50MP సోనీ కెమెరా, మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, మెరుగైన వాటర్ రెసిస్టెంట్ ఫోన్‌పై రూ.2000 డిస్కౌంట్!
iQOO Z10R 5G Smartphone : ఐకూ సంస్థ భారత్ మార్కెట్‌లో ఈ సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. ఇటీవలే ఐకూ 15 హ్యాండ్‌సెట్ అందుబాటులోకి వచ్చింది. ఈ సంవత్సరం జులైలో ఐకూ Z10R స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది. ఈ ఫోన్ డిజైన్ పరంగానూ ఆకట్టుకుంటుంది. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. మరియు క్వాడ్ కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లే, 50MP కెమెరా, మెరుగైన వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. ఈ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లలు, సేల్ పూర్తి వివరాలు.
ధరల వివరాలు :
ఐకూ Z10R స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.20,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.22,999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.24,999 గా ఉంది.

ఈ బ్యాంకు కార్డులపై రూ.2000 డిస్కౌంట్ :
అమెజాన్‌లో SBI, ICICI బ్యాంకు కార్డులపై గరిష్ఠంగా రూ.2000 డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ మూన్ స్టోన్, ఆక్వా మెరీన్ కలర్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ IP68, IP69 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.
క్వాడ్ కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లే, మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ :
ఐకూ Z10R స్మార్ట్‌ఫోన్ 6.77 అంగుళాల క్వాడ్ కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 1800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే Schott Xensation గ్లాస్ ప్రొటెక్షన్ ను పొందుతోంది. ఈ ఫోన్ MIL STD 810H మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్, SGS యాంటీ ఫాల్ ప్రొటెక్షన్ ఫీచర్లు ఉన్నాయి.

3 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 పైన పనిచేస్తోంది. ఈ ఫోన్ 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుందని ఐకూ తెలిపింది. థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం కూలింగ్ ఛాంబర్‌ను కూడా ఉంది.
50MP సోనీ కెమెరా, 32MP సెల్ఫీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఈ ఐకూ స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు రెండు కెమెరాలు ఉన్నాయి. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్టుతో 50MP సోనీ IMX882 ప్రైమరీ కెమెరా ఉంది. దీంతోపాటు 2MP సెకండరీ కూడా ఉంది. Aura లైట్ కూడా ఉంది. ముందు వైపు 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ కెమెరాలు 30fps వద్ద 4K వీడియో రికార్డింగ్ సపోర్టును కలిగి ఉంది.
5700mAh బ్యాటరీ :
ఈ ఐకూ Z10R స్మార్ట్‌ఫోన్ 44W వైర్ ఛార్జింగ్ సపోర్టుతో 5700mAh బ్యాటరీని కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, వైఫై 6, బ్లూటూత్ 5.4, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. మెరుగైన ఆడియో కోసం స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








