నీటితో నడిచే కంప్యూటర్ వస్తోంది

Posted By:

కంప్యూటర్ పైన వాటర్ పడితే చాలు ఆ కంప్యూటర్ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది..అందుకని కంప్యూటర్ కి వాటర్ తగలకుండా చాలా జాగ్రత్తగా వాడుతుంటాం.అయితే ఇప్పుడు మార్కెట్ లోకి కొత్త కంప్యూటర్ రాబోతోంది. ప్రపంచంలోనే తొలిసారిగా నీటితో పనిచేసే కంప్యూటర్ వాడుకలోకి వచ్చేసింది. నీటితో పనిచేసే కంప్యూటరా అని షాక్ అవుతున్నారా..అవునండీ బాబూ..అది నీటితో పనిచేసే కంప్యూటరే..దానికి వాటర్ పోస్తే చాలు దానంతట అదే రన్ అవుతుంది. దీనిని స్టాన్ పోర్డ్ విశ్వ విద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ కనుగొన్నారు. నీటి చుక్కల భౌతికత అధారంగా ఈ కంప్యూటర్ నడుస్తోందని ఆయన చెబుతున్నారు.

Read more: ఫేస్‌బుక్‌లో ఉద్యోగాలివే బాసూ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మొట్టమొదటి నీటితో నడిచే కంప్యూటర్

ప్రపంచం లోనే మొట్టమొదటి నీటితో నడిచే కంప్యూటర్ ని తయారు చేసి శాస్త్ర సాంకేతిక రంగంలోనే సరికొత్త అధ్యయానికి తెరలేపాడు మను ప్రకాష్. తన విభాగం లో పని చేసే ఇద్దరు విద్యార్థుల సహాయంతో కలిసి ఈ కంప్యూటర్ ని కనుగొన్నారు.

కదిలే నీటి చుక్కలకు స్పందించే విధంగా ఈ కంప్యూటర్ అభివృద్ధి

కంప్యూటర్ కాంపోనెంట్లలో కీలకంగా ఉండే క్లాకును కదిలే నీటి చుక్కలకు స్పందించే విధంగా ఈ కంప్యూటర్ ని వీరు అభివృద్ధి చేసారు. వారి కృషికి తగ్గ ఫలితం రావడంతో ఆనదంలో మునిగిపోయారు ఈ యువ ఇంజనీర్లు.

నీటి చుక్కల భౌతికత ఆధారంగా స్పందించే కంప్యూటర్

తన క్యాంపస్ లోని ఇద్దరు విద్యార్థులతో కలిసి నీటి ఆధారిత కంప్యూటర్ను అభివృద్థి చేసారు. కదిలే నీటి చుక్కల భౌతికత ఆధారంగా స్పందించే కంప్యూటర్ ను ఈ బృందం అభివృద్థి చేయడం జరిగింది.

అసిస్టెంట్ ప్రొఫెసర్ గా మను ప్రకాష్ విధులు

న్యూయార్క్ లోని స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో బయోఇంజినీరింగ్ విభాగానికి అసిస్టెంట్ ప్రొఫెసర్ గా మను ప్రకాష్ విధులు నిర్వహిస్తున్నారు. ఈయన మీరట్ లో ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు.

పేపర్ మైక్రోస్కోపును (ఫోల్డ్ స్కోప్ ) అభివృద్థి

గత సంవత్సరం పేపర్ మైక్రోస్కోపును (ఫోల్డ్ స్కోప్ ) అభివృద్థి చేసి ప్రపంచాన్ని సైతం అబ్బురపరిచాడు ఈ ఇండో అమెరికన్ సైంటిస్ట్.

2002లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్

2002లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) కాన్పూర్ లో చదివారు. 2004లో ఎంఐటి లో ( మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ) అప్లైడ్ ఫిజిక్స్ చదివాడు. అక్కడే 2008లో పీహెడీ చేశాడు.

సూర్యకిరణాలను ఉపయోగించి కరెంట్ తో పనిలేకుండా సోలార్ సిస్టమ్

కరెంట్ తో తయారైయ్యే ఎన్నో పరికరాలను కనుగోన్నాడు.ఈ మధ్య కాలంలో ఏకంగా సూర్యకిరణాలను ఉపయోగించి కరెంట్ తో పనిలేకుండా సోలార్ సిస్టమ్ ద్వారా కరెంట్ ఉత్పత్తి అయ్యేలా చేశాడు.

లిక్విడ్ తో కూడిన మెమరీ ఇదే

లిక్విడ్ తో కూడిన మెమరీ ఇదే 

దీనికి సంబంధించిన వీడియో

దీనికి సంబంధించిన వీడియో 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
After more than a decade of research, scientists at Stanford University have created a working computer based on the physical movement of water droplets.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot