చైనాకు చుక్కలు చూపిస్తున్న ఇండియా

Posted By:

స్మార్ట్ ఫోన్ల అమ్మకాల్లో ఇండియా చైనాకు చుక్కలు చూపిస్తోంది..ఆ దేశంలో పోలిస్తే మన దేశంలోనే అమ్మకాలు పెరిగాయని హెచ్ఎస్ బిసి రిపోర్ట్ తెలిపింది. ఇండియాలో స్మార్ట్ పోన్ల ధరలు పడిపోవడంతో పాటు బ్రాండెడ్ 3జి ఫోన్లు తక్కవ ధరలకే దొరుకుతుండటంతో అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. చైనాతో పోలిస్తే ఈ అమ్మకాలు మరింతగా పెరిగాయని సర్వే చెబుతోంది. రానున్న కాలంలో ఇది ఇంకా పెరిగే అవకాశం ఉందని రిపోర్ట్ చెబుతోంది.

Read more: తోక చుక్కపై తొలి విజయం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

తగ్గిన చైనా గ్రోత్

2013లో వాల్యూమ్ గ్రోత్ అమ్మకాలతో అదరగొట్టిన చైనా ఆ తరువాత 2014కి వచ్చేసరికి గ్రోత్ తగ్గింది.

హెచ్ ఎస్ బిసి గ్లోబల్ రిసెర్చ్ నివేదిక

ఇతర దేశాల్లో స్మార్ట్ పోన్ల వాడకం ప్రభావం చైనా మీద పడటంతో 2014లో చైనా 95 శాతం వృద్దిని సాధించింది. అయితే 2014-19 కాలంలో 26 శాతం ఇండియా నుంచి ఎగుమతులు అలాగే వెస్ట్ ఆసియా నుంచి 19 శాతం,లాటిన్ అమెరికా నుంచి 8 శాతం,చైనా నుంచి 5 శాతం స్మార్ట ఫోన్ల ఎగుమతులు పెరిగే అవకాశం ఉందని హెచ్ ఎస్ బిసి గ్లోబల్ రిసెర్చ్ నివేదిక తెలియజేసింది.

ఇండియా నంబర్ 2

గతేడాది గ్లోబల్ మార్కెట్ లో ఇండియా నంబర్ 2 స్థానాన్ని ఆక్రమించింది. 275 మిలియన్ల మేర ఎగుమతులు జరిగాయి. ఇది ప్రపంచ మార్కెట్ లో 14 శాతం.అయితే గతేడాది గ్లోబల్ మార్కెట్ లో 81 మిలియన్ల ఎగుమతులు జరిగాయి. ఇది కేవలం ప్రపంచ మార్కెట్లో ఆరుశాతం.

స్మార్ట్ ఫోన్ల పెరుగుదల

2014లో ఇండియాలో స్మార్ట్ ఫోన్ల పెరుగుదల శాతం కేవలం 30 శాతం మాత్రమే ఉంది. 

పడిన స్మార్ట ఫోన్ల 3జీ ధరలు

ఇండియాలో తక్కువ ఆదాయం అలాగే స్మార్ట్ ఫోన్లపై ఎటువంటి సబ్సిడీ లేకపోవడంతో పాటు స్మార్ట ఫోన్ల 3జీ ధరలు కూడా పడిపోవడంతో ఇండియాలో స్మార్ట్ పోన్ల పెరుగుదల అమాంతం పెరిగిందని నివేదిక తెలియజేస్తోంది.

గ్లోబల్ మార్కెట్ లో 19 శాతం

రానున్న కాలంలో అంటే 2019 నాటికి ఇండియా 65 శాతం పెరుగుదల రేటుతో గ్లోబల్ మార్కెట్ లో 19 శాతం వాటాను కలిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

3జీ..4జీ

రానున్న కలాంలో 3జీఫోన్లు మార్కెట్ లో ఫుంజుకోనుండటంతో దాన్ని 4జీ ఎలా డామినేట్ చేస్తుందనే దానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఆన్ లైన్ అమ్మకాలు

ప్రస్తుతం ఆన్ లైన్ ఫోన్ అమ్మకాల్లో చైనాతో పోలిస్తే ఇండియా కొంచెం మెరుగ్గానే ఉందని నివేదిక తెలియజేస్తోంది.

70 మిలియన్ల 3జీ వినియోగదారులు

ఇప్పుడు మొత్తం మీద దాదాపు 70 మిలియన్ల 3జీ వినియోగదారులు ఉన్నారు.అలాగే 243 మిలియన్ల యూజర్లు ఇంటర్ నెట్ వాడుతున్నారు.

20 శాతం కంటే డబుల్ అయ్యే అవకాశాలు

ఈ కామర్స్ తో అనుసంధానం అవుతూ ఇంటర్నెట్ మార్కెట్ శరవేగంగా పుంజుకుంటోంది. ఇది ఇలాగే కొనసాగితే రానున్న 18 నెలల్లో హ్యండ్ సెట్ల అమ్మకాలు 20 శాతం కంటే డబుల్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని నివేదిక చెబుతోంది.

ఎగుమతుల శాతం భారీగానే

ఇండియానుంచి ప్రపంచ మార్కెట్లోకి ఎగుమతుల శాతం భారీగానే ఉండే అవకాశాలు ఉన్నాయని నివేదిక తెలియజేస్తోంది. 

ఇండియా దెబ్బకి చైనా మార్కెట్ కుదేల్

ఇండియా దెబ్బకి చైనా మార్కెట్ కుదేల్ అయ్యే అవకాశాలు ఎక్కువని తెలుస్తోంది 

2019 నాటికి భారత్ దే మార్కెట్

స్మార్ట్ ఫోన్ల ప్రపంచ మార్కెట్ ను 2019 నాటికి భారత్ ఆక్రమించే అవకాశాలు ఉన్నాయని సర్వే తెలియజేస్తోంది. 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
India has pipped China to drive the volume growth of smartphones in the world on the back of falling prices of high-end devices and growing adoption of 3G services, according to an HSBC report.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot