మైక్రోమ్యాక్స్ హైడెఫినిషన్ క్వాడ్ కోర్ ఫాబ్లెట్: ‘ఏ116 కాన్వాస్ హైడెఫినిషన్’

Posted By: Super

మైక్రోమ్యాక్స్ హైడెఫినిషన్ క్వాడ్ కోర్ ఫాబ్లెట్: ‘ఏ116 కాన్వాస్ హైడెఫినిషన్’

 

ప్రముఖ దేశవాళీ మొబైల్ బ్రాండ్ మైక్రోమ్యాక్స్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ పై స్పందించే అధిక ముగింపు ఫాబ్లెట్‌ను సోమవారం ఆవిష్కరించింది. పేరు  మైక్రోమ్యాక్స్ ఏ116 కాన్వాస్ హైడెఫినిషన్. ధర అంచనా రూ.15,000. సరికొత్త ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ప్లాట్‌ఫామ్‌ను ఈ పెద్ద‌స్ర్కీన్ మొబైలింగ్ హ్యాండ్‌సెట్‌లో లోడ్ చేశారు. స్పెసిఫికేషన్‌లు క్లుప్తంగా.......

ది బెస్ట్ 10 మొబైల్ ఫోన్‌లు (2012)

బెస్ట్ రేటింగ్ స్మార్ట్‌ఫోన్‌లు (టాప్-10)

డిస్‌ప్లే: 5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, డిస్‌ప్లే రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్,

ప్రాసెసర్: 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ మీడియా టెక్ ఎంటీ6589 ప్రాసెసర్,

ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

కెమెరా: 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),

స్టోరేజ్: 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 1జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

కనెక్టువిటీ: 3జీ, వై-ఫై 802.11 బి/జి/ఎన్, బ్లూటూత్, జీపీఎస్/ఏ-జీపీఎస్ కనెక్టువిటీ,

బ్యాటరీ: 2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ (బ్యాకప్ వివరాలు తెలియాల్సి ఉంది),

ప్రీలోడెడ్ అప్లికేషన్‌లు: ఎమ్ స్టోర్, ఎమ్ బడ్డి, ఎం ఎస్ఎమ్ఎస్, ఎమ్ జోన్, హుక్ అప్.

ధర ఇతర వివరాలు:   మైక్రోమ్యాక్స్ ఏ116 కాన్వాస్ హైడెఫినిషన్ ఫాబ్లెట్ ధర అంచనా రూ.15,000. ఫిబ్రవరి నుంచి రిటైల్ మార్కెట్లో లభ్యంకానుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot