2016లో మార్కెట్‌‌ను ముంచెత్తనున్న ఫోన్లు ఇవే

By Hazarath
|

ఇప్పుడు ఎక్కడ చూసినా స్మార్ట్ పోన్ల రాజ్యమేలుతోంది. చిన్న పిల్లవాడి దగ్గర నుంచి పండు ముసలి దాకా స్మార్ట్ ఫోన్ల వెంట పరుగులు తీస్తున్నారు. వారి పరుగులకు శక్తినిస్తూ 2015లో ఎన్నో సరికొత్త స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి దూసుకొచ్చాయి. వాటిని స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఎంతో ఆదరించారు. అయితే అదే సమయంలో 2016 కూడా వచ్చేసింది. ఇప్పుడు అవే కంపెనీలు సరికొత్త ఫోన్లను మార్కెట్ లోకి తీసుకురావడానికి ఇప్పుడు పోటీ పడుతున్నాయి. అవేంటో చూద్దాం.

Read more: ఐ ఫోన్ 7 ప్లస్ : 256 జిబితో పాటు అతి పెద్ద బ్యాటరీ

ఆపిల్ ఐఫోన్ 7 , 7 ప్లస్

ఆపిల్ ఐఫోన్ 7 , 7 ప్లస్

స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఆపిల్ కంప్యూటర్స్..2016లో ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ మోడళ్లను సెప్టెంబర్ లో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ రెండింటిలో సంస్థ జిప్పియర్ ప్రాసెసర్‌తో పాటు అదనపు సామర్థ్యపు ర్యామ్‌ను పొందుపర్చవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంతేకాదు హెడ్ఫోన్ కనెక్టర్, భారీ స్క్రీన్, వాటర్ ప్రూఫ్ ఫీచర్లు అదనపు ఆకర్షణగా నిలువనున్నాయని తెలుస్తున్నది. ఐఫోన్ 7 కంటే ముందే ఐఫోన్ 6 సీని అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది.
ఫీచర్స్ విషయానికొస్తే
ఐ ఫోన్ 7 ఆపరేటింగ్ సిస్టం ఐఓఎస్ 10
ఏ 10 చిపెస్ట్ ప్రాసెసర్
ఈ సిమ్ ట్రెడెషనల్. సిమ్ కార్డు ఉండకపోవచ్చు
రివర్స్ బుల్ యుఎస్ బి ఛార్జర్
ధర దాదాపు రూ. 61454 .72 ఉండొచ్చు. డాలర్లలో అయితే 937 డాలర్లు

సామ్‌సంగ్  గెలాక్సీ ఎస్ 7, ఎస్ 7 ఎడ్జ్

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 7, ఎస్ 7 ఎడ్జ్

ఆపిల్ కు ప్రధాన పోటీదారైన సామ్‌సంగ్ .. ఐఫోన్లకు ధీటుగా గెలాక్సీ సిరీస్ లో ఎస్ 7, ఎస్ 7 ఎడ్జ్ మోడళ్లను లాంచ్ చేయనుంది. ఎస్ 7 రేంజ్ స్మార్ట్ ఫోన్లలో స్నాఫ్ డ్రాగన్ 820 ప్రాసెసర్, 4 జీబీకిపైగా రామ్ వంటి ఫీచర్లతోపాటు మెరుగైన గ్రాఫిక్ ప్రాసెసర్ ను పొందుపర్చవచ్చని టెక్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంతేకాదు ఎస్ 6 లోని హార్ట్బీట్ మానిటర్, ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫీచర్లను ఇందులో కొనసాగించవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ లో లేటెస్ట్ వెర్షన్ అయిన మార్స్ మల్లో ను ఎస్ 7 మోడళ్లలో ఇంట్రడ్యూస్ చేసే అవకాశం ఉంది.
ఫీచర్స్ విషయానికొస్తే
ఆండ్రాయిట్ 6.0 వర్షన్
క్వాడ్ కోర్ 4.0 GHz 64 బిట్ ప్రాసెసర్
6 లేక 8 జిబి ర్యామ్
5జీ నెట్ వర్క్
4కె లేక 5 కె లేక 5.5 ఇంచ్ డిస్ ప్లే
ధర దాదాపు రూ. 70,500
మార్చి ఏప్రిల్ లో విడుదల చేసే అవకాశం

గూగుల్ నెక్సస్ 6

గూగుల్ నెక్సస్ 6

టెక్నాలజీ దిగ్గజం గూగుల్ ఈమధ్య అందుబాటులోకి తెచ్చిన గూగుల్ నెక్సస్ 6 పీ స్మార్ట్ఫోన్కు మార్కెట్లో మంచి మార్కులే పడ్డాయి. ఈ ఏడాదిలో సంస్థ మరిన్ని అధునాతన ఫీచర్లతో కూడిన నెక్సస్ 6 2016 మోడల్ను మార్కెట్లోకి ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్ ఎన్ వెర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా ఈ ఫోన్ నడవనుంది.
ఫీచర్స్ విషయానికొస్తే
క్వాల్ కోమ్ 820 స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్
6 ఇంచ్ లేక 5.7 ఇంచ్ డిస్ ప్లే
ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో
క్విక్ ఛార్జింగ్

 ఎల్‌జీ 5

ఎల్‌జీ 5

స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ఆపిల్, సామ్‌సంగ్ సంస్థలతో ఢీకొనేందుకు కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్ సంస్థ ఎల్‌జీ సరికొత్త, అత్యాధునిక ఫీచర్లతో మొబైల్స్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నది. ఈ ఏడాదిలో లాంచ్ చేయనున్న ఎల్‌జీ 5 ను 4 కే టెక్నాలజీ స్క్రీన్, మెగాపిక్సెల్ కెమెరా 20, ఐరిస్ స్కానర్, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లతో రూపొందిస్తున్నట్లు సమాచారం.
ఫీచర్స్ విషయానికొస్తే
పుల్ యుహెచ్ డి డిస్ ప్లే
4 లేక 5 జిబి ర్యామ్
స్నాప్ డ్రాగన్ 810 లేక బెస్ట్ కమింగ్ ప్రాసెసర్
21 మెగా ఫిక్షల్ కెమెరా 4 ఇమేజ్ లు తీయవచ్చు
లేటెస్ట్ ఓఎస్ ఎమ్

హెచ్‌టీసీ వన్ ఎం 10

హెచ్‌టీసీ వన్ ఎం 10

ప్రతి యేటా జరిగే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ఎగ్జిబిషన్లో హెచ్‌టీసీ సంస్థ తన ఫ్లాగ్షిప్ మోడల్‌ను ఆవిష్కరిస్తుంటుంది. ఈసారి సంస్థ వన్ ఎం 10 ఫోన్‌ను ప్రదర్శించనుంది. 4 కే అల్ట్రా హెచ్ డీ డిస్ ప్లే , ఎంఏహెచ్ బ్యాటరీ 3,500 స్నాప్ డ్రాగన్ 820 ప్రాసెసర్, టైప్-సీ యూఎస్బీ కనెక్టర్, మరింత మెరుగైన కెమెరా వంటి ఫీచర్లతో దీన్ని డిజైన్ చేసినట్లు తెలుస్తున్నది.
ఫీచర్స్ విషయానికొస్తే
క్వాల్ కోమ్ 820 చిప్
4జిబి ర్యామ్
1,440 x 2,560 డిస్ ప్లే
27 మెగా ఫిక్షల్ కెమెరా
64 లేక 128 జిబి స్టోరేజ్
3500 mAh లాంటర్ బ్యాటరీ

షామీ ఎంఐ 5

షామీ ఎంఐ 5

చైనా ఆపిల్‌గా ప్రసిద్ధిగాంచిన స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షామీ .. ఈ ఏడాది ఎంఐ 5 మోడల్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్, 4 జీబీ రామ్, టైప్-సీ యూఎస్బీ కనెక్టర్, ఫింగర్ప్రింట్ స్కానర్, హోమ్ బటన్, ఐదు అంగుళాల స్క్రీన్, 16 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా వంటి ఫీచర్లను పొందుపర్చనున్నట్లు మార్కెట్ వర్గాలంటున్నాయి. అంతేకాదు ఈ ఫోన్ ఆండ్రాయిడ్ మార్ష్మల్లో వెర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా నడువనుందని తెలుస్తున్నది.

మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ఫోన్ అండ్ లూమియా 940 అండ్ 940 ఎక్స్‌ఎల్

మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ఫోన్ అండ్ లూమియా 940 అండ్ 940 ఎక్స్‌ఎల్

విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ తయారీ సంస్థ మైక్రోసాఫ్ట్ .. కొత్తగా తయారు చేస్తున్న సర్ఫేస్ ఫోన్‌ను ఈ ఏడాదిలో మార్కెట్లోకి తేనుందని అంచనా. 64 బిట్ ఇంటెల్ ప్రాసెసర్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ 10, 5.5 అంగుళాల ఏఎంవోఎల్ఈడీ డిస్‌ప్లే, 21 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, టైప్-సీ యూఎస్బీ కనెక్టర్ వంటి ఫీచర్లతో దీన్ని డిజైన్ చేస్తున్నట్లు సమాచారం.

940 అండ్ 940 ఎక్స్‌ఎల్ ఫీచర్స్ విషయానికొస్తే

940 అండ్ 940 ఎక్స్‌ఎల్ ఫీచర్స్ విషయానికొస్తే

940 అండ్ 940 ఎక్స్‌ఎల్ ఫీచర్స్ విషయానికొస్తే
1440 x 2560 ఫిక్షల్ QHD స్కీన్
7. 7 ఇంచ్ స్కీన్
940 XL ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 810
940 హెక్సా కోర్ స్నాప్ డ్రాగన్ 808
అడెర్నో 430 సీపీయు
3జిబి ర్యామ్
విండోస్ 10
20 ఎంపీ కార్ల్ జెసిస్ బ్యాక్ కెమెరా
5 ఎంపీ సెల్ఫీ కెమెరా

సోనీ ఎక్స్పీరియా జెడ్ 6

సోనీ ఎక్స్పీరియా జెడ్ 6

జపాన్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజ సంస్థ సోనీ .. ఈ సంవత్సరం మార్కెట్లోకి ఎక్స్పీరియా సిరీస్ లో జెడ్ 6 మోడల్ ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. గతంలో ప్రవేశపెట్టిన జెడ్ 5 ప్రీమియం వెర్షన్ ను 4 కే డిస్ ప్లే , ఫింగర్ ప్రింట్ స్కానర్, బిగ్ బ్యాటరీ వంటి ఫీచర్లతో డిజైన్ చేసిన సంస్థ కొత్తగా విడుదల చేయబోయే మోడల్లో వీటితోపాటు మరింత ఆధునాతన కెమెరాను పొందుపర్చే అవకాశం ఉంది.
ఫీచర్స్ విషయానికొస్తే
క్వాల్ కోమ్ 820 చిప్ సెట్ ట్రూ ఆక్టో కోర్ చిప్ 3GHz+ప్రాసెసర్
4లేక 5 జిబి ర్యామ్
5 ఇంచ్ డిస్ ప్లే రిజల్యూషన్
టచ్ ఐడీ ఫింగర్ ప్రింట్ సెన్సార్
27 ఎంపీ రొటేట్ కెమెరా
128 జిబి స్టోరేజ్ కెపాసిటీ
వాటర్ ప్రూప్ ,డస్ట్ ప్రూప్

బ్లాక్‌బెర్రీ వియన్నా, వెనిస్

బ్లాక్‌బెర్రీ వియన్నా, వెనిస్

బ్లాక్‌బెర్రీ సంస్థ తొలిసారిగా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారిత మొబైళ్లను మార్కెట్లో లాంచ్ చేయనుంది. సంస్థ నుంచి తొలి ఆండ్రాయిడ్ ఆధారిత ఫోన్ ప్రివ్యూను 2016 లో లాంచ్ చేస్తున్నట్లు బ్లాక్‌బెర్రీ గతేడాదే ప్రకటించింది. ప్రివ్యూతో పాటు ఆండ్రాయిడ్ తో నడిచే వియన్నా, వెనిస్ మోడళ్లను కూడా ఈ సంవత్సరంలోనే అందుబాటులోకి తేనున్నట్లు సమాచారం. వియన్నా స్మార్ట్ పోన్లు ఫిజికల్ కీబోర్డు ప్రధాన ఆకర్షణ కానుంది. వెనిస్ కూడా ఫిజికల్ కీబోర్డుతోకూడిన స్లైడర్ స్మార్ట్ ఫోన్.

అసుస్ జడ్ 1టైటాన్

అసుస్ జడ్ 1టైటాన్

గతేడాది 4జిబి ర్యాంత్ సర్ ప్రైజ్ ఇచ్చిన అసుస్ జెన్ ఫోన్ 2 ఇప్పుడు మార్కెట్లోకి మళ్లీ సత్తా చాటేందుక వస్తోంది. రానున్న అసుస్ ఫోన్ ధర దాదాపు 25 వేల రూపాయలు ఉండే అవకాశం ఉంది.
ఫీచర్ల విషయానికొస్తే
6జిబి ర్యామ్
16 ఎంపీ కెమెరా
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5
5.5 ఇంచ్ 2కె ఆమోలెడ్ స్కీన్ డిస్ ప్లే

నోకియా సీ1

నోకియా సీ1

ఆండ్రాయిడ్ లాలీపాప్ తో నోకియా కూడా మార్కెట్లోకి సీ 1 పేరుతో స్మార్ ఫోన్ ను తీసుకురానుంది. గతేడాది నవంబర్ లో ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ పీసీని విడుదలచేసి సంచలనం సృష్టించిన విషయం విదితమే.
ఫీచర్ల విషయానికొస్తే
2 జిబి ర్యామ్
32 జిబి ఇంటర్నల్ స్టోరేజి
4జీ సపోర్ట్
8 మెగా ఫిక్షల్ కెమెరా..5 ఎంపీ సెల్ఫీ కెమెరా
5 ఇంచ్ డిస్ ప్లే
ఇండియాలో దీని ధర దాదాపు రూ. 20 వేలు ఉండవచ్చు

ఒప్పో ఫైండ్ 9

ఒప్పో ఫైండ్ 9

ఒప్పో పైండ్ 7 మార్కెట్లో దూసుకుపోయిన నేపథ్యంలో కంపెనీ ఇప్పుడు ఒప్పో ఫైండ్ 9 స్మార్ట్ ఫోన్ ను అత్యాధునిక మంగులతో మార్కెట్ లోకి తీపసుకురానుంది.
ఫీచర్ల విషయానికొస్తే
4జిబి ర్యామ్ ఉండొచ్చు
20 మెగా ఫీ కెమెరా తో పాటు 8 ఎంపీ సెల్ఫీ కెమెరా
2560x1440p రిజల్యూషన్
64 జిబి ఇన్ బుల్ట్ మెమెరీ
5.5 ఇంచ్ సైజ్

వన్ ప్లస్ 3

వన్ ప్లస్ 3

వన్ ప్లస్ 2 కెమెరా అందరూ బాగుందని కామెంట్స్ ఇవ్వడంతో కంపెనీ దాని కన్నా ధీటుగా ఇప్పుడు వన్ ప్లస్ 3 ని మార్కెట్ లోకి తీసుకురానుందని తెలుస్తోంది. దీనికి జెన్ చిప్ సెట్ కూడా అమర్చునున్నట్లు కంపెనీ సీఈఓ ఇప్పటికే ప్రకటించారు.
ఫీచర్ల విషయానికొస్తే
5 జిబి ర్యామ్
5.5 ఇంచ్ డిస్ ప్లే
4400mah బ్యాటరీ
స్నాప్ డ్రాగన్ 820 ప్రాసెసర్
21 ఎంపీ కెమెరా , 13 ఎంపీ సెల్ఫీ కెమెరా
ఆక్సిజన్ ఓఎస్ తో పాటు ఆండ్రాయిడ్ ఎమ్

జియోమి ఎమ్ ఐ 6

జియోమి ఎమ్ ఐ 6

జియోమి కూడా తన కొత్త ఫోన్ ను అత్యాధునిక హంగులతో మార్కెట్ లోకి తీసుకురానుంది. దీనికి సంబంధించిన పీచర్స్ కూడా మార్కెట్లో చక్కర్లు కొడుతున్నాయి
ఫీచర్ల విషయానికొస్తే
Ultra HD 2160 x 3840 ఫిక్సల్ AMOLED డిస్ ప్లే
క్వాల్ కోమ్ స్నాప్ డ్రాగన్ 820
4జిబి పవర్ పుల్ ర్యామ్
5జీ నెట్ వర్క్ ఉండవచ్చు
4200mah బ్యాటరీ
21 ఎంపీ కెమెరాతో పాటు ,13 ఎంపీ సెల్ఫీ కెమెరా

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి ఎప్పటికప్పుడు మీరు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి పొందగలరు. https://www.facebook.com/GizBotTelugu/

 

 

Best Mobiles in India

English summary
Here Write Best new phones coming in 2016 - the smartphones worth waiting for

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X