ప్రముఖ కంప్యూటర్ల నిర్మాణ సంస్థ హెచ్‌పి సరికొత్త విండోస్8 ఉత్పత్తులను మార్కెట్‌కు పరిచయం చేసింది. ఎన్వీ ఎక్స్2 హైబ్రీడ్, ఎన్వీ టచ్‌స్మార్ట్ అల్ట్రాబుక్ 4, ఎన్వీ 23 ఏఐవో శ్రేణిలలో మూడు సరికొత్త గాడ్జెట్‌లను ఇండియాలో విడుదల చేసింది. ఇవి గురువారం నుంచి మార్కెట్లో లభ్యమవుతాయి.
హెచ్‌పి ఎనక్సీ ఎక్స్2 స్పెసిఫికేషన్‌లు:
ఈ డివైజ్‌ను ట్యాబ్లెట్ అలానే ల్యాప్‌టాప్‌లా ఉపయోగించుకోవచ్చు,
ఇంటెల్ ఆటమ్ డ్యుయల్- కోర్ జడ్ 2760 ప్రాసెసర్ (క్లాక్ వేగం 1.8గిగాహెడ్జ్),
2జీబి ఎల్ పీడీడీఆర్2 మెమరీ,
64జీబి ఈఎమ్ఎమ్ సీఎన్ఏఎన్‌డి ఫ్లాష్ డ్రైవ్ (ఎస్‌డిహెచ్‌సీ కార్డ్),
11.6 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1366 X 768పిక్సల్స్),