Home
Gadgets

వామ్మో, ఈ 5 క్రేజీ టీవీలు చూస్తే దిమ్మతిరిగిపోద్ది.. భవిష్యత్తుని ముందే చూపించాయ్!

Crazy TVs: సాధారణంగా టీవీలు స్వల్ప మార్పులతో వస్తుంటాయి, పోతుంటాయి. కానీ కొన్ని టీవీలు మాత్రం టెక్నాలజీ పరంగా సంచలనం సృష్టించి పరిశ్రమ రూపురేఖలనే మార్చేశాయి. అవి తమ కాలం కంటే ముందే అత్యాధునిక ఫీచర్లతో వచ్చాయి. అయితే అధిక ధరలు లేదా తయారీ సమస్యల కారణంగా ఎక్కువ కాలం నిలబడలేకపోయాయి. అలాంటి ఐదు వింత ఫ్యూచరిస్టిక్ టీవీల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

* LG R1 రోలబుల్ OLED - మాయమయ్యే టీవీ

LG R1 రోలబుల్ OLED ఒక ఇంజనీరింగ్ అద్భుతం. వాడనప్పుడు ఒక బాక్స్‌లాంటి బేస్‌లోకి చుట్టుకుపోయేది. చూడటానికి చాలా ఫ్యూచరిస్టిక్‌గా, స్టైలిష్‌గా ఉండేది. ఇండియాలో దీన్ని 75 లక్షల రూపాయలకు రిలీజ్ చేశారు. ఇది టెక్నాలజీ అద్భుతం కంటే లగ్జరీ వస్తువులా అనిపించింది.

5 Crazy TVs That Predicted the Future We Have Now

కానీ ఎక్కువ ధర, తక్కువ డిమాండ్ వల్ల ఇది మార్కెట్లో ఎంతో కాలం నిలబడలేకపోయింది. 2024 నాటికి LG రోలబుల్ OLED టీవీ మోడల్స్ అన్నీ ఆపేసింది. రోలబుల్ స్క్రీన్లకు ఇంకా ఫ్యూచర్ ఉన్నా, R1 మాత్రం భవిష్యత్తు కోసం వేసిన ఒక పెద్ద అడుగు, కానీ ప్రాక్టికల్‌గా కుదరలేదు అంతే.

* శాంసంగ్ 55-అంగుళాల S9C - నిజమైన OLED బాటలు వేసింది..

2013లో వచ్చిన శాంసంగ్ S9C టీవీయే తొలి OLED టీవీ. ఇది ఇప్పటికీ స్పెషల్ టీవీనే. ఇప్పుడు వచ్చే OLEDల్లా కాకుండా WOLED, QD-OLED టెక్నాలజీ వాడతారు. ఈ S9Cలో ఒక్కో పిక్సెల్‌కి విడివిడిగా ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగు సబ్ పిక్సెల్స్ ఉండేవి. స్మార్ట్‌ఫోన్ OLED స్క్రీన్లలో ఎలా ఉంటాయన్నమాట.

దీనివల్ల కలర్స్ చాలా కరెక్ట్‌గా, బ్రైట్‌గా కనిపించేవి. ఫిల్టర్లు కూడా అవసరం లేదు. కానీ దీన్ని ఎక్కువ సంఖ్యలో తయారు చేయడం కష్టం అయిపోయింది. అందుకే శాంసంగ్ ఇంకో మోడల్ చేయలేదు. OLED టీవీలు చాలా మారాయి కానీ, S9C లాగా డైరెక్ట్ RGB సబ్ పిక్సెల్ స్ట్రక్చర్ మాత్రం మరే టీవీకీ లేదు.

* షార్ప్ అక్వాస్ క్వాట్రాన్ – ఎక్స్‌ట్రా పసుపు రంగు ప్రయోగం

షార్ప్ అక్వాస్ క్వాట్రాన్ (Sharp Aquos Quattron) సిరీస్ కలర్ క్వాలిటీని పెంచడానికి ఒక కొత్త ప్రయత్నం చేసింది. రెడ్, గ్రీన్, బ్లూ కలర్స్‌కి తోడుగా పసుపు రంగు సబ్ పిక్సెల్‌ని కూడా యాడ్ చేసింది. దీనివల్ల బ్రైట్‌నెస్ పెరుగుతుంది, కలర్స్ మరింత నేచురల్‌గా కనిపిస్తాయి అనుకున్నారు.

కానీ నిజానికి పెద్దగా ఇంప్రూవ్‌మెంట్ ఏమీ కనిపించలేదు, ఇండస్ట్రీ కూడా దీన్ని పట్టించుకోలేదు. ఎక్కువ ధర, నాలుగు రంగుల డిస్‌ప్లే కోసం కంటెంట్ లేకపోవడం వల్ల ఇది ఫెయిల్ అయిపోయింది. కానీ టీవీ టెక్నాలజీలో ఇది ఒక బోల్డ్ ఎక్స్‌పెరిమెంట్ మాత్రం.

* సోనీ KDL-55XBR8 - మినీ LED కాన్సెప్ట్ అప్పుడే వచ్చింది

ఇప్పుడు మినీ LED టెక్నాలజీ హాట్ టాపిక్, కానీ సోనీ దీన్ని 2008లోనే KDL-55XBR8 టీవీతో పరిచయం చేసింది. దీనిలో ఫుల్-అరే LED బ్యాక్‌లైట్ ఉండేది. అంటే విడివిడిగా కంట్రోల్ చేసే ఎరుపు, ఆకుపచ్చ, నీలం LED లైట్లు, దీనివల్ల పిక్చర్ క్వాలిటీ అదిరిపోయేలా ఉండేది.

కలర్స్ కూడా చాలా కరెక్ట్‌గా వచ్చేవి. కానీ దీని ఉత్పత్తి ఖర్చు చాలా పెరిగిపోయింది. ఆ టెక్నాలజీ అత్యంత సంక్లిష్టమైనది. అందుకే వాటిని తయారు చేయడం కష్టమైంది. దాంతో ఇది మాయమైపోయింది. మళ్లీ పదేళ్ల తర్వాత మినీ LED బ్యాక్‌లైటింగ్ ప్రీమియం టీవీల్లోకి రీఎంట్రీ ఇచ్చింది.

* శాంసంగ్ 110- అంగుళాల మైక్రో LED టీవీ

మైక్రో LED అంటే OLEDలో ఉన్న మంచి ఫీచర్స్ (పర్ఫెక్ట్ బ్లాక్స్, పిక్సెల్ లైటింగ్) అన్నీ ఉంటాయి, కానీ OLEDలో ఉన్న ప్రాబ్లమ్స్ (బర్న్-ఇన్, తక్కువ బ్రైట్‌నెస్) ఉండవు. శాంసంగ్ ప్రపంచంలోనే ఫస్ట్ కన్స్యూమర్-రెడీ మైక్రో LED టీవీని CES 2021లో చూపించింది. అది ఏకంగా 110-అంగుళాల స్క్రీన్.

సెల్ఫ్-ఎమిసివ్ మైక్రో LEDలతో అదిరిపోయింది. మిగతా పయినీరింగ్ టీవీల్లాగా మైక్రో LED చచ్చిపోలేదు. ఇది ఇంకా ఖరీదైనది, డెవలప్ అవుతూనే ఉంది. Hisense లాంటి కంపెనీలు కూడా రేసులోకి వచ్చాయి. ఒకరోజు ఈ టెక్నాలజీ హై-ఎండ్ హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో OLEDని కూడా దాటేస్తుంది ఏమో.

More from GizBot

Best Mobiles in India

English summary
Groundbreaking TVs like rollable OLED and RGB OLED predicted display tech trends yet met production and cost hurdles, unlike Micro LED's progress.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X