ప్రపంచంలోనే అతి పెద్ద సూపర్ కంప్యూటర్, అచ్చం మనిషిలానే..

|

శాస్త్రవేత్తలు సరికొత్త టెక్నాలజీ వైపు పరుగులు పెడుతున్నారు. తమ మెదడుకు పనిచెప్పి టెక్నాలజీ రంగంలో విప్లవాత్మక పరిశోధనలకు శ్రీకారం చుడుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు ఓ సూపర్ కంప్యూటర్ ని ప్రపంచం ముందుకు తీసుకువచ్చారు. ఈ కంప్యూటర్ అచ్చం మనిషిలాగానే అన్ని పనులను చేస్తుంది. మనిషి మెదడు ఎలా ఆలోచిస్తుందో అచ్చం అలానే ఈ కంప్యూటర్ ఆలోచిస్తుందని ఈ సూపర్ కంప్యూటర్ నిర్వాహకులు చెబుతున్నారు.కాగా మానవుని మెదడులాగే ఆలోచించే సరికొత్త సూపర్‌ కంప్యూటర్‌ ప్రపంచంలోనే అతిపెద్ద సూపర్‌ కంప్యూటర్‌. దీన్ని బ్రిటన్‌లోని మాంచెస్టర్‌ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవే త్తలు రూపొందించారు.

ఇకపై మెదడుతోనే Tv ఆపరేట్ చేయవచ్చు,శాంసంగ్ భారీ షాక్ !

 

దీన్ని స్విచ్చ్‌ ఆన్‌ చేసి ప్రయోగించి చూశారు...

దీన్ని స్విచ్చ్‌ ఆన్‌ చేసి ప్రయోగించి చూశారు...

ఇటీవలే దీన్ని స్విచ్చ్‌ ఆన్‌ చేసి ప్రయోగించి చూశారు. మిలియన్‌-ప్రాసెసర్‌- న్యూరల్‌ కోర్‌ స్పైకింగ్‌ న్యూరల్‌ నెట్‌వర్క్‌ (స్పిన్నకర్‌) ఆధారంగా పని చేసే ఈ కంప్యూటర్‌ సెకన్‌కు 200 మిలియన్‌ మిలియన్ల విశ్లేషణలు చేయగలదు. అలాగే ఇందులో వాడిన ఒక్కో చిప్‌ 10 కోట్ల ట్రాన్సిస్టర్లు కలిగి ఉంటుంది.

ఈ సూపర్‌ కంప్యూటర్‌ తయారీకి మొత్తం 30 ఏళ్లు పడితే ఇందులో పరిశోధనకే 20 ఏళ్లు పట్టింది....

ఈ సూపర్‌ కంప్యూటర్‌ తయారీకి మొత్తం 30 ఏళ్లు పడితే ఇందులో పరిశోధనకే 20 ఏళ్లు పట్టింది....

ఆసక్తికర విషయం ఏంటంటే ఈ సూపర్‌ కంప్యూటర్‌ తయారీకి మొత్తం 30 ఏళ్లు పడితే ఇందులో పరిశోధనకే 20 ఏళ్లు పట్టింది.ఇక దీని నిర్మాణానికి మరో పదేళ్లు పట్టింది. ఈ సూపర్‌ కంప్యూటర్‌ను అభివృద్ధి చేసేందుకు మొత్తం రూ.141 కోట్లు ఖర్చయినట్లు బ్రిటన్‌లోని మాంచెస్టర్‌ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవే త్తలు తెలిపారు. మానవ మెదడులోని న్యూరాన్స్‌ లాగే ఈ కంప్యూటర్‌ స్పందనలు కలిగి ఉంటుందని, ఇలాంటిది ప్రపంచంలో మరెక్కడా లేదని పేర్కొన్నారు.

మానవుని మె దడులోని రహస్యాలను ఛేదించి...
 

మానవుని మె దడులోని రహస్యాలను ఛేదించి...

మానవుని మె దడులోని రహస్యాలను ఛేదించి, విశ్లేషించడాని కి న్యూరో శాస్త్రవేత్తలకు ఈ సూపర్‌ కంప్యూటర్‌ ఎంతగానోఉపయోగపడుతుందని వర్సిటీకి చెందిన స్టీవ్‌ ఫర్బర్‌ అనే శాస్త్రవేత్త చెప్పారు. అతి తక్కువ శక్తితో రోబోలు కూడా మానవుని వలే మాట్లాడేందుకు, నడిచేందుకు ఈ కంప్యూ టర్‌ దోహదపడుతుందని ఆయన అన్నారు.

అత్యంత వేగవంతమైన సూపర్‌కంప్యూటర్‌ను...

అత్యంత వేగవంతమైన సూపర్‌కంప్యూటర్‌ను...

కాగా ఇదివరకే సెకనుకు రెండు లక్షల ట్రిలియన్ల లెక్కలు చేయగలిగే సామర్థ్యంతో ఏకకాలంలో 10 లక్షల జీబీ (10 పెటాబైట్స్)కన్నా ఎక్కువ సమాచారాన్ని ప్రాసెస్ చేయగలిగే అత్యంత వేగవంతమైన సూపర్‌కంప్యూటర్‌ను అమెరికా ఆవిష్కరించిన సంగతి కూడా తెలిసిందే. దీనికి సమిట్ అని పేరుపెట్టింది.

ఓక్‌రిడ్జ్ నేషనల్ లేబొరేటరీ...

ఓక్‌రిడ్జ్ నేషనల్ లేబొరేటరీ...

ఓక్‌రిడ్జ్ నేషనల్ లేబొరేటరీ (ఓఆర్‌ఎన్‌ఎల్) ఈ సూపర్ కంప్యూటర్‌ను రూపొందించింది. దీనికి ఐబీఎం సంస్థ సహకారం అందించింది. దీని వేగం సెకన్‌కు 200 పెటాఫ్లాప్స్. అంటే సెకన్‌కు రెండు లక్షల ట్రిలియన్ల లెక్కలను చేయగలదు. ఒక ట్రిలియన్ అంటే లక్ష కోట్లు. దీనినిబట్టి సమిట్ సామర్థ్యాన్ని ఊహించుకోవచ్చు.

ఓఆర్‌ఎన్‌ఎల్, ఐబీఎం కలిసి 2012లో టైటాన్ సూపర్ కంప్యూటర్‌ను...

ఓఆర్‌ఎన్‌ఎల్, ఐబీఎం కలిసి 2012లో టైటాన్ సూపర్ కంప్యూటర్‌ను...

అత్యంత శక్తివంతమైన ప్రాసెసర్లను అమర్చడం వల్ల సమిట్ ఏకకాలంలో 10లక్షల జీబీ (10 పెటాబైట్స్)కన్నా ఎక్కువ సమాచారాన్ని ప్రాసెస్ చేయగలుగుతుంది. దీని అంతర్గత మెమెరీయే 25కోట్ల జీబీలు ఉండటం విశేషం. ఇదిలా ఉంటే ఓఆర్‌ఎన్‌ఎల్, ఐబీఎం కలిసి 2012లో టైటాన్ సూపర్ కంప్యూటర్‌ను తయారుచేశాయి. దీని సామర్థ్యం 27 పెటాఫ్లాప్స్. ఇది ఇప్పటివరకు అమెరికాలోనే వేగవంతమైన సూపర్‌కంప్యూటర్. దీన్ని సమిట్ క్రాస్ చేయగా ఇప్పుడు దీన్ని కొత్తగా వచ్చిన సూపర్ కంప్యూటర్ క్రాస్ చేసే అవకాశం ఉంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
New supercomputer mimics human brain, researchers say more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X