Home
Deal of the day

7000mAh బ్యాటరీ, 6.8 అంగుళాల భారీ డిస్‌ప్లే, రెండు చిప్‌ల 5G ఫోన్‌పై డిస్కౌంట్‌..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ రియల్‌మి ఈ సంవత్సరం ఆగస్టు నెలలో రియల్‌మి P4 సిరీస్‌ను విడుదల చేసింది. ఇందులో P4, P4 ప్రో 5G ఫోన్‌లు లాంచ్‌ అయ్యాయి. రియల్‌మి P4 5G స్మార్ట్‌ఫోన్‌ ఇప్పటికే డిస్కౌంట్ ధరకు అందుబాటులోకి ఉండగా.. ప్రో మోడల్‌ పైనా ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్‌ అందిస్తోంది. ఈ ప్రో మోడల్‌ స్మార్ట్‌ఫోన్ 7000mAh భారీ బ్యాటరీ సహా రెండు చిప్‌లను కలిగి ఉంటుంది. ఈ రియల్‌మి P4 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు.

ధర వివరాలు :
విడుదల సమయంలో రియల్‌మి P4 ప్రో 5G ఫోన్ (Realme P4 Pro 5G Smartphone) 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ ధర రూ.24,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.26,999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.28,999 గా ఉండేది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌ లో డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేయవచ్చు.

Realme P4 Pro 5G

అంటే ఈ ఫోన్‌ వేరియంట్స్‌లు ప్రస్తుతం రూ.2 వేల డిస్కౌంట్‌తో అందుబాటులో ఉన్నాయి. అంటే రూ.22,999, రూ.24,999, రూ.26,999 కే కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై 10 శాతం అదనపు డిస్కౌంట్‌ను పొందవచ్చు.

6.8 అంగుళాల భారీ డిస్‌ప్లే :
రియల్‌మి P4 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 6.8 అంగుళాల FHD+ అమోలెడ్ 4D కర్వ్+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 144Hz రీఫ్రెష్‌ రేట్‌, 6500 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌ను పొందుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ బిర్చ్ వుడ్‌, డార్క్‌ ఓక్‌, మిడ్‌నైట్‌ ఐవీ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

50MP + 50MP కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు రెండు కెమెరాలను కలిగి ఉంది. ఇందులో ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ (OIS) సపోర్టుతో 50MP సోనీ IMX896 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా వైడ్‌ కెమెరాలను కలిగి ఉంది. మరియు 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

7000mAh భారీ బ్యాటరీ :
ఈ ఫోన్‌ కెమెరాలకు 60fps వద్ద 4K వీడియోలను రికార్డు చేసే సామర్థ్యం ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ AI Landscape, ఏఐ పార్టీ మోడ్‌, ఏఐ టెక్ట్స్ స్కానర్‌, ఏఐ స్కాప్‌ మోడ్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ 80W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌, 10W రివర్స్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 7000mAh బ్యాటరీతో అందుబాటులో ఉంది.

Realme P4 Pro 5G

రియల్‌మి P4 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ 7 జెన్‌ 4 SoC ప్రాసెసర్‌ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6 పైన పనిచేస్తోంది. ఈ ఫోన్‌ Hyper Vision చిప్‌ను కూడా అమర్చారు. మెరుగైన గేమ్‌ ప్లే, ఫ్రేమ్ రేట్‌ను అందిస్తుందని సంస్థ చెబుతోంది.

ఈ హ్యాండ్‌సెట్‌ థర్మల్‌ మేనేజ్‌మెంట్ కోసం 7000 sq mm ఎయిర్‌ఫ్లో VC కూలింగ్‌ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ BGMI 144fps ను సపోర్టు చేస్తుంది. IP65 + IP66 రేటింగ్‌తో డస్ట్, వాటర్‌ రిసెస్టెంట్‌గా ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme P4 Pro 5G smartphone with 7000mAh Battery, hyper Vision chip gets discount on flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X