Home
Deal of the day

ఈ ఫోన్‌పై గరిష్ఠంగా రూ.5 వేల డిస్కౌంట్.. 3D కర్వడ్ డిస్‌ప్లే, 50MP కెమెరా, టర్బో ఛార్జింగ్‌ సహా..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ భారత్‌ మార్కెట్‌లో ఈ సంవత్సరం అనేక ఫోన్‌లను లాంచ్‌ చేసింది. ఇటీవల విడుదల అయిన మోటోరోలా అల్ట్రా స్లిమ్‌ మోడల్‌ ఫోన్‌ ఎడ్జ్ 70 సేల్‌ ఇవాళ్టి నుంచే ప్రారంభం అయింది. గత సంవత్సరం విడుదల అయిన మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్‌ స్మార్ట్‌ఫోన్‌ను ప్రస్తుతం భారీ డిస్కౌంట్‌ ధరకు అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ ఆకట్టుకొనే డిస్‌ప్లేతోపాటు 3D కర్వడ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్‌ ప్రాసెసర్ సహా మెరుగైన స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లను కలిగి ఉంది.

ధర, సేల్‌ వివరాలు :
భారత్‌లో విడుదల సమయంలో మోటోరోలా ఎడ్జ్‌ 50 ఫ్యూజన్‌ హ్యాండ్‌సెట్ (Motorola Edge 50 Fusion 5G Smartphone) 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.22999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ రూ.24999 గా ఉండేది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌ల ధరలు వరుసగా రూ.17,999, రూ.20,999 గా ఉంది.

Motorola Edge 50 Fusion 5G pricedrop

గరిష్ఠంగా రూ.5 వేల డిస్కౌంట్‌ :
అంటే గరిష్ఠంగా రూ.5 వేల డిస్కౌంట్‌తో ఈ ఫోన్‌ అందుబాటులో ఉంది. దీంతోపాటు బ్యాంకు కార్డులపై మరింత డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ మోటో స్మార్ట్‌ఫోన్ ఫారెస్ట్‌ బ్లూ, హాట్ పింక్‌, ఫారెస్ట్ గ్రీన్‌, మార్స్‌మల్లో బ్లూ కలర్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.

ఫుల్‌ HD+ డిస్‌ప్లే కర్వడ్‌ డిస్‌ప్లే :
మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ 5G స్మార్ట్‌ఫోన్‌ 6.7 అంగుళాల FHD+ pOLED 3D కర్వడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 144Hz రీఫ్రెష్‌ రేట్‌, 1600 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. దీంతోపాటు కార్నింగ్‌ గొరెల్లా గ్లాస్‌ 5 ప్రొటెక్షన్‌ను పొందుతోంది. IP68 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

Motorola Edge 50 Fusion 5G pricedrop

4 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ :
ఈ ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ 7s జెన్‌ 2 SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంది. దీంతోపాటు Adreno 710 GPU ను కూడా అమర్చి ఉంది. ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత Hello UI పైన పనిచేస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ 3 ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్‌, 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుందని మోటో హామీ ఇచ్చింది.

50MP కెమెరా, 32MP సెల్ఫీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ (OIS) సపోర్టుతో 50MP సోనీ LYT 700C ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు 13MP అల్ట్రావైడ్‌ లెన్స్‌ కూడా ఉంది. LED ఫ్లాష్‌ లైట్‌ కూడా ఉంది. ముందు వైపు 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

టర్బో ఛార్జింగ్‌ :
ఈ ఫోన్‌ 68W టర్బో ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G, WiFi, బ్లూటూత్ 5.2, GPS, NFC, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది. దీంతోపాటు మోటో కనెక్ట్‌ ఫ్యామిలీ స్పేస్‌ కూడా ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Motorola Edge 50 Fusion 5G Smartphone gets Rs5000 pricedrop on flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X