Home
Deal of the day

మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్, టెలిఫోటో కెమెరా, క్వాడ్‌ కర్వడ్‌ డిస్‌ప్లే 5G ఫోన్‌పై డిస్కౌంట్‌!

Motorola Edge 60 5G Smartphone : మోటోరోలా సంస్థ ఈ సంవత్సరం ఎడ్జ్ 60 సిరీస్‌ను లాంచ్‌ చేసింది. ఇందులో భాగంగా మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్‌, ఎడ్జ్‌ 60 స్టైలస్, ఎడ్జ్‌ 60 ప్రో, ఎడ్జ్‌ 60 మోడల్స్‌ అందుబాటులోకి వచ్చాయి. రూ.25 వేల ధరలో స్మార్ట్‌ఫోన్‌ కోసం చూస్తుంటే ఈ హ్యాండ్‌సెట్‌ను పరిశీలన చేయవచ్చు. మిలిటరీ గ్రేడ్‌ MIL STD 810H సర్టిఫికేషన్‌, 10MP టెలిఫోటో లెన్స్‌, 5500mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్ల పూర్తి వివరాలు.

ఫ్లిప్‌కార్ట్‌ దీపావళి సేల్‌ :
మోటోరోలా ఎడ్జ్‌ 60 స్మార్ట్‌ఫోన్ ఈ సంవత్సరం జూన్‌ నెలలో విడుదల అయింది. లాంచ్ సమయంలో ఈ ఫోన్‌ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.25,999 గా ఉండేది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్‌ దీపావళి 2025 సేల్‌లో భాగంగా రూ.24,999 ధరకు కొనుగోలు చేయవచ్చు.

motorola edge 60 5G smartphone features

కలర్‌ వేరియంట్స్‌ :
దీంతోపాటు SBI బ్యాంకు కార్డులపై 10 శాతం అదనపు డిస్కౌంట్‌ను పొందవచ్చు. సుమారు రూ.2 వేలకు పైగా డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ పాంటోన్‌ జిబ్రాల్టర్‌ సీ, పాంటోన్‌ షామ్‌రాక్‌ కలర్‌ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.

క్వాడ్‌ కర్వడ్‌ డిస్‌ప్లే :
మోటోరోలా ఎడ్జ్‌ 60 స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల 1.5K pOLED క్వాడ్‌ కర్వడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 4500 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, 300Hz టచ్ శాంప్లింగ్‌ రేట్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే వాటర్‌ టచ్‌ 3.0 ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. అంటే తడి చేతులతోనూ ఈ ఫోన్‌ను ఉపయోగించుకోవచ్చు.

IP68, IP69 రేటింగ్‌ :
ఈ డిస్‌ప్లే కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 7i ప్రొటెక్షన్‌ ను కలిగి ఉంది. మరియు మోషన్‌ బ్లర్‌ రిడక్షన్, SGS Low లైట్‌ సపోర్టును కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ మిలిటరీ గ్రేడ్‌ MIL STD 810H సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. మరియు IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది.

motorola edge 60 5G smartphone features

ఈ హ్యాండ్‌సెట్ ఆక్టా కోర్‌ 4nm మీడియాటెక్‌ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్‌ 12GB LPDDR4X ర్యామ్, 256GB UFS 2.2 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Hello UI పైన పనిచేస్తోంది.

టెలిఫోటో లెన్స్‌ :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరా యూనిట్‌తో అందుబాటులోకి వచ్చింది. ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ (OIS) సపోర్టుతో 50MP సోనీ LYT 700C ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ లెన్స్‌, 3x ఆప్టికల్‌ జూమ్‌తో 10MP టెలిఫోటో కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 50MP కెమెరాను కలిగి ఉంది.

టర్బో పవర్‌ ఛార్జింగ్ సపోర్టు :
ఈ ఫోన్‌ 68W టర్బోపవర్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీని కలిగి ఉంది. మోటో AI 2.0 సూట్‌ లో భాగంగా అనేక ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్‌లను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 3 ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.

ఈ హ్యాండ్‌సెట్‌ సెక్యూరిటీ కోసం ఇన్‌-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్‌ సెన్సర్‌ను అమర్చారు. మెరుగైన ఆడియో కోసం డ్యూయల్‌ స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది. 5G, 4G, బ్లూటూత్‌ 5.4, Wi-Fi, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Flipkart Big Bang Diwali 2025 sale Offers discount on motorola edge 60 5G smartphone
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X