సిమ్‌ట్రానిక్స్ ఎక్స్-ప్యాడ్ ఎక్స్1010.. సరికొత్త పోర్టబుల్ కంప్యూటింగ్ ట్యాబ్లెట్!

Posted By:

సిమ్‌ట్రానిక్స్ ఎక్స్-ప్యాడ్ ఎక్స్1010.. సరికొత్త పోర్టబుల్ కంప్యూటింగ
ట్యాబ్లెట్ మార్కెట్లోకి ఇటీవల అడుగుపెట్టిన ప్రముఖ టెక్నాలజీ కంపెనీ సిమ్‌ట్రానిక్స్ సరికొత్త ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌ను విపణిలో ఆవిష్కరించింది. పేరు ‘ఎక్స్-ప్యాడ్ ఎక్స్1010'. ధర రూ.8,499. స్పెసిఫికేషన్‌లు క్లుప్తంగా......

డిస్‌ప్లే: 10.1 అంగుళాల మల్టీ-టచ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, రిసల్యూషన్ 1024 x 600పిక్సల్స్,

ప్రాసెసర్: డ్యూయల్ కోర్ 1.2గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్, డ్యూయల్ కోర్ మాలీ 400గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,

ప్రపంచపు తొలి కృత్రిమ మనిషి ‘రెక్స్'

ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,

కెమెరా: 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), రేర్ కెమెరా వ్యవస్థ లోపించింది.

స్టోరేజ్: ఇంటర్నల్ స్టోరేజ్ 8జీబి/16జీబి, 1జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

కనెక్టువిటీ: వై-ఫై, 3జీ వయా డాంగిల్, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ,

బ్యాటరీ: 5,600ఎమ్ఏహెచ్ బ్యాటరీ (150 గంటల స్టాండ్‌బై టైమ్),

ధర ఇతర వివరాలు: ధర రూ.8,499. ప్రముఖ గాడ్జెట్ మార్కెట్లో ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ట్యాబ్లట్ లభ్యమవుతోంది. ప్రత్యేక స్టిక్ క్రికెట్ గేమ్‌ను ట్యాబ్‌లో లోడ్ చేసారు. ఈ ట్యాబ్ కొనుగోలు చేసిన యూజర్ దేశవ్యాప్తంగా 5000 లోకేషన్‌లలో వై-పై సేవలను ఉచితంగా ఆస్వాదించవచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot