‘వాట్స్‌యాప్’ను బ్లాక్ చేసే యోచనలో సౌదీ అరేబియా ప్రభుత్వం!

Posted By:

ప్రముఖ ఇంటర్నెట్ ఆధారిత కమ్యూనికేషన్ టూల్ వాట్స్ యాప్ (WhatsApp)ను సౌదీ అరేబియా ప్రభుత్వం ఆ దేశంలో బ్లాక్ చేసే యోచనలో ఉంది. సౌదీ అరేబియా ప్రభుత్వ టెలికాం రెగ్యులేటరి సంస్థ ఆదేశాల మేరకు యాఎస్ ఆధారిత సంస్థ వాట్స్ యాప్ యాజమాన్యం నడుచుకోని పక్షంలో కొద్ది రోజుల్లోనే ఈ నిర్ణయం వెలువడే అవకాశముందని సౌదీ అరేబియా పత్రికలు వెల్లడించాయి. సైబర్ వ్యవస్థకు సంబంధించి నిఘాను మరింత పటిష్టం చేసే క్రమంలో ఆ దేశ కమ్యూనికేషన్స్ ఇంకా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమిషన్ (సీఐటీసీ) వైబర్ టూల్ ను రద్దు చేసింది. తరువాతి జాబితాలో వాట్స్‌యాప్ ఇంకా స్కైప్‌లు ఉన్నట్లు సీఐటీసీ గవర్నర్ అబ్ధుల్లా ఆల్-దరాబ్ ఆరబ్ న్యూస్ కు వెల్లడించారు. హోలీ నెల ప్రారంభానికి ముందే వాట్స్ యాప్ అప్లికేషన్ బ్లాక్ కు సంబంధించి ఓ నిర్ణయం వెలువడే అవకాశముంది. సౌదీఅరేబియా ప్రస్తుతానికి 15.8 మిలియన్ ఇంటర్సెట్ చందాదారులను కలిగి ఉంది. వీరిలో అత్యధిక మంది ఆన్‌లైన్ ద్వారా వీడియోలను వీక్షిస్తారని యూట్యూబ్ ఓ నివేదికలో వెల్లడించింది.

సౌదీ కన్నెర్ర!!

టెక్ ప్రపంచంలో అత్యంత ఖరీదైన కొనుగోళ్లు!

టెక్నాలజీ.. ప్రపంచాన్ని శాసిస్తున్న రోజులివి. విస్తరించిన సాంకేతిక కమ్యూనికేషన్ విభాగంలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చింది. స్కైప్, టంబ్టర్, యూట్యూబ్, ఇన్స్ స్టాగ్రామ్, పేపాల్ వంటి ఆన్‌లైన్ సర్వీసులు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది నెటిజనులకు చేరువకావటంతో మైక్రోసాఫ్ట్, ఇంటెల్, గూగుల్, యాహూ వంటి సంస్థలు వీటి కన్నేసి దక్కించుకున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా టెక్ ప్రపంచంలో చోటుచేసుకున్న అత్యం ఖరీతైన కొనుగోళ్ల గురించి తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot