దూసుకొస్తున్న మైక్రోసాఫ్ట్ న్యూ ఆఫీస్

Written By:

మైక్రోసాఫ్ట్ నుంచి సరికొత్త వెర్సన్ దూసుకొస్తోంది. ఆఫీస్ -2016 పేరుతో ఈ సాప్ట్ వేర్ ని మైక్రోసాఫ్ట్ వచ్చే నెలలో రీలిజ్ చేయనుంది. దీనికి సంబంధించిన వివరాలను మైక్రో సాఫ్ట్ యాజమాన్యం బయటకు వెల్లడించింది. ఇందులో కొత్తగా అనేక అప్ డేట్స్ ను ప్రవేశపెట్టింది. ఆ అప్ డేట్ పై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

read more : చైనాకు చుక్కలు చూపిస్తున్న ఇండియా

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వచ్చే నెల చివరి వారంలో...

వచ్చే నెల చివరి వారంలో అన్ని కంప్యూటర్లలో వాడుకునేందుకు వీలుగా ఆఫీస్-2016 వెర్షన్‌ను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు మైక్రోసాఫ్ట్ సంస్థ తెలిపింది.

సెప్టెంబరు 22న విడుదల

ఇటీవల ఈ వెర్షన్‌ను విజయవంతంగా పరిక్షించారు. సెప్టెంబరు 22న దీనిని విడుదల చేయడానికి మైక్రోసాఫ్ట్ సంస్థ సిద్ధమవుతోంది.

రియల్ టైమ్ టైపింగ్

రియల్ టైమ్ టైపింగ్, స్కైప్ ఫర్ బిజినెస్ లాంటి కొత్త ఫీచర్లతో ఆఫీస్-2016 పలకరించనుంది.

పబ్లిషర్‌లలో అప్‌డేట్స్

వర్డ్, ఎక్సెల్, పవర్‌పాయింట్, వన్‌నోట్, అవుట్‌లుక్, ప్రాజెక్టు, విజియో, ఆక్సెస్ మరియు పబ్లిషర్‌లలో అప్‌డేట్స్ ఉంటాయని మైక్రోసాఫ్ట్ అంతర్గత వర్గాలు తెలిపాయి.

యాపిల్ కంప్యూటర్ల కొరకు...

యాపిల్ కంప్యూటర్ల కొరకు ఆఫీస్-2016 మ్యాక్ వెర్షన్‌ని జులైలో విడుదల చేసిన ప్రభుత్వం ఆ తర్వాత విండోస్ 10 ట్యాబ్లెట్ల కోసం మొబైల్ ఆఫీస్ యాప్‌ను ప్రవేశపెట్టింది.

ఈ ఏడాది చివరలో విండోస్

ఈ ఏడాది చివరలో విండోస్ 10 మొబైల్ స్మార్ట్ ఫోన్ కోసం ఆఫీస్ మొబైల్ యాప్‌ను మైక్రోస్ఫాఫ్ట్ విడుదల చేసే అవకాశముంది.

అన్ని రకాల కంప్యూటర్లకు ..

అన్ని రకాల కంప్యూటర్లకు వాడుకునే విధంగా ఆపీస్ -2016ని డిజైన్ చేశారు. 

గిజ్ బాట్ పేీని లైక్ చేయండి

మీరు టెక్నాలజీకి సంబంధించి మరిన్ని అప్ డేట్ పొందాలనుకుంటే గిజ్ బాట్ పేజిని ఓపెన్ చేయండి 

https://www.facebook.com/GizBotTelugu

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Microsoft's new Office desktop suite - Office 2016 - is expected to be released on 22 September. In July, Microsoft said Office 2016 for Windows PC would be launched in September but did not mention a specific date.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot