ల్యాప్‌టాప్‌లు (అందం తక్కువ)

Posted By:

ఈ క్రింది స్లైడ్ షోలో మీరు చూడబోయే ల్యాప్‌టాప్‌లు తక్కువ స్థాయి ఆకర్షణీయతను కలిగి ల్యాప్‌టాప్ ప్రియులను నిరుత్సాహానికి గురి చేస్తాయి. డిజైనింగ్..క్వాలిటీ.. సైజ్ తదితర అంశాలకు సంబంధించిన లోపలు ఈ పోర్టబుల్ కంప్యూటింగ్ డివైజుల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. మీరే చూడండి....

మొబైల్ ఫోన్‌లు (రూ.999 ధరల్లో)

పాత రోజుల్లో డెస్క్‌టాప్ కంప్యూటర్‌లతో మాత్రమే కంప్యూటింగ్ సాధ్యపడేది. కాలానుగుణంగా కంప్యూటింగ్ టెక్నాలజీలో చోటుచేసుకున్న విప్లవాత్మక మార్పులు పోర్టబుల్ కంప్యూటింగ్‌ను ల్యాప్‌టాప్‌ల రూపంలో అందుబాటులోకి తీసుకువచ్చాయి. తాజా పరిస్థితులను పరిశీలిస్తే పోర్టబుల్ కంప్యూటింగ్ కాస్తా పాకెట్ కంప్యూటింగ్‌లా మారిపోయింది. అరచేతిలో ఇమిడిపోయే టాబ్లెట్ పీసీలు అందుబాటులోకి వచ్చేసాయి. వీటిని మొబైలింగ్ అలానే కంప్యూటింగ్ అవసరాలకు నేటి యువత ఉపయోగించుకుంటున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

తొషిబా కోస్మియో - క్యూ706 (Toshiba Qosmio X305-Q706):

పింక్ ఇంకా రెడ్ కలర్ కాంభినేషన్‌లో డిజైన్ కాబడిన ఈ ల్యాపీని తోషిబా వర్గాలు 2009లో ఆవిష్కరించాయి. అతిగా కనిపిస్తున్న ఈ ల్యాప్‌టాప్ డిజైనింగ్ అందవిహీనంగా ఉండటంతో మార్కెట్లో క్లిక్ కాలేకపోయింది.

ఒస్బోర్న్ 1 (Osborne 1):

ఆధునిక వర్షన్ ల్యాప్‌టాప్‌లకు ప్రేరణగా నిలిచిన
ఒస్బోర్న్1ను 1981లో విడుదల చేశారు. సూట్ కేస్ సైజ్‌లో ఉండే ఈ పోర్టబుల్ కంప్యూటర్ బరువు 24 పౌండ్లు. 5 అంగుళాల మోనోక్రోమ్ డిస్‌ప్లే ఇంకా డ్యూయల్ ఫ్లాపీ డ్రైవ్‌లను ఉపయోగించేవారు.

యాపిల్ ఐబుక్ (Apple iBook):

స్టీవ్ జాబ్స్ సారధ్యంలోని యాపిల్ సంస్థ 1999లో ఐబుక్‌ను విడుదల చేసింది. బ్లూబెర్రీ ఇంకా టాన్జేరిన్ కలర్ వేరియంట్‌లలో ఈ డివైజ్ లభ్యమయ్యేది. అయితే మార్కట్లో అంతగా విజయవంతం కాలేదు.

వన్ ల్యాప్‌టాప్ పర్ చైల్డ్ ఎక్సో (One Laptop Per Child XO):

పేద పిల్లలకు ఉచిత ల్యాప్‌టాప్‌లు మంజూరు చేస్తామంటూ పలువురు నాయకులు చేసిన వాగ్దానాలు మీరు వినే ఉంటారు. ఆ తరహా అవసరాల కోసమే వన్ ల్యాప్‌టాప్ పర్ చైల్డ్ ఎక్సోను డిజైన్ చేశారు. వీటి క్వాలిటీ నామమాత్రంగా ఉంటుంది.

ఇగో ఫర్ బెంట్లీ (Ego for Bentley):

బెంట్లీ మోటర్స్ ఈ ఖరీదైన ల్యాప్‌టాప్‌ను వృద్ధి చేసింది. 2008లో విడుదలైన ఈ ల్యాపీ ధర $19,800. డిజైనింగ్‌లో భాగంగా
డైమండ్ ఇంకా లెదర్ కవర్‌ను డివైజ్‌కు అనుసంధానించారు. ఇగో ల్యాప్‌టాప్ ప్రత్యేక హంగులను కలిగి నప్పటికి మార్కెట్లో హిట్ కాలేదు.

డ్యూయల్ స్ర్కీన్ ల్యాప్‌టాప్‌లు (Dual-Screen Laptops):

డ్యూయల్ స్ర్కీన్ ల్యాప్‌టాప్‌ల గురించి మీరు వినే ఉంటారు. బిజినెస్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని లెనోవో వృద్ధిచేసిన డ్యూయల్ స్ర్కీన్ ల్యాప్‌టాప్ ధింక్‌ప్యాడ్ డబ్ల్యూ700డీఎస్ ఆశించిన స్థాయిలో అమ్మకాలను అందుకోలేక పోయింది.

హెచ్‌పి పెవిలియన్ డీవీ6 ‘ఆర్టిస్ట్ ఎడిషన్’ (HP Pavilion dv6 'Artist Edition'):

ప్రముఖ కంప్యూటర్ల తయరీ సంస్థ హెచ్‌పీ 2009లో హెచ్‌పి పెవిలియన్ డీవీ6 ‘ఆర్టిస్ట్ ఎడిషన్'ల్యాప్‌టాప్‌ను మార్కెట్లో విడుదల చేసింది. హెచ్‌పి, ఎంటీవీ ఇంకా ఏఎమ్‌డి సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన నోట్‌‍బుక్ డిజైన్ కాంటెస్ట్‌ లో ఈ ల్యాపీ బెస్ట్ డిజైనింగ్ అవార్డును సొంతం చేసుకుంది. ఈ డిజైనింగ్ పై పలు విమర్శలూ లేకపోలేదు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot