హైదరాబాద్‌లో లెనోవో ఔట్‌లెట్

Posted By: Super

 హైదరాబాద్‌లో లెనోవో  ఔట్‌లెట్

 

పర్సనల్ కంప్యూటర్ల తయారీ విభాగంలో అంతర్జాతీయ గుర్తింపును మూటగట్టుకున్న టాప్ క్లాస్ బ్రాండ్ లెనోవో సరికొత్త ఔట్‌లెట్‌ను బుధవారం హైదరాబాద్‌లోని  చెన్నై ట్రేడ్ సెంటర్ (సీటీసీ)లో ప్రారంభించింది. చిన్న, మధ్యతరహా వ్యాపార వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ స్టోర్‌ను లెనోవో నెలకొల్పింది. ‘థింక్ స్టోర్’పేరుతో  ఏర్పాటు చేసిన ఈ స్టోర్‌ను కంపెనీ సేల్స్ డైరెక్టర్ (సౌత్) అశోక్ నాయర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఎక్స్‌క్లూజివ్ థింక్ స్టోర్‌ను  దక్షిణాది రాష్ట్రాల్లో హైదరాబాద్‌లోనే మొదటిసారిగా ఏర్పాటు చేసినట్టు వివరించారు.

ది బెస్ట్ 10 మొబైల్ ఫోన్‌లు (2012)

దింతో దేశ్యవ్యాప్తంగా ఉన్న లెనోవో ఎక్స్‌క్లూజివ్ స్టోర్ల సంఖ్య ఏడుకు చేరినట్లు వెల్లడించారు. ఎస్ఎంబి సెగ్మెంట్లో తమ మార్కెట్ వాటా రెండేళ్ల కాలంలో 3 శా తం నుంచి 6.3 శాతానికి పెరిగిందని, దీనిని మరింత పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. కమర్షియల్ డెస్క్‌టాప్ సెగ్మెంట్లో 21 శాతం వాటాతో తమ కంపెనీయే అగ్రస్థానంలో నిలిచిందన్నారు.  కమర్షియల్ నోట్‌బుక్ సెగ్మెంట్లో వాటా 34.2 శాతానికి పెరిగిందని చెప్పారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot