రూ.1,299కే బోట్ స్టార్మ్ ఇన్ఫినిటీ స్మార్ట్‌వాచ్ విడుదల.. 1.83 అంగుళాల HD డిస్‌ప్లే, 15 రోజుల బ్యాటరీ..
boAt Storm Infinity smartwatch: ప్రముఖ వేరబుల్ బ్రాండ్ బోట్ అదిరిపోయే కొత్త స్మార్ట్ వాచ్‌ను భారతీయ మార్కెట్లోకి తెచ్చింది. అదే బోట్ స్టార్మ్ ఇన్ఫినిటీ (boAt Storm Infinity). పేరుకు తగ్గట్టే ఇది బోలెడన్ని ఫీచర్లతో వచ్చింది. ముఖ్యంగా స్టైలిష్ డిజైన్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు, అందుబాటు ధరలో ఈ వాచ్ రావడం విశేషం. మరి దీని ఫీచర్లతో పాటు దీని ధర ఎంత నిర్ణయించారో తెలుసుకుందాం.
* ధర ఎంతంటే..
1.83 అంగుళాల HD డిస్‌ప్లే, బ్లూటూత్ కాలింగ్, లాంగ్ బ్యాటరీ లైఫ్ వంటి ఫీచర్లతో ఈ వాచ్ బడ్జెట్ స్మార్ట్‌వాచ్ సెగ్మెంట్‌లో గట్టి పోటీ ఇచ్చేలా ఉంది. బోట్ స్టార్మ్ ఇన్ఫినిటీ స్మార్ట్‌వాచ్ ధర కేవలం రూ.1,299 మాత్రమే. లాంచ్ ఆఫర్‌లో భాగంగా కొన్ని బ్యాంక్ కార్డ్‌లతో కొంటే అదనంగా రూ.100 డిస్కౌంట్ కూడా ఉంది.

* కలర్స్
ఈ వాచ్ ఏకంగా ఎనిమిది రంగుల్లో లభిస్తుంది. యాక్టివ్ బ్లాక్, చెర్రీ బ్లోసమ్, బ్రౌన్, డీప్ బ్లూ, జేడ్ గోల్డ్, సిల్వర్ మిస్ట్, స్పోర్ట్స్ బ్లాక్, స్పోర్ట్స్ గ్రీన్ కలర్ ఆప్షన్స్‌లో మీ టేస్ట్‌కు తగ్గట్టు ఎంచుకోవచ్చు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, బోట్ వెబ్‌సైట్‌తో పాటు దగ్గరలోని ఆఫ్‍లైన్ స్టోర్లలో కూడా ఈ వాచ్ అందుబాటులో ఉంది.
* డిస్‌ప్లే, డిజైన్, బ్యాటరీ, చార్జింగ్
బోట్ స్టార్మ్ ఇన్ఫినిటీ వాచ్‌లో 1.83 ఇంచ్ HD డిస్‌ప్లే ఇచ్చారు. 240×284 రిజల్యూషన్, 550 నిట్స్ బ్రైట్‌నెస్ ఉండటంతో సూర్యరశ్మిలో కూడా స్క్రీన్ చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. \"ఫ్లిక్-టు-వేక్\" అనే సూపర్ ఫీచర్ కూడా ఉంది. అంటే జస్ట్ మణికట్టును తిప్పితే చాలు స్క్రీన్ ఆన్ అవుతుంది.
అంతేకాదు, వాచ్ సైడ్‌కి తిరిగే క్రౌన్ బటన్ కూడా ఇచ్చారు. దీని ద్వారా వాచ్‌ను ఈజీగా ఆపరేట్ చేయొచ్చు. డిజైన్ మాత్రం చాలా స్టైలిష్‌గా, ప్రీమియం లుక్‌లో ఉంది. ఈ వాచ్‌లో ఏకంగా 550mAh బ్యాటరీ ఇచ్చారు. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే సాధారణ వినియోగంలో 15 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ వస్తుంది.
అదే ఎక్కువగా వాడితే 10-12 రోజుల వరకు వస్తుందట. చార్జింగ్ గురించి అస్సలు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇందులో ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. కేవలం 60 నిమిషాల్లోనే 0 నుంచి 100% వరకు చార్జింగ్ అయిపోతుంది. ఫాస్ట్ ఛార్జింగ్ ఉండటం వల్ల బిజీగా ఉండేవారికి, హడావిడిగా వెళ్లేవాళ్లకి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది
* కాలింగ్, కనెక్టివిటీ
బోట్ స్టార్మ్ ఇన్ఫినిటీ స్మార్ట్‌వాచ్‌లో బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ కూడా ఉంది. బిల్ట్-ఇన్ మైక్, స్పీకర్ ఉండటంతో ఫోన్ తీయకుండానే వాచ్ నుంచే నేరుగా మాట్లాడొచ్చు. అంతేకాదు, డయల్ ప్యాడ్ కూడా ఉంది. దీని ద్వారా 10 కాంటాక్ట్‌లను సేవ్ చేసుకోవచ్చు. ఫోన్ ఎక్కడైనా మిస్సైతే \"ఫైండ్ మై డివైస్\" ఫీచర్ ద్వారా ఈజీగా కనిపెట్టొచ్చు.
* హెల్త్, ఫిట్‌నెస్ ట్రాకింగ్
ఈ వాచ్‌లో హెల్త్, ఫిట్‌నెస్ ఫీచర్లు కూడా చాలా ఉన్నాయి. హార్ట్ రేట్ సెన్సార్, SpO2 మానిటర్, స్లీప్ ట్రాకింగ్, స్ట్రెస్ ట్రాకింగ్ వంటి ఫీచర్లతో మీ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తుంది. ఆడవాళ్ల కోసం మెన్స్ట్రువల్ సైకిల్ ట్రాకింగ్ కూడా ఉంది. గైడెడ్ బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్‌లు కూడా ఉన్నాయి.
ఫిట్‌నెస్ కోసం 100కు పైగా స్పోర్ట్స్ మోడ్స్ ఇచ్చారు. వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్ వంటి చాలా యాక్టివిటీస్‌ను ఈ వాచ్ ట్రాక్ చేస్తుంది. క్యాలరీలు, స్టెప్స్ వంటివి కూడా లెక్కిస్తుంది. ఎక్కువసేపు కూర్చుంటే సెడెంటరీ అలర్ట్స్, వాటర్ రిమైండర్లు కూడా ఇస్తుంది.
* ఇతర ఫీచర్లు
బోట్ స్టార్మ్ ఇన్ఫినిటీ వాచ్ మన్నిక విషయంలో కూడా సూపర్. IP68 రేటింగ్‌తో వస్తుంది. అంటే డస్ట్, స్వెట్, వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. వ్యాయామాలు చేసేటప్పుడు, బయట అంటే ఔట్‌డోర్స్‌లో వాడేటప్పుడు అస్సలు భయపడాల్సిన పనిలేదు. SOS ఎమర్జెన్సీ అలర్ట్స్, వెదర్ అప్‌డేట్స్, మ్యూజిక్, కెమెరా కంట్రోల్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
అలారం, స్టాప్‌వాచ్, ఫ్లాష్‌లైట్, క్యాలెండర్, గేమ్స్ కూడా ఇందులో ఉండటం విశేషం. మొత్తానికి తక్కువ ధరలో అన్ని ఫీచర్లతో వస్తున్న ఈ బోట్ స్టార్మ్ ఇన్ఫినిటీ స్మార్ట్‌వాచ్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.


Click it and Unblock the Notifications








