గూగుల్ సెర్చ్: మన తెలుగుకు మూడో ర్యాంక్!

Posted By:

 గూగుల్ సెర్చ్: మన తెలుగుకు మూడో ర్యాంక్!

తెలుగు భాషను విశ్వవ్యాప్తం చేయటంలో తెలుగు సినిమాలు విస్తృతంగా దోహదపడుతున్నాయని గూగుల్ ట్రెండ్స్ విశ్లేషిస్తున్నాయి. భారతదేశపు ప్రధాన ప్రాంతీయ భాషల ప్రపంచవ్యాప్త శోధనలకు సంబంధించి 2004 నుంచి గూగుల్ పోకడలను పరిశీలించినట్లయితే తెలుగు మూడవ స్థానంలో ఉంది. మొదటి రెండు స్థానాల్లో హిందీ ఇంకా తమిళ భాషలు ఉన్నాయి. అమెరికాలో ఉన్న భారతీయులు అత్యధికంగా తెలుగు, తమిళ భాషలను శోధిస్తున్నట్లు విశ్లేషణల త్వారా తేటతెల్లమవుతోంది.

2004 నుంచి 2013 వరకు అంటే ఈ తొమ్మిదేళ్ల వ్యవధిలో ఈ మూడు ప్రాంతీయ భాషలకు సంబంధించిన శోధనా విభాగాలలో పెరుగుదల అమితంగా ఉన్నట్లు తెలుస్తోంది. సెర్చ్ ఇంజన్ గూగుల్ లో తెలుగు భాషకు సంబంధించిన శోధనలు అత్యధికంగా తెలుగు సినిమాల సంబంధించిన అంశాలేనని ప్రముఖ సీఈఓ నిపుణుడు ఎస్ వెంకటరమణ తెలిపారు. తెలుగు సినిమాలు ఆన్ లైన్ లో సులువుగా లభ్యమవటం, డౌన్ లోడింగ్ సలువుగా ఉండటం, తెలుగు సినిమాలకు తమిళం ఇంరా కన్నడ నాట ఆదరణ ఉండటం వంటి అంశాలు ఆన్‌లైన్‌లో తెలుగు భాష వ్యాప్తికి దోహదపడుతున్నాయని ప్రముఖ చిత్ర నిర్మాత ధర్మతేజ అభిప్రాయపడ్డారు.

తెలుగు సినిమాలు ఆన్‌లైన్‌లో

నేటి ఆధునిక వెబ్ ప్రపంచంలో నేటిజనులు తమ ఎంటర్‌టైన్‌మెంట్ అవసరాలను ఆన్ లైన్ ద్వారా తీర్చుకుంటున్నారు. గేమ్స్.. సినిమాలు.. ఛాటింగ్... షాపింగ్ ఇలా అనేక అవసరాలను ఆన్‌లైన్ ద్వారాతీరిపోతున్నాయి. టెలివిజన్ లో ప్రసారమయ్యే సినిమాలు వాణిజ్య ప్రకటనలతో విసుగు పుట్టిస్తున్న నేపధ్యంలో పలువురు తమకు నచ్చిన సినిమాలను ఆన్ లైన్ లో వీక్షించేందుకు ఇష్టపడుతున్నారు. నేటిప్రత్యేక శీర్సికలో భాగంగా నెటిజనులకు తెలుగు సినిమాలను పరిచయం చేస్తున్న ప్రముఖ వెబ్‌సైట్‌ల వివరాలను మీకందిస్తున్నాం.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting