మెర్క్యురీ నుంచి డ్యూయల్ సిమ్ ఆండ్రాయిట్ ట్యాబ్లెట్!

Posted By: Staff

 మెర్క్యురీ నుంచి డ్యూయల్ సిమ్ ఆండ్రాయిట్ ట్యాబ్లెట్!

 

మెర్క్యురీ బ్రాండ్ క్రింద విక్రయాలు సాగించే ప్రముఖ కంప్యూటర్ ఉపకరణాల తయారీ సంస్థ కోబియన్ ‘ఎంట్యాబ్ స్ట్రీక్యూ(mTab StreaQ) వేరియంట్‌లో సరికొత్త డ్యూయల్ సిమ్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌ను విపణిలోకి తీసుకువచ్చింది. ధర రూ.11,500. ఆండ్రాయిడ్ ఐసీఎస్ ప్లాట్ ఫామ్ పై స్పందిస్తుంది. కంపెనీ కంట్రీ మేనేజర్ సుష్మితా దాస్ ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

2013లో వింతలు..?

స్పెసిఫికేషన్‌లు........

డిస్‌ప్లే: 7 అంగుళాల కెపాసిటివ్ టచ్‍‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1024 x 600పిక్సల్స్),

ప్రాసెసర్ ఇంకా స్టోరేజ్: 1.2గిగాహెడ్జ్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్,

కెమెరా: 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),

కనెక్టువిటీ: డ్యూయల్ సిమ్ సపోర్ట్, వై-పై, బ్లూటూత్, హెచ్‌డిఎమ్ఐ పోర్ట్, ఇన్-బుల్ట్ జీపీఎస్, ఇన్‌బుల్ట్ ఎఫ్ఎమ్,

ధర ఇతర వివరాలు: మార్కెట్లో మెర్క్యురీ ఎంట్యాబ్ స్ట్రీక్ డ్యూయల్ సిమ్ ట్యాబ్లెట్ ధర రూ.11,499.

మెర్క్యురీ ఎంట్యాబ్ స్ట్రీక్‌కు పోటీగా అభివర్ణిస్తున్న స్వైఫ్ లిజెండ్ ట్యాబ్ స్పెసిఫికేషన్‌లు:

7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,

ఆండ్రాయిడ్ 4.0 ఆకా ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,

1.5గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,

512ఎంబి ర్యామ్,

2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

వై-పై, 3జీ,

డ్యూయల్ సిమ్,

డ్యూయల్ సిమ్, జీపీఎస్, జీ-సెన్సార్, ఎఫ్ఎమ్ రేడియో,

4జీబి ఇంటర్నల్ మెమెరీ, 32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ,

3600ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

ధర రూ.10,990.

Read in English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot