Home
Computer

మోటోరోలా నుంచి కొత్త ల్యాప్‌టాప్‌.. రూ.5 వేల డిస్కౌంట్‌లో ఇవాళ్టి నుంచే కొనుగోలు చేయవచ్చు..!

మోటో భారత్‌ మార్కెట్‌ లో ఈ సంవత్సరం ఏప్రిల్‌ నెలలో మోటో బుక్‌ 60 ల్యాప్‌టాప్‌ ను విడుదల చేసింది. అయితే తాజాగా మోటో బుక్‌ 60 ప్రో ల్యాప్‌టాప్‌ భారత్‌ మార్కెట్‌ లో లాంచ్‌ చేసింది. ప్రో మోడల్‌ రెండు వేరియంట్స్‌ లో అందుబాటులోకి వచ్చింది. మరియు మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌ ను కలిగి ఉంది. ఈ ల్యాప్‌టాప్‌ స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు.

మోటో బుక్‌ 60 ప్రో ల్యాప్‌టాప్‌ స్పెసిఫికేషన్లు, ఫీచర్‌లు :
మోటో ల్యాప్‌టాప్‌ (Moto Book 60 Pro Laptop) 14 అంగుళాల 2.8K OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 1100 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, 100 శాతం DCI - P3 కలర్ గామట్‌ ను కలిగి ఉంది. TUV Rheinland సర్టిఫికేషన్‌లను కలిగి ఉంది.

Moto Book 60 Pro laptop launched in india

ఈ ల్యాప్‌టాప్‌ రెండు ప్రాసెసర్ వేరియంట్స్‌ లో అందుబాటులోకి వచ్చింది. ఇంటెల్‌ కోర్‌ అల్ట్రా 5 225H ప్రాసెసర్‌ ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్‌ 16GB DDR5 ర్యామ్, 1TB SSD స్టోరేజీని సపోర్టు చేస్తుంది. మరియు ఇంటెల్ కోర్‌ అల్ట్రా 7 225 H CPU ప్రాసెసర్‌ ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్‌ 32GB DDR5 ర్యామ్, 1TB SSD స్టోరేజీని సపోర్టు చేస్తుంది.

విండోస్‌ 11 OS :
ఈ మోటో బుక్‌ 60 ప్రో విండోస్‌ 11 OS పైన పనిచేస్తుంది. ఈ మోటో బుక్ 2W డాల్బీ అట్మాస్‌ స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంటుంది. విండోస్‌ ఫేసియల్‌ రికగ్నైజేషన్‌ కోసం IR కెమెరాను కలిగి ఉంది. ఈ ల్యాప్‌టాప్‌ స్మార్ట్‌ కనెక్ట్ ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది.

Moto Book 60 Pro laptop launched in india

65W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ :
మోటో బుక్‌ 60 ప్రో ల్యాప్‌టాప్‌ 65W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 60Wh బ్యాటరీని కలిగి ఉంది. MIL STD 810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా బ్లూటూత్‌ 5.4, వైఫై 7, రెండు USB 3.2 జెన్ 1, రెండు USB-C 3.2 జెన్‌ 1, HDMI 2.1 పోర్టులను కలిగి ఉంది. 3.5mm ఆడియో జాక్‌ కూడా ఉంది.

మోటో బుక్‌ 60 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ ధర, సేల్‌ వివరాలు :
ఈ మోటో ల్యాప్‌టాప్‌ ఇంటెల్‌ కోర్‌ అల్ట్రా 5 వేరియంట్ 16GB ర్యామ్ + 1TB స్టోరేజీ మోడల్‌ ధర రూ.64990 గా ఉంది. అదే ఇంటెల్ కోర్‌ అల్ట్రా 7 వేరియంట్ 32GB ర్యామ్ + 1TB స్టోరేజీ మోడల్‌ ధర రూ.80999 గా ఉంది. బ్యాంకు కార్డులపై రూ.5 వేల డిస్కౌంట్‌ను అందిస్తున్నట్లు తెలిపింది.

Take a Poll

ఇప్పుడే కొనుగోలు చేయవచ్చు :
మోటో బుక్‌ 60 ప్రో ల్యాప్‌టాప్‌ బ్రాంజ్ గ్రీన్, వెడ్జ్‌వుడ్‌ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది. ప్రస్తుతం ఈ ల్యాప్‌టాప్‌ను మోటోరోలా ఇండియా వెబ్‌సైట్‌, ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చని తెలిపింది.

More from GizBot

Best Mobiles in India

English summary
Moto Book 60 Pro laptop launched in india and sale is also live on flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X