OnePlus ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. తొలిసారి అత్యంత తక్కువ ధరకు వన్‌ప్లస్ 12R స్మార్ట్‌ఫోన్..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లు, గ్యాడ్జెట్‌ల తయారీ సంస్థ వన్‌ప్లస్ నుంచి ప్రస్తుతం బడ్జెట్ నుంచి ఫ్లాగ్‌షిప్ రేంజ్ వరకు అనేక హ్యాండ్‌సెట్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇటీవల భారత్ మార్కెట్‌లో వన్‌ప్లస్ 13, వన్‌ప్లస్ 13R స్మార్ట్‌ఫోన్‌లు విడుదల అయ్యాయి. ప్రస్తుతం వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్, ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం అమెజాన్‌లో వన్‌ప్లస్ 12R స్మార్ట్‌ఫోన్‌ను భారీ డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు బ్యాంకు ఆఫర్ల ద్వారా మరింత తగ్గింపు ధరను పొందవచ్చు. మొత్తంగా రూ.30000 కంటే తక్కువ ధరకే ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు.
భారత్ మార్కెట్‌లో వన్‌ప్లస్ 12R స్మార్ట్‌ఫోన్ (OnePlus 12R Smartphone Lowest ever price) 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్స్‌లో లభిస్తుంది. గత సంవత్సరం జనవరిలో ఈ ఫోన్ విడుదల అయింది. విడుదల సమయంలో ఈ ఫోన్ కేవలం రెండు వేరియంట్స్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.

అనంతరం మార్చి నెలలో 8GB ర్యామ్ + 256GB వేరియంట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. విడుదల సమయంలో ఈ ఫోన్ ధరలు వరుసగా రూ.39,999, రూ.42,999, రూ.45,999 గా ఉన్నాయి. ప్రస్తుతం అమెజాన్, వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్‌లో భారీ డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు.
రూ.3000 డిస్కౌంట్ :
ప్రస్తుతం అమెజాన్‌లో (OnePlus 12R Amazon Discount) 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.32999 కే సొంతం చేసుకోవచ్చు. దీంతోపాటు HDFC, ICICI బ్యాంకు, డెబిట్ కార్డులపై గరిష్ఠంగా రూ.3000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫలితంగా ఈ ఫోన్‌ను రూ.29,999 కే సొంతం చేసుకోవచ్చు.

వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్‌లో 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.29999 గా ఉంది. ఇతర వేరియంట్స్ ధరలు రూ.32999, రూ.35999 గా ఉన్నాయి. ICICI, RBL, వన్‌కార్డ్, HDFC కార్డులపై గరిష్ఠంగా రూ.3000 డిస్కౌంట్‌ను పొందవచ్చు.
వన్‌ప్లస్ 12R స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
వన్‌ప్లస్ 12R స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.78 అంగుళాల 1.5K LTPO Pro XDR డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే డాల్బీ విజన్‌ను సపోర్టు చేస్తుంది. కార్నింగ్ గొరెల్లా గ్లాస్ విక్టస్ 2 రక్షణ పొందుతుంది.
శక్తివంతమైన చిప్‌సెట్, భారీ బ్యాటరీ :
వన్‌ప్లస్ హ్యాండ్‌సెట్ 4nm స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 SoC ప్రాసెసర్‌తో పనిచేస్తోంది. మరియు ఆండ్రాయిడ్ 14 ఆధారిత OxygenOS 14 ను కలిగి ఉంది. 100W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీతో అందుబాటులో ఉంది.
ట్రిపుల్ కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. 50MP సోనీ IMX890 ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. ఈ ప్రైమరీ కెమెరా f/1.8 అపేచర్, OIS ను సపోర్టు చేస్తుంది. f/2.2 అపేచర్‌తో 8MP అల్ట్రావైడ్ యాంగిల్, f/2.4 అపేచర్‌తో 2MP మాక్రో లెన్స్‌ను కలిగి ఉంది. మరియు 16MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులో ఉంది.
డాల్బీ అట్మాస్ సపోర్టుతో :
కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, బ్లూటూత్ 5.3, Wi-Fi 6E, NFC, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. భద్రత కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు. మెరుగైన సౌండ్ క్వాలిటీ కోసం డాల్బీ అట్మాస్ స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది. IP64 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.


Click it and Unblock the Notifications








