Home
Computer

3K డిస్‌ప్లే, అద్భుతమైన ఫీచర్లతో శామ్‌సంగ్ గెలాక్సీ బుక్5 సిరీస్ ల్యాప్‌టాప్స్‌ వచ్చేస్తున్నాయ్.. ధరలు చూస్తే

Samsung Galaxy Book5: శామ్‌సంగ్ కంపెనీ ఇండియాలో అదిరిపోయే ఫీచర్లతో కూడిన గెలాక్సీ బుక్5 సిరీస్ ల్యాప్‌టాప్‌లను లాంచ్ చేసింది. ఇందులో ఇంటెల్ కోర్ అల్ట్రా సిరీస్ 2 ప్రాసెసర్లు వాడారు, ఇంకా AI టెక్నాలజీతో పనిచేసే చాలా ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ ల్యాప్‌టాప్‌లలో మైక్రోసాఫ్ట్ కోపైలట్+ ఫీచర్ కూడా ఉంది, ఇది అడ్వాన్స్‌డ్ AI అసిస్టెన్స్‌ను అందిస్తుంది. ఈ సిరీస్‌లో మూడు మోడల్స్ ఉన్నాయి. అవేవో, వాటి ధరలెంతో తెలుసుకుందాం.

* మోడల్స్, ధరలు

గెలాక్సీ బుక్5 సిరీస్‌లో ఉన్న మూడు మోడల్స్ గెలాక్సీ బుక్5 ప్రో, గెలాక్సీ బుక్5 ప్రో 360, గెలాక్సీ బుక్5 360. గెలాక్సీ బుక్5 సిరీస్ ల్యాప్‌టాప్‌లు ఇండియాలో 2025 మార్చి 20 నుంచి అమ్మకానికి వస్తాయి. వీటిని Samsung.com, శామ్‌సంగ్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్స్, ప్రముఖ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్, పెద్ద రిటైల్ స్టోర్స్‌లో కొనుక్కోవచ్చు.

Samsung Launches Galaxy Book5 Series Laptops in India with AI-Powered Features

మోడల్స్‌ వారిగా ధరలు చూస్తే గెలాక్సీ బుక్5 ప్రో ధర రూ.1,31,990, గెలాక్సీ బుక్5 ప్రో 360 ధర రూ.1,55,990, గెలాక్సీ బుక్5 360 ధర రూ.1,14,990 ఈ ల్యాప్‌టాప్స్‌ను ప్రీ-బుకింగ్ చేసుకున్న వాళ్లకు ఒక మంచి ఆఫర్ ఉంది. అదేంటంటే వాళ్లు గెలాక్సీ బడ్స్3 ప్రో ఇయర్ బడ్స్‌ను కేవలం రూ.2,999 కే కొనుక్కోవచ్చు.

* ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

గెలాక్సీ బుక్5 ప్రో 14-అంగుళాల 3K డైనమిక్ అమోలెడ్ డిస్‌ప్లేతో, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. గెలాక్సీ బుక్5 ప్రో 360 మోడల్ 16-అంగుళాల 3K అమోలెడ్ ప్యానెల్‌తో, ఇది కూడా 120Hz రిఫ్రెష్ రేట్‌తో లభిస్తుంది. చివరగా గెలాక్సీ బుక్5 360 మోడల్ 15.6-అంగుళాల FHD అమోలెడ్ డిస్‌ప్లేతో, 60Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది.

* పనితీరు, AI ఫీచర్లు

ఈ ల్యాప్‌టాప్‌లలో ఇంటెల్ కోర్ అల్ట్రా సిరీస్ 2 ప్రాసెసర్‌లు ఉన్నాయి, వీటిలో ప్రత్యేకంగా AI పనుల కోసం NPU కూడా ఉంటుంది. ఇది 47 TOPS వరకు AI పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. కొత్త చిప్‌సెట్ వల్ల పవర్ కూడా 40 శాతం తక్కువగా ఖర్చవుతుంది, అంటే బ్యాటరీ లైఫ్ ఎక్కువ వస్తుంది.

* మెమరీ, స్టోరేజ్

ఈ సిరీస్‌లో 32GB వరకు RAM.. 256GB, 512GB, లేదా 1TB SSD స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి. మోడల్‌ను బట్టి బ్యాటరీ కెపాసిటీ మారుతుంది. గెలాక్సీ బుక్5 ప్రో బ్యాటరీ సామర్థ్యం 63.1Wh ఉండగా, గెలాక్సీ బుక్5 ప్రో 360 బ్యాటరీ సామర్థ్యం 76.1Wh, గెలాక్సీ బుక్5 360 బ్యాటరీ సామర్థ్యం 68.1Whగా ఉన్నాయి.

* ఆడియో, కనెక్టివిటీ

మూడు మోడల్స్‌లోనూ క్వాడ్-స్పీకర్ సెటప్, డాల్బీ అట్మాస్ ఉన్నాయి, అంటే సౌండ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. ఈ ల్యాప్‌టాప్స్‌ను ఫోన్ లింక్, క్విక్ షేర్, మల్టీ-కంట్రోల్, సెకండ్ స్క్రీన్ వంటి ఫీచర్లతో మీ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్‌లతో ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు, తద్వారా వైర్ల అవసరం ఉండదు.

* సెక్యూరిటీ, AI ఫీచర్లు

శామ్‌సంగ్ నాక్స్ సెక్యూరిటీ ప్లాట్‌ఫామ్ మీ డేటాని, ప్రైవసీని కాపాడుతుంది. గెలాక్సీ AI ఫీచర్లతో, AI సెలెక్ట్ అనే ఫీచర్ ద్వారా మీరు స్క్రీన్‌పై ఏదైనా ఇన్ఫర్మేషన్ ఈజీగా వెతకవచ్చు, కాపీ చేసుకోవచ్చు. ఫొటో రీమాస్టర్ ఫీచర్ ద్వారా AI టెక్నాలజీని ఉపయోగించి ఫొటోలను మరింత క్లారిటీగా మార్చుకోవచ్చు.

* మైక్రోసాఫ్ట్ కోపైలట్+ వస్తుంది..

ఈ ల్యాప్‌టాప్‌లలో మైక్రోసాఫ్ట్ కోపైలట్+ కూడా ఉంది. దీనికోసం ప్రత్యేకంగా కోపైలట్ కీ కూడా ఇచ్చారు. దీని ద్వారా రైటింగ్, రీసెర్చ్, షెడ్యూలింగ్, ప్రెజెంటేషన్స్ వంటి పనులను AI సహాయంతో చేసుకోవచ్చు. విండోస్ 11 ఆధారిత AI సిస్టమ్ స్మార్ట్ సజెషన్స్ కూడా ఇస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy Book5 series launches in India, featuring Intel Ultra CPUs and AI-powered Copilot+. Pro, Pro 360, and 360 models arrive March 2025 with stunning AMOLED displays and advanced features.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X