Home
Computer

MWC 2025 కేవలం 898 గ్రాముల బరువున్న ల్యాప్‌టాప్‌ విడుదల.. పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు!

వరల్డ్‌ మొబైల్ కాంగ్రెస్‌ 2025 లో అనేక సంస్థలు తమ ఆవిష్కరణలు, ఉత్పత్తులను లాంచ్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఎన్నో వినూత్నమైన ఉత్పత్తులను ఆవిష్కరించారు. స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌ట్యాప్‌లు సహా ఇతర ప్రొడక్ట్స్‌ ఇప్పటికే విడుదల అయ్యాయి. తాజాగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ ల తయారీ సంస్థ టెక్నో MWC 2025 (Mobile World Congress 2025) వేదికగా ల్యాప్‌టాప్‌ ను విడుదల చేసింది. ఈ ల్యాప్‌టాప్‌ స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌ను కలిగి ఉంది. దీంతోపాటు డిజైన్‌ పరంగానూ ఆకట్టుకుంది. టెక్నో మెగాబుక్‌ S14 పేరుతో లాంచ్ చేసింది.

ప్రపంచంలోనే తక్కువ బరువు కలిగిన ల్యాప్‌టాప్‌!
ప్రపంచంలోనే తక్కువ బరువు కలిగిన 14 అంగుళాల OLED డిస్‌ప్లే కలిగిన ల్యాప్‌ట్యాప్‌.. టెక్నో మెగాబుక్‌ S14 మాత్రమే అని టెక్నో సంస్థ చెబుతోంది. ఈ ల్యాప్‌టాప్‌ బరువు కేవలం 898 గ్రాములుగా ఉందని తెలిపింది. ఈ ల్యాప్‌టాప్‌ backlit కీ బోర్డు సపోర్టును కూడా కలిగి ఉంది.

Tecno launched megabook S14

టెక్నో మెగాబుక్‌ S14 ల్యాప్‌టాప్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఈ టెక్నో ల్యాప్‌టాప్ (Tecno Megabook S14) 14 అంగుళాల 2.8k OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 2800*1600 పిక్సల్స్‌, 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 440 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, 91 శాతం స్క్రీన్‌ టూ బాడీ రేషియో ను కలిగి ఉంది.

ఈ ల్యాప్‌టాప్‌ విండోస్‌ 11 OS తో పనిచేస్తుంది. మరియు 12 కోర్‌ స్నాప్‌డ్రాగన్ X Elite చిప్‌ లేదా inter Core అల్ట్రా 7 ప్రాసెసర్‌ తో పనిచేస్తుంది. 32GB LPDDR5 ర్యామ్ మరియు 2TB SSD స్టోరేజీతో జతచేసి ఉంటుంది. అయితే పూర్తి స్థాయి స్పెసిఫికేషన్ల వివరాలను టెక్నో ఇంకా వెల్లడించలేదు.

కెమెరా, బ్యాటరీ వివరాలు :
ఈ టెక్నో ల్యాప్‌టాప్‌ 2MP కెమెరాను కలిగి ఉంది. మరియు DTS X అల్ట్రాతో కూడిన రెండు 2W స్టీరియో స్పీకర్‌లను అమర్చారు. బ్యాటరీ మరియు ఛార్జింగ్‌ పరంగా మెగాబుక్‌ S14 ల్యాప్‌ 65W ఛార్జింగ్ సపోర్టుతో 50Wh బ్యాటరీని కలిగి ఉంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి గరిష్ఠంగా 16 గంటల వరకు వినియోగించుకోవచ్చని టెక్నో చెబుతోంది.

అనేక ఫీచర్‌లు :
ఈ టెక్నో ల్యాప్‌టాప్‌ Ella AI అసిస్టెంట్‌ ను కలిగి ఉంటుంది. దీంతోపాటు AI PPT జనరేటర్‌, AI మీటింగ్‌ అసిస్టెంట్‌, AI డ్రాయింగ్‌ సర్వీస్‌ వంటి ఫీచర్‌లను కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా బ్లూటూత్ 5.4, వైఫై 6E ఫీచర్‌లను కలిగి ఉంది. ఈ ల్యాప్‌టాప్‌ ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌, backlit కీ బోర్డును కలిగి ఉంది.

భారత్‌లో విడుదల కానుందా?
టెక్నో మెగాబుక్‌ S14 ల్యాప్‌టాప్‌ (Tecno latest Laptop) ధర, సేల్ వివరాలను ఇంకా వెల్లడించలేదు. దీంతోపాటు ఈ ల్యాప్‌టాప్‌ను భారత్‌ మార్కెట్‌లో విడుదల చేస్తుందా లేదా అనే వివరాలు వెల్లడి కాలేదు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Tecno launched megabook S14 with snapdragon X Elite chip and 898 grams weight in mwc 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X