50MP + 64MP + 48MP కెమెరాలు, 100W ఛార్జింగ్, 6.82 అంగుళాల 120Hz డిస్‌ప్లే ఫోన్ కేవలం రూ.52,999కే..!
OnePlus 12 Deal: ప్రీమియం ఫీచర్లు ఉన్న ఫోన్ కావాలి.. కానీ ఎక్కువ డబ్బులు పెట్టలేను అనుకుంటున్నారా, అయితే మీకో గుడ్ న్యూస్. నిజమైన ఫ్లాగ్‌షిప్ ఫోన్ అయిన వన్‌ప్లస్ 12 ఇప్పుడు అమెజాన్‌లో భారీ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ.64,999 కాగా, ఇప్పుడు మాత్రం కేవలం రూ.56,999కే అమ్ముతున్నారు. HDFC లేదా SBI క్రెడిట్ కార్డుతో EMI ద్వారా కొంటే రూ.4,000 ఎక్స్‌ట్రా డిస్కౌంట్ లభిస్తుంది.
అంటే ఈ ఫోన్‌ను కేవలం రూ.52,999కే సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు, పాత ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేస్తే.. ధర మరింత తగ్గుతుంది. వన్‌ప్లస్ 12 మొబైల్ గతేడాది జనవరి 23న రిలీజ్ అయింది. ఇది విడుదలై సంవత్సరం కావొస్తున్నా సరే, ఈ ఫోన్ మాత్రం మెరుగైన పెర్ఫార్మెన్స్‌తో ఆకర్షిస్తోంది. ఇప్పుడీ ఫోన్‌ని కొన్నా నిరాశ కలగదు.

* వన్‌ప్లస్ 12ని ఎందుకు కొనాలి
వన్‌ప్లస్ 12 ఫోన్ పర్ఫార్మెన్స్ విషయంలో మాత్రం బెస్ట్ అని చెప్పవచ్చు. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌తో వస్తుందిది. గేమింగ్, మల్టీ టాస్కింగ్, ఇంకా చాలా కాలం ఫోన్ వాడాలి అనుకునేవాళ్లకి ఇది మంచి ఛాయిస్. ఎందుకంటే ఇందులో ఏకంగా 16GB RAM, 512GB స్టోరేజ్ ఉన్నాయి.
డిస్‌ప్లే విషయానికొస్తే.. 6.82-అంగుళాల LTPO AMOLED డిస్‌ప్లే ఇచ్చారు. ఇది 1440 x 3168 రిజల్యూషన్‌తో పాటు HDR10+, డాల్బీ విజన్ సపోర్ట్‌తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల స్క్రీన్ చాలా స్మూత్‌గా ఉంటుంది. ముఖ్యంగా 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉండటంతో ఎండలో కూడా స్క్రీన్ క్లియర్‌గా కనిపిస్తుంది.
*:కెమెరా, బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే?
వన్‌ప్లస్ 12లో మూడు అదిరిపోయే కెమెరాలు ఉన్నాయి. 50MP మెయిన్ కెమెరా, 64MP పెరిస్కోప్ టెలిఫొటో లెన్స్ (జూమ్ చేసినా కూడా ఫొటోలు క్లారిటీగా వస్తాయి), ఇంకా 48MP అల్ట్రావైడ్ లెన్స్ ఇచ్చారు. ల్యాండ్‌స్కేప్ ఫొటోలు కానీ, క్లోజప్ షాట్స్ కానీ.. ఏ ఫోటోలు తీసినా అవి మాత్రం బాగా వస్తాయి.
బ్యాటరీ విషయానికొస్తే.. ఇందులో 5,400mAh బ్యాటరీ ఉంది. ఇది 100W వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. అంటే చాలా తక్కువ టైమ్‌లో ఫుల్ ఛార్జింగ్ అయిపోతుంది. అంతేకాదు 50W వైర్‌లెస్ ఛార్జింగ్, 10W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ కూడా ఉన్నాయి. ఛార్జింగ్ గురించి అస్సలు టెన్షన్ పడాల్సిన పనే లేదు.
* ఇప్పుడే కొనడం కరెక్టా?
ఇంత పెద్ద ప్రైస్ డ్రాప్, బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు అన్నీ కలిపి చూస్తే.. ఫ్లాగ్‌షిప్ ఫోన్ కొనాలనుకునే వాళ్లకి ఇది బెస్ట్ డీల్ అని చెప్పొచ్చు. వన్‌ప్లస్ 12.. హై-ఎండ్ పర్ఫార్మెన్స్, ఫాస్ట్ ఛార్జింగ్, సూపర్ కెమెరా సిస్టమ్, ప్రీమియం డిజైన్‌తో వస్తుంది. పైగా మిగతా ఫ్లాగ్‌షిప్ ఫోన్లతో పోలిస్తే ధర కూడా తక్కువే. అయితే వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ మాత్రం కొన్ని పోటీ ఫోన్ల కంటే కొంచెం తక్కువగా ఉంది. అది పెద్ద విషయం కాదనుకుంటే మాత్రం.. ఈ డీల్ కచ్చితంగా సద్వినియోగం చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications








