వుంది. కార్డ్‌లెస్‌ ఫోన్లు బేస్‌ఫోన్లకు కేవలం కొన్ని మీటర్ల వ్యాస పరిథిలోనే పని చేస్తాయి. సాధారణ ల్యాండ్‌లైన్‌ కేవలం టెలిఫోన్‌ సంభాషణకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఇక మొబైల్‌ ఫోన్ అనేక ఫీచర్లను కలిగి ఉంటుంది. 1983లో మొట్టమొదటి చేతిఫోన్‌ను 'మోటోరోలా' కంపెనీ విడుదల చేయగా దాని బరువు రెండు కిలో గ్రాములు ఉండేది. 1990నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఒక కోటి, ఇరవైలక్షల పై చిలుకు వినియోగదారులు మొబైల్‌ కంపెనీల సభ్యత్వం తీసుకోవడం జరిగిందిఆ సంఖ్య ఇప్పటికి అనుకోని రీతిలో రెట్టింపవటం విశేషం. నేటి ప్రత్యేక కథనంలో భాగంగా మొబైల్ ఫోన్‌ల ప్రపంచంలో విప్లవాత్మక మార్పులకు కారణమైన 14 అత్యుత్తమ ఫోన్‌లను వీక్షించేందుకు క్లిక్ చేయండి.

సోనీ వాక్‌మెన్

సోనీ వాక్‌మెన్

సోనీ వాక్‌మెన్:

మ్యూజిక్ ప్రపంచానికి సోనీ వాక్‌మెన్ సుపరిచితం. 1979-80 ప్రాంతంలో అందుబాటులోకి వచ్చిన ఈ మ్యూజిక్ ప్లేయర్ ద్వారా సంగీతాన్ని బాహ్య ప్రపంచంలో సైతం ఆస్వాదించగలుగుతున్నాం. సోనీ  వాక్‌మెన్ ఇప్పుడు అనేక వేరియంట్‌లలో లభ్యమవుతోంది.

 

గూగుల్ గ్లాస్

గూగుల్ గ్లాస్

గూగుల్ గ్లాస్:

గూగుల్ సంస్థ వినూత్న ఆవిష్కరణ ‘గూగుల్ గ్లాస్'. ఈ టెక్నాలజీ ప్రపంచానికే సరికొత్త ఒరవడి. ఈ గ్లాస్ ఆధారంగా వీడియో చాటింగ్.. మెసేజింగ్.. వెబ్ బ్రౌజింగ్ ఇలా అనేక ఆన్‌లైన్ లావాదేవీలను నిర్వహించుకోవచ్చు. ఈ కళ్లద్దాలతో ఫోటోలను సైతం చిత్రీకరించుకోవచ్చు. వీడియోలను సైతం రికార్డ్ చేసుకోవచ్చు. ఈ రియాలిటీ గ్లాసెస్ ఆధారంగా ఆచూకీలను సైతం కనుగొనవచ్చు. వీటి తయారీకి గూగుల్ రెండేళ్ల పాటు శ్రమించింది.

 

యాపిల్ ఐఫోన్
 

యాపిల్ ఐఫోన్

యాపిల్ ఐఫోన్:

మొబైల్ ఫోన్‌ల విభాగంలో విప్లవాత్మక మార్పులకు కారణమైన ‘యాపిల్ ఐఫోన్' సరికొత్త స్మార్ట్ మొబైలింగ్ అనుభూతులను యూజర్లకు చేరువచేసింది. ఒకే సమయంలో కంప్యూటింగ్ ఇంకా మొబైలింగ్ కార్యకలాపాలకు యాపిల్ అనుమతిస్తుంది. యాపిల్ ఐఫోన్‌లలో ప్రస్తుత వర్షన్‌గా ఐఫోన్5 ఉంది. ప్రపంచానికి యాపిల్ కంప్యూటింగ్ ఉత్పత్తులను పరిచయం చేసిన స్టీవ్ జాబ్స్‌కు ప్రతి ఒక్కరూ థ్యాంక్స్ చెప్పుకోకతప్పదు. యాపిల్ మొట్టమొదటి ఐఫోన్‌ను జనవరి 2007 శాన్ ఫ్రాన్సిస్కోలో నిర్వహించిన మ్యాక్ వరల్డ్ కాన్ఫిరెన్స్‌లో ఆవిష్కరించటం జరిగింది.

 

యాపిల్ సిరి

యాపిల్ సిరి

యాపిల్ సిరి:

యాపిల్ వినూత్న ఆవిష్కరణలో ‘సిరి' ఒకటి. ఈ వాయిస్ అసిస్టెంట్ అప్లికేషన్ నోటి మాటకు స్పందిస్తుంది. ఈ అప్లికేషన్‌ను ఆధారంగా చేసుకుని సామ్‌సంగ్, ఎల్‌జి, మైక్రోమ్యాక్స్ వంటి మొబైల్ తయారీ బ్రాండ్‌లు వాయిస్ కమాండ్ అప్లికేషన్లను ఆవిష్కరించాయి.

 

గూగుల్ డ్రైవర్ రహిత కారు

గూగుల్ డ్రైవర్ రహిత కారు

గూగుల్ డ్రైవర్ రహిత కారు:

డ్రైవర్ రహిత కార్ల తయారీ పై గూగుల్ దృష్టిసారించింది. ఇందుకు సంబంధించిన పరిశోధనలు గూగుల్ ఎక్స్ ప్రయోగశాలలో జరుగుతున్నాయి. ఈ ప్రయోగం విజయవంతం అయినట్లయితే సురక్షిత డ్రైవింగ్‌తో కూడిన కారు ప్రయాణాలను సాగించవచ్చు.

 

ఫ్లెక్సిబుల్ స్ర్కీన్ స్మార్ట్‌ఫోన్

ఫ్లెక్సిబుల్ స్ర్కీన్ స్మార్ట్‌ఫోన్

ఫ్లెక్సిబుల్ స్ర్కీన్ స్మార్ట్‌ఫోన్:

ఫ్లెక్సిబుల్ డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్‌లు భవిష్యత్ మార్గదర్శిలుగా నిలవనున్న నేపధ్యంలో యాపిల్, సామ్‌సంగ్, ఎల్‌జి వంటి ప్రముఖ మొబైల్ తయారీ బ్రాండ్‌లు ఫ్లెక్సిబుల్ డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్‌కు పరిచయం చేస్తున్నాయి.

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X