Home
Deal of the day

ఈ స్మార్ట్‌ఫోన్‌ పై రూ.5000 తగ్గింపు.. 6000mAh బ్యాటరీ, 6.83 అంగుళాల డిస్‌ప్లే. 50MP సోనీ కెమెరా..!

భారత్‌ మార్కెట్‌లో ఈ సంవత్సరం తొలి భాగంలో రియల్‌మి P3 సిరీస్‌ విడుదల అయింది. ఈ సిరీస్‌ లో భాగంగా ఇప్పటికే రియల్‌మి P3, P3 అల్ట్రా 5G, P3x 5G, P3 ప్రో స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్‌ అయ్యాయి. సెప్టెంబర్‌ 13 వ తేదీన ఈ సిరీస్‌ నుంచి రియల్‌మి P3 లైట్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల అయింది. సెప్టెంబర్‌ 22 వ తేదీ నుంచి ఈ హ్యాండ్‌సెట్ సేల్‌ ప్రారంభం కానుంది.

అయితే ఈ సిరీస్‌ లో భాగంగా అందుబాటులోకి వచ్చిన రియల్‌మి P3 అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్‌ ను (Realme P3 Ultra 5G Smartphone) భారీ డిస్కౌంట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ 2025 లో ఈ హ్యాండ్‌సెట్ డిస్కౌంట్ ధరకు అందుబాటులోకి వస్తుందని అంచనా వేసినా, అంతకు ముందుగానే డిస్కౌంట్ ధరకు అందుబాటులోకి వచ్చింది.

Realme P3 Ultra 5G Smartphone 128GB Storage variant gets Rs5000 pricedrop on flipkart

రూ.5000 డిస్కౌంట్‌ ఆఫర్‌ :
భారత్‌ మార్కెట్‌లో విడుదల సమయంలో రియల్‌మి P3 అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ ధర రూ.26999 గా ఉండేది. అయితే ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌ లో రూ.21999 ధరకే లభిస్తోంది. అంటే రూ.5000 డిస్కౌంట్‌ ను పొందవచ్చు. ఇతర వేరియంట్స్‌ ధరలు రూ.27,999, రూ.29,999 గా ఉంది.

రియల్‌మి P3 అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్‌ పూర్తి వివరాలు :
ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్‌ డైమెన్సిటీ 8350 అల్ట్రా ప్రాసెసర్‌ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6.0 OS పైన పనిచేస్తోంది. ఈ హ్యాండ్‌సెట్‌ 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.

Realme P3 Ultra 5G Smartphone 128GB Storage variant gets Rs5000 pricedrop on flipkart

భారీ డిస్‌ప్లే, భారీ బ్యాటరీ :
ఈ హ్యాండ్‌సెట్ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.83 అంగుళాల 1.5K క్వాడ్ కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే రెయిన్‌ వాటర్‌ టచ్‌ ఫీచర్‌ను కలిగి ఉంటుంది. తడి చేతులతోనూ ఫోన్‌ను వినియోగించుకోవచ్చు. మరియు 80W AI బైపాస్‌ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.

సోనీ OIS కెమెరా :
కెమెరా విభాగం పరంగా OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP సోనీ IMX896 కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ కెమెరా, 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్‌ AI మోషన్ కంట్రోల్‌, AI అల్ట్రా టచ్ కంట్రోల్‌, GT బూస్ట్‌ గేమింగ్‌ ఫీచర్‌లను కలిగి ఉంది.

Realme P3 Ultra 5G Smartphone 128GB Storage variant gets Rs5000 pricedrop on flipkart

ఏరోస్పేస్‌ గ్రేడ్ వేపర్‌ కూలింగ్ ఛాంబర్‌ :
ఈ ఫోన్‌ థర్మల్‌ మేనేజ్‌మెంట్‌ కోసం 6050mm2 ఏరోస్పేస్‌ గ్రేడ్ VC కూలింగ్‌ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ లెదర్‌ ఫినిష్‌తోపాటు గ్లోయింగ్‌ లూనార్‌ డిజైన్‌ను కలిగి ఉంది. వైఫై 6, బ్లూటూత్‌ 5.4 వంటి ఫీచర్‌లను కలిగి ఉంది. ఈ ఫోన్ నెప్ట్యూన్‌ బ్లూ, ఓరియన్ రెడ్ వేరియంట్స్‌లో లభిస్తుంది.

Best Mobiles in India

English summary
Realme P3 Ultra 5G Smartphone 128GB Storage variant gets Rs5000 pricedrop on flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X