బంగారపు యాపిల్ ల్యాప్‌టాప్!

Posted By: Staff


బంగారపు యాపిల్ ల్యాప్‌టాప్!

 

యాపిల్ అభిమానులకు ఖరీదైన వార్త... మీలో ఎవరికైనా 24 క్యారెట్ గోల్డ్ ప్లేటెడ్ మ్యాక్ బుక్ ప్రోను సొంతం చేసుకోవాలనుందా అయితే ఓ 30,000 డాలర్లు చెల్లించి ఆ కలను నిజం చేసుకోండి. ప్రముఖ అంతర్జాతీయ సంస్థ కంప్యూటర్ చోపర్స్ ఈ ఖరీదైన గోల్డె ప్లేటెడ్ ల్యాప్‌టాప్‌ను వైట్, రోజ్, ఎల్లో గోల్డ్,  కాపర్, బ్లాక్ ఇంకా సిల్వర్ క్రోమ్ కలర్ వేరియంట్‌లలో వజ్రాలతో కూడిన యాపిల్ లోగోతో అందిస్తుంది. ఈ అంశం పై సంస్థ వ్యవస్థాపకుడు అలెక్స్ వైలీ స్పందిస్తూ తాము వినియోగదాలు వ్యక్తిగత అభిరుచిల మేరకు సదరు

గాడ్జెట్‌లను బంగారంతో తీర్చి దిద్దగలమని సీఎన్ఎన్ మనీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

అబ్బా..కోట్లు విలువ చేసే ఖరీదైన సెల్‌ఫోన్‌లు (గ్యాలరీ)

24 క్యారట్ గోల్డ్ ప్లేటెడ్ ఐఫోన్5‌:

బంగారపు యాపిల్ ల్యాప్‌టాప్!

ఖరీదైన స్మార్ట్‌‌ఫోన్‌ల పట్ల మక్కువ కనబర్చే వారికి ఈ శీర్షిక ఆసక్తిని రేకెత్తించటం ఖాయం. వివరాల్లోకి వెళితే… జ్యూయలరీ రంగంలో ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన గోల్డ్ అండ్ కో సంస్థ 24 క్యారట్ గోల్డ్ ప్లేటెడ్ ఐఫోన్5‌ను ఆవిష్కరించి సరికొత్త సంచలనానికి నాంది పలికింది. ఆది నుంచి ఆపిల్‌తో అనుంబంధాన్ని ఏర్పరుచుకున్న ఈ సంస్థ విడుదలైన ప్రతి ఐఫోన్‌ను బంగారంతో తీర్చిదిద్గటం అనవాయితీగా వస్తోంది. ‘రెడ్‌మెండ్ పై’(Redmond pie) వెలువురించిన సమాచారం మేరకు ఈ గోల్డెన్ ఫోన్ ధర $4600 అంటే రూ.2,50,000. మరో వేరియంట్ రోస్ గోల్డ్ అంచనా ధర $5000 అంటే రూ.2,70,000. ఈ సంస్థ 64జీబి ఐఫోన్ 4ఎస్ గోల్డ్ ప్లేటెడ్ వర్షన్‌ను సైతం అందుబాటులో ఉంచింది. ధర $4,300 అంటే రూ.2,30,000.

బడా బాబులను ఫిదా చేస్తున్న అందాలు

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot