Home
Deal of the day

బడ్జెట్ ధరలో ఆండ్రాయిడ్‌ 16 OS, 7000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో లేటెస్ట్‌ 5G ఫోన్..!

భారత్‌ మార్కెట్‌లో 2025 సంవత్సరంలో అనేక బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఈ జనవరి నెలలోనూ అనేక మోడల్స్‌ లాంచ్‌ కానున్నాయి. ఇప్పటికే కొన్ని ఫోన్‌ల విడుదల వివరాలు వెల్లడయ్యాయి. అయితే రూ.15 వేల ధర సెగ్మెంట్లో డిసెంబర్‌ నెలలో మోటో G57 పవర్‌ 5G ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ హ్యాండ్‌సెట్‌ బడ్జెట్ ధరలో అందుబాటులోకి వచ్చినా ఆండ్రాయిడ్‌ 16 OS, 7000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్‌ పూర్తి వివరాలు.

మోటో G57 పవర్‌ స్మార్ట్‌ఫోన్‌ (Moto G57 Power 5G Smartphone) ప్రస్తుతం మోటోరోలా ఇండియా వెబ్‌సైట్‌, ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయవచ్చు. సింగిల్‌ స్టోరేజీ వేరియంట్‌లోనే అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.14999 గా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై డిస్కౌంట్‌ను అందిస్తోంది.

moto G57 Power 5G

డిస్కౌంట్‌ ఆఫర్లు :
అదే విధంగా మోటోరోలా వెబ్‌సైట్‌లో SBI, ICICI బ్యాంకు కార్డులపై రూ.1000 డిస్కౌంట్‌ను అందిస్తోంది. IDFC కార్డు EMI లావాదేవీలపై రూ.1500 డిస్కౌంట్‌, యాక్సెస్‌ బ్యాంకు EMI లావాదేవీలపై రూ.1250 డిస్కౌంట్‌ను అందిస్తోంది. దీంతోపాటు SBI, ICICI బ్యాంకు క్రెడిట్‌ కార్డులపై 6 నెలల వరకు నో కాస్ట్‌ EMI సదుపాయాన్ని అందిస్తోంది.

మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌ :
మోటో G57 పవర్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ MIL STD 810H మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. IP64 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ పాంటోర్‌ ప్యూడిటీ, పాంటోన్‌ రెగట్టా, పాంటోన్‌ కోర్సెయిర్‌ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తోంది.

moto G57 Power 5G

స్మార్ట్‌వాటర్‌ టచ్‌ ఫీచర్‌ :
ఈ హ్యాండ్‌సెట్‌ 6.72 అంగుళాల FHD+ LCD డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 1050 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, 120Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే స్మార్ట్‌వాటర్‌ టచ్‌ 2.0 ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 7i ప్రొటెక్షన్‌ను పొందుతోంది.

స్నా్ప్‌డ్రాగన్‌ చిప్‌సెట్ :
ఈ మోటో ఫోన్ స్నాప్‌డ్రాగన్‌ 6s జెన్‌ 4 చిప్‌సెట్‌ ను కలిగి ఉంది. ఈ చిప్ 4GB LPDDR4X ర్యామ్, 128GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్‌ 16 ఆధారిత OS పైన పనిచేస్తోంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 17 OS అప్‌డేట్‌, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుందని సంస్థ హామీ ఇచ్చింది.

50MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరా యూనిట్‌ ఉంది. ఇందులో 50MP సోనీ LYT 600 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ లెన్స్‌, 2 ఇన్ 1 లైట్‌ సెన్సర్‌ ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 8MP కెమెరాను కలిగి ఉంది. ఈ కెమెరాలు 60fps వద్ద 2K వీడియో రికార్డింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.

7000mAh బ్యాటరీ :
ఈ కెమెరా విభాగం మేజిక్‌ ఎరేజర్, షాట్‌ ఆప్టిమైజేషన్‌, ఫోటో అన్‌బ్లర్‌, ఆటో ఫ్రేమ్‌, సినిమాటిక్‌ ఫోటోస్‌, పొర్ట్రెయిట్ బ్లర్‌, పొర్ట్రెయిట్‌ లైట్‌ వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఈ ఫోన్‌ 33W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 7000mAh బ్యాటరీని కలిగి ఉంది.

కనెక్టివిటీ పరంగా ఈ హ్యాండ్‌సెట్ 5G, 4G LTE, బ్లూటూత్‌ 5.1, Wi-Fi, USB-C ఛార్జింగ్‌ పోర్టు, GPS ఫీచర్లు ఉన్నాయి. దీంతోపాటు యాంబియంట్‌ లైట్‌, ప్రాక్సిమిటీ సెన్సర్‌, ఇ-కంపాస్‌, గైరోస్కో్ప్‌ వంటి సెన్సర్‌లున్నాయి. సెక్యూరిటీ కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్లు ఉన్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
moto G57 Power 5G Smartphone with 7000mAh battery now available at Rs14999 price in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X