పెంపుడు జంతువుల కోసమే ప్రత్యేకంగా వచ్చిన ఫోన్.. దీని పనితీరు చూస్తే దిమ్మతిరగాల్సిందే!
ప్రతిష్టాత్మక మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) 2025 లో సరికొత్త టెక్నాలజీలు సందడి చేస్తున్నాయి. వాటిల్లో పెంపుడు జంతువులను ప్రేమించేవాళ్ల కోసం గ్లోకల్‌మీ తీసుకొచ్చిన పెట్‌ఫోన్ (PetPhone ) అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సరికొత్త డివైజ్ ద్వారా పెంపుడు జంతువులు ఎక్కడ ఉన్నా, ఎప్పుడైనా వాటితో టచ్‌లో ఉండొచ్చు. ఇది టూ-వే కమ్యూనికేషన్ ఫీచర్‌తో వస్తోంది. అంతేకాదు, మీ పెంపుడు జంతువు ఏం చేస్తుందో కూడా ఇది గుర్తిస్తుంది.
రియల్ టైమ్ లొకేషన్ ట్రాకింగ్ కూడా ఉంది. జీపీఎస్, వై-ఫై, బ్లూటూత్ ట్రాకింగ్ వంటి ఫీచర్లతో మీ పెంపుడు జంతువు మీ కళ్ల ముందే ఉన్నట్లు మీరు ఫీల్ అవుతారు. గ్లోకల్‌మీ పెట్‌ఫోన్ ఒక స్మార్ట్ కాలర్ లాంటిది. మీ పెంపుడు జంతువులను మరింత బాగా అర్థం చేసుకోవడానికి ఇది మీకు హెల్ప్ చేస్తుంది.

* ఇది ఎలా పని చేస్తుంది
పెంపుడు జంతువుల మూడ్‌ను అంచనా వేయడానికి అవి చేసే రకరకాల శబ్దాలను (మొరగడం లాంటివి) ఇది గుర్తిస్తుంది. ఇక "పా టాక్" అనే ఫీచర్ ద్వారా పెంపుడు జంతువులతో నేరుగా మాట్లాడొచ్చు. సౌండ్ ప్లే ఆప్షన్స్‌తో వాటిని ఓదార్చవచ్చు. AI టెక్నాలజీతో పనిచేసే అలర్ట్‌ల ద్వారా పెంపుడు జంతువుల యాక్టివిటీస్‌ను కూడా ఇది ట్రాక్ చేస్తుంది.
దాంతో మీ పెంపుడు జంతువు ప్రవర్తన గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఇది పెంపుడు జంతువులకు ఫోన్ మాత్రమే కాదు ఒక స్మార్ట్ వాచ్ లాగా కూడా పనిచేస్తుంది. తద్వారా వాటి ఆరోగ్యానికి యజమానులకు తెలియజేయడమే కాకుండా చాలా ప్రయోజనాలు అందిస్తుంది.
* రియల్ టైమ్ ట్రాకింగ్, భద్రతా ఫీచర్లు
ఈ పెట్‌ఫోన్‌లో జీపీఎస్, ఏజీపీఎస్, ఎల్‌బీఎస్, వై-ఫై, బ్లూటూత్, యాక్టివ్ రాడార్ వంటి అడ్వాన్స్‌డ్ ట్రాకింగ్ ఫీచర్లు ఉన్నాయి. సిగ్నల్ వీక్‌గా ఉన్న ఏరియాల్లో కూడా ఇది కచ్చితమైన లొకేషన్ ట్రాకింగ్ అందిస్తుంది. "పా ట్రాక్" ఫంక్షన్ ద్వారా మీ పెంపుడు జంతువు ఎటువైపు వెళ్తుందో మీరు ట్రాక్ చేయొచ్చు.
జియోఫెన్స్ ఫీచర్ ద్వారా మీరు ఒక బౌండరీ సెట్ చేసుకోవచ్చు. మీ పెంపుడు జంతువు ఆ బౌండరీ దాటితే వెంటనే మీకు అలర్ట్ వస్తుంది. రాత్రిపూట కనిపించడం కోసం ఇందులో లైట్ కూడా ఉంది. మీ పెంపుడు జంతువు ఎక్కడో దాక్కుంటే రింగ్‌టోన్ మోగించి దాన్ని ఈజీగా కనిపెట్టవచ్చు.
* కనెక్టెడ్ పెట్ కమ్యూనిటీ
పెట్‌ఫోన్ యూజర్లు ఒక సోషల్ కమ్యూనిటీలో కూడా జాయిన్ అవ్వొచ్చు. అక్కడ వాళ్ల అనుభవాలను షేర్ చేసుకోవచ్చు, పెంపుడు జంతువులకు సంబంధించిన సర్వీసులు పొందొచ్చు. మీ పెంపుడు జంతువు హెల్త్ రికార్డులు, యాక్టివిటీ డేటా, సర్వీస్ ప్లాన్స్ లాంటి ముఖ్యమైన వివరాలతో పెట్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకోవచ్చు.
అంతేకాదు, మీ పెంపుడు జంతువులకు ఫుడ్ పెట్టడం, వెటర్నరీ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లడం వంటి పనుల కోసం రిమైండర్లు కూడా సెట్ చేసుకోవచ్చు. మీ పెంపుడు జంతువులు రిలాక్స్‌గా ఉండటానికి మంచి మ్యూజిక్ కూడా ప్లే చేయొచ్చు. పాటలకు కొన్ని కుక్కలు రెస్పాండ్ అవుతాయి, కొన్ని అవ్వవు. ప్రతిస్పందించే వాటికి మాత్రం ఇది ఒక వరం.
* ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తుంది..
ఈ పెట్‌ఫోన్ ప్రపంచంలో ఎక్కడైనా పనిచేసేలా డిజైన్ చేశారు. 200 కంటే ఎక్కువ దేశాల్లో క్లౌడ్ సిమ్ టెక్నాలజీతో ఇది పనిచేస్తుంది. లోకల్ సిమ్ కార్డులు పెట్టాల్సిన అవసరం లేదు. ఇది IP68 రేటింగ్ కలిగి ఉంది. అంటే దుమ్ము, నీరు దీనిలోకి వెళ్లలేవు. ఎలాంటి వాతావరణంలో అయినా ఇది చాలాకాలం పనిచేస్తుంది.
* MWC 2025లో ఇతర కొత్త టెక్నాలజీలు
గ్లోకల్‌మీ పెట్‌ఫోన్‌తో పాటు MWC 2025లో చాలా పెద్ద టెక్నాలజీ అప్‌డేట్స్ ఉన్నాయి. ఒప్పో యాప్స్‌ని గూగుల్ జెమిని AI ప్లాట్‌ఫామ్‌తో కలిపేసింది టెక్నో 2-మెగాపిక్సెల్ స్పెక్ట్రావిజన్ కెమెరా సెన్సార్‌ను తీసుకొచ్చింది. టెలికాం రంగంలో జియో, AMD, సిస్కో, నోకియా కలిసి ఓపెన్ టెలికాం AI ప్లాట్‌ఫామ్‌ను రిలీజ్ చేశారు.


Click it and Unblock the Notifications








