లెనోవో ఎక్ప్1 కార్బన్ టచ్... స్మార్ట్‌ కంప్యూటింగ్!

Posted By: Staff

లెనోవో ఎక్ప్1 కార్బన్ టచ్... స్మార్ట్‌ కంప్యూటింగ్!

 

లెనోవో తన థింక్‌ప్యాడ్ సిరీస్ నుంచి ‘ఎక్స్1 కార్బన్ టచ్’ పేరుతో సరికొత్త అల్ట్రాబుక్‌ను ఆవిష్కరించింది. విండోస్ 8 ఆధారితంగా స్పందించే ఈ పోర్టబుల్ కంప్యూటింగ్ డివైజ్ ‘గెస్ట్యర్ కంట్రోల్’ వ్యవస్థను  సపోర్ట్ చేస్తుంది. ఉత్తమ క్వాలిటీ మొబిలిటీ అలానే  ఎంటర్‌టైన్‌మెంట్‌ను కోరుకునే వారికి ఈ తరహా ల్యాపీని డిజైన్ చేసినట్లు కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి.

అదిరిపోయే పెన్‌డ్రైవ్‌లు (ఫోటో గ్యాలరీ)!

స్పెసిఫికేషన్‌లు.........

బరువు ఇంకా చుట్టుకొలత: 1.36కిలోగ్రాముల బరువు, 20.8మిల్లీమీటర్ల మందం,

డిస్‌ప్లే:  14 అంగుళాల ప్రీమియమ్  హైడెఫినిషన్+ ఎల్ఈడి బాక్లిట్ డిస్‌ప్లే, రిసల్యూషన్ 1600 x 900పిక్సల్స్,

ప్రాసెసర్:  ఇంటెల్ కోర్ ఐ5-3427యూ ప్రాసెసర్,  క్లాక్ వేగం 2.8గిగాహెడ్జ్, ఇంటెల్ హైడెఫినిషన్ గ్రాఫిక్స్ 4000 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,

ఆపరేటింగ్ సిస్టం: విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం,

కెమెరా: 720 పిక్సల్ హైడెఫినిషన్ ఫేస్‌ట్రాకింగ్ వెబ్‌క్యామ్ (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),

స్టోరేజ్: 8జీబి డీడీఆర్3ఎల్ ర్యామ్, 128జీబి సాటా 3 సాలిడ్ స్టేట్‌డ్రైవ్,

కనెక్టువిటీ: బ్లూటూత్ 4.0, ఆప్షనల్ 3జీ, యూఎస్బీ 2.0 ఇతర్‌నెట్ ఆడాప్టర్, వై-ఫై,

బ్యాటరీ: రాపిడ్ చార్జ్ టెక్నాలజీ (బ్యాకప్ 8 గంటలు).

ఇతర ఫీచర్లు:  డాల్బీ హోమ్ థియోటర్ వీ4, మైక్రోసాఫ్ట్ లింక్, డ్యూయల్ ఆరే మైక్రోఫోన్స్, వాయిస్ ట్రాక్ క్యాపబులిటీ, సెక్యూరిటీ ఫీచర్లు, ఫింగర్ ప్రింట్ రీడర్, బయోస్ ఎన్‌క్రిప్షన్, రాపిడ్ కనెక్ట్ ఫీచర్.

ధర ఇతర వివరాలు:

యూఎస్ మార్కెట్లో ‘లెనోవో ఎక్స్1 కార్బన్ టచ్’ ధర  $1,499 (రూ.81,500). ఇండియన్ మార్కెట్లో విడుదల ఇంకా ధరకు  సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

జేమ్స్‌బాండ్ హాట్ హాట్ కలెక్షన్ (ఫోటో గ్యాలరీ)!

Read in English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot