OnePlus Sale వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్, బడ్స్ కొనుగోలు చేయాలా.. ఏకంగా రూ.5000 డిస్కౌంట్..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లు గ్యా్డ్జెట్‌ల తయారీ సంస్థ వన్‌ప్లస్ తాజాగా కొత్త సేల్ ప్రారంభించింది. వన్‌ప్లస్ రెడ్ రష్ డేస్ సేల్ 2025 (OnePlus Red Rush Days Sale 2025) పేరుతో ఇవాళ్టి నుంచి ప్రారంభం అయింది. ఈ నెల 9 వ తేదీ వరకు సేల్ కొనసాగుతుంది. వన్‌ప్లస్ వెబ్‌సైట్ ద్వారా ఈ సేల్ డిస్కౌంట్‌లను పొందవచ్చు. ఈ సేల్‌లో భాగంగా అనేక స్మార్ట్‌ఫోన్‌లు, బడ్స్‌పై భారీ డిస్కౌంట్‌లను పొందవచ్చు.
వన్‌ప్లస్ సేల్‌లో భాగంగా వన్‌ప్లస్ 13, వన్‌ప్లస్ 13R, వన్‌ప్లస్ 12, వన్‌ప్లస్ 12R సహా మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లు వన్‌ప్లస్ నార్డ్ 4, వన్‌ప్లస్ నార్డ్ CE 4, వన్‌ప్లస్ నార్డ్ CE 4 లైట్ సహా మరెన్నో స్మార్ట్‌ఫోన్‌లు ఇయర్‌బడ్స్‌పై డిస్కౌంట్లను పొందవచ్చు. ఈ సేల్ ఆఫర్లు 9 వ తేదీ వరకు మాత్రమే ఉంటాయి.

వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ (OnePlus 13) 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 16GB ర్యామ్ + 512GB స్టోరేజీ, 24GB ర్యామ్ + 1TB స్టోరేజీ వేరియంట్స్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ 12GB ర్యామ్ వేరియంట్ ధర రూ.69999 గా ఉంది. మరో వేరియంట్ ధర రూ.76999 గా ఉంది. 24GB వేరియంట్ ప్రస్తుతం అందుబాటులో లేదు.
వన్‌ప్లస్ సేల్‌లో ప్రస్తుతం HDFC, SBI క్రెడిట్ కార్డులపై గరిష్ఠంగా రూ.5000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. వన్‌ప్లస్ 13R స్మార్ట్‌ఫోన్ (OnePlus 13R) 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.42999, 16GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.47999 గా ఉంది. HDFC, SBI క్రెడిట్ కార్డులపై రూ.3000 డిస్కౌంట్‌ను పొందవచ్చు.

వన్‌ప్లస్ 12R ఫోన్ (OnePlus 12R) 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.29999 గా ఉంది. 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.32999, 16GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.35999 గా ఉంది. బ్యాంకు కార్డులపై రూ.3000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. వన్‌ప్లస్ 12 స్మార్ట్‌ఫోన్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ రూ.56999 గా ఉంది. HDFC బ్యాంకు క్రెడిట్ కార్డు, SBI కార్డు ద్వారా రూ.4000 డిస్కౌంట్‌ను పొందవచ్చు.
వన్‌ప్లస్ నార్డ్ CE 4 స్మార్ట్‌ఫోన్ (OnePlus Nord CE 4) 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.21999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.23999 గా ఉంది. ICICI, SBI కార్డు, HDFC బ్యాంకు క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేసి రూ.2000 డిస్కౌంట్‌ను పొందవచ్చు.
వన్‌ప్లస్ నార్డ్ 4 స్మార్ట్‌ఫోన్ (OnePlus Nord 4) 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.28,999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.31,999 గా ఉంది. HDFC, SBI, ICICI బ్యాంకు క్రెడిట్ కార్డులపై గరిష్ఠంగా రూ.4000 డిస్కౌంట్‌ను అందిస్తోంది.
వన్‌ప్లస్ నార్డ్ CE 4 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ (OnePlus Nord CE 4 Lite 5G) 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.17999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీని రూ.20999 గా ఉంది. ఐసీఐసీఈ, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ బ్యాంకుల క్రెడిట్ కార్డులపై గరిష్టంగా రూ.1000 డిస్కౌంట్‌ను పొందవచ్చు.
వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 3 (OnePlus Nord Buds 3) ధర రూ.1999 గా ఉంది. RBL బ్యాంకు క్రెడిట్ కార్డుపై రూ.200 డిస్కౌంట్‌ను పొందవచ్చు. వన్‌ప్లస్ బడ్స్ ప్రో 3 ధర రూ.10999 గా ఉంది. RBL బ్యాంకు కార్డుపై రూ.1000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 2r ధర రూ.1599 గా ఉంది. RBL బ్యాంకు కార్డుపై రూ.150 డిస్కౌంట్‌ను పొందవచ్చు.


Click it and Unblock the Notifications








