జియోకి పంచ్, కొత్త టెక్నాలజీతో వస్తున్న టాప్ 3 టెల్కోలు

జియో ఉచిత ఆఫర్లతో భారీ నష్టాలను మూటగట్టుకున్న దిగ్గజ టెల్కోలు జియోను తొక్కేందుకు భారీ కసరత్తులే చేస్తున్నాయి.

By Hazarath
|

జియో ఉచిత ఆఫర్లతో భారీ నష్టాలను మూటగట్టుకున్న దిగ్గజ టెల్కోలు జియోను తొక్కేందుకు భారీ కసరత్తులే చేస్తున్నాయి. ఎలాగైనా జియోని దెబ్బ కొట్టడమే లక్ష్యంగా ఈ కంపెనీలు సరికొత్త టెక్నాలజీ వైపు అడుగులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టెలికం రంగంలో టాప్ 3 దిగ్గజాలైన భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియాలు త్వరలో వీవోఎల్‌టీఈ సర్వీసులు ప్రారంభించాలని నిర్ణయించాయి.

 

గూగుల్ నుంచి మరో సంచలనం, ఇండియాకి వస్తోంది

వీవోఎల్‌టీఈ సర్వీసులను

వీవోఎల్‌టీఈ సర్వీసులను

ఈ సర్వీసుల ద్వారా మాత్రమే జియోకు అడ్డుకట్ట వేయవచ్చని భావించిన ఈ మూడు కంపెనీలు ఈ ఏడాది సెప్టెంబరు నాటికి వీవోఎల్‌టీఈ సర్వీసులను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నాయి.

జియో కంటే మెరుగైన సేవలు

జియో కంటే మెరుగైన సేవలు

తమ వినియోగదారులు జియోకు మళ్లకుండా ఉండాలంటే ఇదొక్కటే మార్గమని భావిస్తున్న సంస్థలు ప్రస్తుత సాంకేతికతను అప్‌గ్రేడ్ చేసి జియో కంటే మెరుగైన సేవలు అందించాలని భావిస్తున్నాయి.

వాయిస్ కాల్స్ ఉచితం

వాయిస్ కాల్స్ ఉచితం

వీవోఎల్‌టీఈ ద్వారా డేటా ఫార్మాట్‌లో వాయిస్ కాల్స్ ఉచితంగా అందుతాయని, అందుకే దానికి అంత ప్రాధాన్యం ఏర్పడిందని టెలికం రంగ నిపుణులు చెబుతున్నారు.

అతి చవకగా కాల్స్
 

అతి చవకగా కాల్స్

సంప్రదాయ వాయిస్ కాల్స్‌తో పోల్చుకుంటే వీవోఎల్‌టీఈ ద్వారా అతి చవకగా కాల్స్ చేసుకోవచ్చని చెబుతున్నారు. అందుకే దీనివైపు అడుగులు వేస్తున్నామని చెబుతున్నారు.

సర్వీసులను ప్రారంభించేందుకు

సర్వీసులను ప్రారంభించేందుకు

వీవోఎల్‌టీఈని సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లో తక్కువ ధరకు అందుబాటులోకి రాగానే తమ సర్వీసులను ప్రారంభించేందుకు ఈ మూడు టెల్కోలు సిద్ధంగా ఉన్నట్టు చెబుతున్నారు.

ఎయిర్‌టెల్

ఎయిర్‌టెల్

ప్రస్తుతం ఎయిర్‌టెల్ ముంబై, ఢిల్లీలలో వీవోఎల్‌టీఈ సర్వీసులకు కమర్షియల్ ట్రయల్స్ నిర్వహిస్తోంది. త్వరలోనే దేశమంతా విస్తరించేందుకు సిద్ధమవుతోంది.

వొడాఫోన్

వొడాఫోన్

వొడాఫోన్ ఇప్పటికే బేసిక్ ట్రయల్స్ పూర్తి చేసి లాంచింగ్‌కు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.

ఐడియా సెల్యూలార్

ఐడియా సెల్యూలార్

ఇక వచ్చే రెండో త్రైమాసికంలో వీవోఎల్‌టీఈ సర్వీసులను ప్రారంభించనున్నట్టు ఐడియా సెల్యూలార్ మేనేజింగ్ డైరెక్టర్ హిమాన్షు కపానియా తెలిపారు. మొత్తానికి టెలికం రంగంలో మరో పోటీకి తెరలేవబోతోంది.

Best Mobiles in India

English summary
Airtel, Vodafone, Idea may launch VoLTE by September to counter Reliance Jio read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X