Home
Computer

మోటోరోలా నుంచి తొలి ల్యాప్‌టాప్‌ విడుదల.. విండోస్‌ 11 హోం OS, 14 అంగుళాల డిస్‌ప్లే, 60Wh బ్యాటరీ!

Motorola First Laptop : మోటోరోలా సంస్థ భారత్‌ మార్కెట్‌లో తొలి ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. మోటో బుక్‌ 60 పేరుతో (Moto Book 60 Laptop Launched in india) అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతోపాటు మోటో ప్యాడ్ 60 ప్రో ట్యాబ్లెట్‌ ను కూడా లాంచ్ చేసింది. వచ్చే వారం నుంచి భారత్ మార్కెట్‌లో మోటోరోలా ట్యాప్‌టాప్‌ కొనుగోలు చేయవచ్చు. రెండు ప్రాసెసర్ మోడల్స్‌లో అందుబాటులో ఉంది. విండోస్‌ 11 హోం OS పైన పనిచేస్తుంది. ఈ ట్యాప్‌టాప్‌ పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్‌ల వివరాలు.

మోటో బుక్‌ 60 స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
మోటో ల్యాప్‌టాప్‌ 14 అంగుళాల 2.8k (1800*2880 పిక్సల్స్‌) OLED డిస్‌ప్లేతో భారత్ మార్కెట్‌లో విడుదల అయింది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 500 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. దీంతోపాటు ఈ డిస్‌ప్లే HDR సపోర్టు, డాల్బీ విజన్‌ సపోర్టును కలిగి ఉంది. TUV Rheinland Low బ్లూ లైట్, ఫ్లిక్కర్‌ ఫ్రీ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది.

moto Book 60 telugu news

మోటో బుక్‌ 60 మిలిటరీ గ్రేడ్‌ MIL STD 810H ఫీచర్‌ను కూడా కలిగి ఉంటుంది. ఫలితంగా ఎక్కువ రోజులపాటు మన్నిక వస్తుంది. ఈ ట్యాప్‌టాప్ బటన్‌లెస్‌ Mylar టచ్‌ప్యాడ్‌ ను కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా బ్లూటూత్‌ 5.4, వైఫై 7 తో పనిచేస్తుంది.

మోటో బుక్‌ 60 ల్యాప్‌టాప్‌ విండోస్‌ 11 హోం OS పైన పనిచేస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌ Intel core 5 సిరీస్‌ 210H ప్రాసెసర్‌, Intel core 7 సిరీస్‌ 240H ప్రాసెసర్‌ లపైన పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్‌లతోపాటు ఇంటెల్ గ్రాఫిక్స్‌ను కూడా కలిగి ఉంటుంది. ఈ రెండు ప్రాసెసర్‌లు గరిష్ఠంగా 32GB DDR5 ర్యామ్ మరియు 1TB PICe 4.0 SSD స్టోరేజీని సపోర్టు చేస్తుంది.

moto Book 60 telugu news

మోటో ల్యాప్‌టాప్‌లు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) ఫీచర్‌లతోపాటు స్మార్ట్ కనెక్ట్‌, స్మార్ట్‌ క్లిప్‌ బోర్డు, ఫైల్‌ ట్రాన్స్‌ఫర్ వంటి ఇతర ఫీచర్‌లను కలిగి ఉంది. దీంతోపాటు Firmware TPM 2,0 సెక్యూరిటీ చిప్‌ తో విడుదల అయింది.

మోటో బుక్‌ 60 ల్యాప్‌టాప్‌ రెండు USB-C 3.2 జెన్‌ 1 పోర్టులు, USB-A 3.2 జెన్‌ 1 పోర్టులను కలిగి ఉంది. వీటితోపాటు HDMI పోర్టు, డిస్‌ప్లే పోర్టు 1.4, మైక్రో SD స్లాట్‌, 3.5mm ఆడియో జాక్‌ను కలిగి ఉంది. మెరుగైన ఆడియో సపోర్టు కోసం డాల్బీ అట్మాస్‌, 2W ఆడియోతో కూడిన డ్యూయల్‌ స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది.

ఈ ల్యాప్‌టాప్‌ ప్రైవసీ షట్టర్‌తో కూడిన 1080P వెబ్‌క్యామ్‌ను కలిగి ఉంది. విండోస్‌ Hello ఫేస్‌ రికగ్నైజేషన్‌తో కూడిన IR కెమెరాను కూడా అమర్చారు. మోటో బుక్ 60 ల్యాప్‌టాప్ 65W ఛార్జింగ్‌ సపోర్టుతో 60Wh బ్యాటరీతో పనిచేస్తుంది.

మోటో బుక్‌ 60 ల్యాప్‌టాప్‌ ధర :
మోటో బుక్‌ 60 ల్యాప్‌టాప్‌ వెడ్జ్‌ వుడ్‌, బ్రాంజ్‌ గ్రీన్‌ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది. Intel Core 5 సిరీస్‌ ప్రాసెసర్‌ 16GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.69999 గా ఉంది. లాంచ్‌ ఆఫర్‌లో భాగంగా రూ.61999 కే కొనుగోలు చేయవచ్చు.

మోటో బుక్‌ 60 ల్యాప్‌టాప్‌ Intel core 7 సిరీస్ 16GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.74999, 16GB ర్యామ్ + 1TB స్టోరేజీ వేరియంట్ ధర రూ.78990 గా ఉంది. లాంచ్‌ ఆఫర్‌లో భాగంగా ఈ రెండు మోడల్స్‌ ను డిస్కౌంట్‌కు కొనుగోలు చేయవచ్చు. ఏప్రిల్ 23 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Motorola launched first laptop moto Book 60 in india here are the best features and specifications
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X