ల్యాపీ కొంటున్నారా..? అయితే మీ కోసమే ఈ చిట్కాలు

Written By:

ఈ రోజుల్లో ల్యాపీ లేని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. డెస్క్ టాప్ తో పోలిస్తే ల్యాపీ అవసరం చాలామందికి ఉంటుంది. అయితే దీనిని కొనేముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ.ఎటువంటి ఫీచర్లు ఉన్న ల్యాపీ బావుంటుంది. ఇలాంటి అంశాలపై చాలామంది అసలు ఫోకస్ చేయరు. ల్యాపీ కొనేముందు ఇవి చాలా అవసరమవుతాయి. వాటి సంగతి చూద్దాం.

జియోకి పంచ్, కొత్త టెక్నాలజీతో వస్తున్న టాప్ 3 టెల్కోలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

టచ్ స్క్రీన్

ఇప్పుడు అంతా టచ్ స్క్రీన్ మయం అయిపోయింది. విండోస్ 10 ఆపరేటింగ్ సాఫ్ట్ వేర్ టచ్ స్క్రీన్ కు అనుకూలంగా ఉంటుంది. టచ్ స్క్రీన్ ఉంటే వేగంగా ఆపరేట్ చేయడానికి వీలుంటుంది.

స్క్రీన్

మార్కెట్లో ఉన్న ల్యాప్‌టాప్ లలో అధిక శాతం 15.6 అంగుళాల స్క్రీన్ సైజు గలవే. ఇంతకుమించి ఎక్కువ సైజున్న వాటి కారణంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. స్క్రీన్ పెరిగిందంటే బరువు కూడా పెరిగిపోతుంది.

స్టోరేజీ/హార్డ్ డిస్క్

బేసిక్ ల్యాప్‌టాప్ లలోనూ 500 జీబీ స్టోరేజీ ఉంటోంది. కనీస అవసరాలకు ఈ స్టోరేజీ సరిపోతుంది. డాక్యుమెంట్లు, పాటలు, సినిమాలు స్టోరేజీ చేసుకోవచ్చు. కానీ, ఎక్కువ డేటా స్టోరేజీ కోసం అయితే 1టీబీ హార్డ్ డిస్క్ ఉండాల్సిందే.

గ్రాఫిక్ చిప్

గ్రాఫిక్ కార్డు చిత్రాలతో కూడిన డేటాను వేగంగా మూవ్ చేస్తుంది. గేమ్స్ అడే పని లేకుంటే, హై డెఫినిషన్ వీడియోలు ఎడిటింగ్ చేసే అవసరం లేని వారికి ఇంటెగ్రేటెడ్ గ్రాఫిక్స్ చిప్ సరిపోతుంది.

ర్యామ్

ల్యాప్ టాప్ పనితీరును నిర్ణయించే వాటిలో ర్యామ్ సామర్థ్యం కూడా ఒకటి. మంచి అనుభవం పొందాలంటే కనీసం 4జీబీ ర్యామ్ ఉండాలి. 8జీబీ ఉంటే ఇంకా మంచిది.

సీపీయూ/ప్రాసెసర్

కంప్యూటర్ పనితీరు ప్రాసెసర్ పై ఆధారపడి ఉంటుంది. కనుక తమ అవసరాలు తీర్చే సామర్థ్యం గల ప్రాసెసర్ ఉన్నది తీసుకోవడం బెటర్. 2.3 గిగాహెర్జ్ అంతకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్నవి తీసుకోవాలి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
The way you buy a laptop is wrong. Here is right way read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting