ఆ ట్యాబ్లెట్ ధర రూ. 90వేలు

Written By:

ఎప్పటినుంచో ఊరిస్తూ వస్తున్న సర్ఫేస్ ట్యాబ్లెట్‌ను మైక్రోసాఫ్ట్ ఎట్టకేలకు మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ధర 89,990 రూపాయలు. ఇప్పటికే ఇది అమెజాన్ లోకి చేరింది. అమెజాన్ డాట్ కాంలో ఇప్పటికే దీనికి సంబంధించిన బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. అయితే దీనితో పాటు సర్ఫేస్ ప్రో 3 ని కూడా అమెజాన్ విడుదల చేసింది. దీని ధర రూ. 73,990 మరి వీటి ఫీచర్లు ఎలా ఉంటాయనే దానిపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Read more: 2016లో మార్కెట్‌‌ను ముంచెత్తనున్న ఫోన్లు ఇవే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సర్ఫేస్ ప్రో 4 ...

12.3 అంగుళాల డిస్ ప్లే కలిగిన సర్ఫేస్ ప్రో 4 ... విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ తో పని చేస్తుంది. ఐ 3, ఐ 5, ఐ 7 ఇంటెల్ ప్రాసెసర్లు కలిగిన సర్ఫేస్ ను కొనుగోలుదారులు ఎంచుకోవచ్చు.

సర్ఫేస్ ప్రో 4 ...

4 జిబి, 8 జిబి రామ్లు, 128 జిబి 256 జిబి స్టోరేజ్ సామర్థ్యంతో ఇది అందుబాటులో ఉంటుంది. ఐ 5 ప్రాసెసర్, జిబి మెమరీ 128, 4 జిబి రామ్ కలిగిన సర్ఫేస్ ప్రో 4 ధర 89.990 రూపాయలుండగా .. ఐ 5 ప్రాసెసర్, 8 జిబి రామ్ 256 జిబి మెమరీ వెర్షన్ ధర 1,20,990 రూపాయలు ..

సర్ఫేస్ ప్రో 4 ...

కోర్ ఐ 7 ప్రాసెసర్, 8 జిబిరామ్ 256 జిబి మెమరీ సర్ఫేస్ ధర 1,44,990 రూపాయలు ఉంది .

సర్ఫేస్ ప్రో 4

యుఎ్సబి 3.0 పోర్ట్, బ్లూటూత 4.0, వైఫై, మినీ డిస్ ప్లే పోర్ట్, కార్డ్ రీడర్, 5 ఎంపి ముందు కెమెరా, 8 ఎంపి వెనుక కెమెరా, డాల్బీ ఆడియో వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

సర్ఫేస్ ప్రో 4

బ్యాటరీ లైఫ్ 9 గంటలు ఉంటుందని కంపెనీ చెబుతోంది.

సర్ఫేస్ ప్రో 3

ఈ టాబ్లెట్ 73.990 రూపాయలు. కోర్ 3 ప్రాసెసర్ ఐ, 4 జిబి రామ్, 128 జిబి ఇంటర్నల్ మెమరీ ఇందులో ఉంటుంది. ఇ-కామర్స్ పోర్టల్ అమెజాన్ ద్వారా ఈ రెండు టాబ్లెట్ను బుక్ చేసుకోవచ్చని, జనవరి 14 వ తేదీ నుంచి డెలివరీ మొదలవుతుందని మైక్రోసాఫ్ట్ తెలిపింది.

సర్ఫేస్ ప్రో 3

మూడు వేరియంట్లలో సర్ఫేస్ ప్రో 4 లభిస్తుంది. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ పూర్తి స్థాయిలో పని చేసే విధంగా దీన్ని డిజైన్ చేశామని, ఇందులో విండోస్ హలో, సర్ఫేస్ పెన్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, కోర్టానా కూడా ఉన్నట్టు కంపెనీ తెలిపింది.

సర్ఫేస్ ప్రో 3

అధిక ఉత్పాదకత, వేగవంతమైన పనితీరు కోరుకునే వారికి సర్ఫేస్ సరైన ఎంపిక అని మైక్రోసాఫ్ట్ ఇండియా చైర్మన్ భాస్కర్ ప్రామాణిక్ తెలిపారు.

తొలి ఆరునెలలు అమెజాన్ లో డాట్ కాంలో మాత్రమే

తొలి ఆరునెలలు అమెజాన్ లో డాట్ కాంలో మాత్రమే ప్రత్యేకంగా ఇవి అందుబాటులో ఉంటాయి.ఆ వెబ్ సైట్ లో కెళ్లి మీరు ఫ్రీ బుకింగ్ చేసుకోవచ్చు. ఈ నెత 14 నుంచి షిప్పింగ్ ప్రారంభమవుతుందని అమెజాన్ తెలిపింది.

ప్రస్తుతం విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ తో

ఇదిలా ఉంటే .. ప్రస్తుతం విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ తో 20 కోట్ల కంప్యూటర్లు పని చేస్తున్నాయని కంపెనీ వెల్లడించింది.

ఈ టీవీని మడతపెట్టి బ్యాగులో పెట్టేసుకొని వెళ్లొచ్చు

ఈ టీవీని మడతపెట్టి బ్యాగులో పెట్టేసుకొని వెళ్లొచ్చు..మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.https://telugu.gizbot.com/news/the-rollup-tv-is-coming-lg-builds-900m-plant-make-bendable-screens-013038.html 

మరిన్ని అప్‌డేట్ పొందండి

టెక్నాలజీ గురించి మరిన్నిఅప్‌డేట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Microsoft Surface Pro 4 launched in India for Rs 89990
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot