Home
Deal of the day

రూ.8998 ధరకే 5G స్మార్ట్‌ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్!

Lava Blaze Dragon 5G Smartphone : లావా నుంచి త్వరలో లావా అగ్ని 4 5G స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కానుంది. అయితే లావా సంస్థ రూ.10 వేల కంటే తక్కువ ధరలో విడుదల చేసిన లావా బ్లేజ్‌ డ్రాగన్ 5G స్మార్ట్‌ఫోన్‌ ను ప్రస్తుతం డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ ఆకట్టుకొనే డిజైన్‌ తో అందుబాటులో ఉంది. మరియు 5000mAh బ్యాటరీ, 50MP కెమెరాను కలిగి ఉంది. ఈ లావా ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్‌ లు, ఫీచర్ల వివరాలు.

భారత్‌ మార్కెట్‌ లో లావా బ్లేజ్‌ డ్రాగన్ 5G స్మార్ట్‌ ఫోన్ విడుదల సమయంలో 4GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.9999, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.10999 గా ఉండేది. ప్రస్తుతం అమెజాన్‌ లో ( Amazon ) ఈ హ్యాండ్‌సెట్‌ ను డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేయవచ్చు.

Lava Blaze Dragon 5G smartphone

బ్యాంకు కార్డుల అవసరం లేకుండానే రూ.1000 డిస్కౌంట్ :
అమెజాన్‌లో ప్రస్తుతం రూ.1000 కూపన్ కోడ్‌ ను అందిస్తోంది. ఈ కోడ్ ను వినియోగించుకొని ఈ లావా ఫోన్‌ను రూ.8,998, రూ.9,998 ధరకే కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు బ్యాంకు కార్డులపై మరింత తగ్గింపును పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ మిడ్‌నైట్‌ మిస్ట్, గోల్టె్న్‌ మిస్ట్‌ కలర్ వేరియంట్స్‌ లో లభిస్తుంది.

లావా బ్లేజ్ డ్రాగన్ 5G స్మార్ట్‌ ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఈ ఫోన్‌ 6.75 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 450 నిట్స్ పీక్‌ బ్రైట్‌నెస్‌, 20:9 యాస్పెక్ట్‌ రేషియోను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ ప్రీమియం డిజైన్‌ ను కలిగి ఉంటుంది.

2 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ :
ఈ లావా ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ 4 జెన్‌ 2 చిప్‌సెట్‌ ను కలిగి ఉంది. ఈ చిప్‌ 4GB LPDDR4x ర్యామ్, 128GB UFS 3.1 స్టోరేజీని కలిగి ఉంది. వర్చువల్ ర్యామ్ ఫీచర్‌ ద్వారా ర్యామ్‌ ను పొడిగించుకోవచ్చు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 OS అప్‌డేట్‌, 2 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ పొందుతుంది.

50MP AI కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు 50MP AI కెమెరాను ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 8MP కెమెరాను అమర్చి ఉంది. ఈ కెమెరాలు Slow Motion, Night Mode, Time Lapse, Fliters, Pro Mode, పనోరమా మోడ్ వంటివి ఉన్నాయి.

5000mAh బ్యాటరీ :
ఈ హ్యాండ్‌సెట్ 18W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. సెక్యూరిటీ కోసం ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌, ఫేస్‌ అన్‌లాక్‌ ఫీచర్లు ఉన్నాయి. 5G, 4G VoLTE, Wi-Fi, బ్లూటూత్‌, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది. దీంతోపాటు మరిన్ని ఫీచర్లు ఉన్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Lava Blaze Dragon 5G smartphone gets Rs1000 coupon code discount on amazon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X